సబ్ ఫీచర్

శాంతి వర్థిల్లుగాక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీలాద్ - ఉన్ - నబీ.. అరబ్బుల మత, రాజకీయ నాయకుడు, ఇస్లాం చివరి ప్రవక్త ముహమ్మద్ లేదా మహమ్మద్. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరోపాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదామ్ ప్రవక్తతో ప్రారంభమైనది. అనేక ప్రవక్తల గొలుసు క్రమంలో మహమ్మద్ చివరివారు. ముస్లిమేతరులు సాధారణంగా మహమ్మద్‌ను ఇస్లాంమత స్థాపకునిగా భావిస్తారు. కాని ఇస్లాం మతం ప్రారంభమైంది ఆది పురుషుడైన ఆదమ్ ప్రవక్తతో అని విశ్వాసం.
సాంప్రదాయ ముస్లిం జీవితకర్తల ప్రకారం మహమ్మద్ సి.570లో మక్కాలో జన్మించి, 8వ జూన్, 632లో మదీనాలో పరమపదించారు. మక్కా, మదీనా రెండూ అరేబియన్ ద్వీపకల్పం లోనివే. ఖురాన్‌లో ‘‘ముహమ్మద్’’ అని పేర్కొనబడింది. ముహమ్మద్ అనే పదానికి అరబ్బీ మూలం హమ్ద్ (హ మ్ ద్) అర్థం. హమ్ద్ పదానికి ము చేర్చిన ముహమ్‌మద్ అగును. అంటే శ్లాఘించ బడిన వాడు లేదా కీర్తించ బడినవాడు అని అర్థం. ఈ పేరునే ముహమ్మద్, మొహమ్మద్, మహమ్మద్, మహమ్మదు అని రాస్తారు. టర్కీవాసులు మహ్మెట్ లేదా మహమెట్ అని, అహ్మద్ అనీ పలుకుతారు. మహమ్మద్ తొలి ముస్లిం మూల నివేదిక ప్రకారం 611లో 40 ఏళ్ళ వయసులో హిరా గుహలో ధ్యానం చేస్తుండగా, దివ్య దృష్టిని పొందారు. ఈ విషయాన్ని సమీప వ్యక్తులకు వర్ణిస్తుండగా, దేవదూత జిబ్రారుూల్ ఆయనకు కనిపించి, ఖురాన్ ప్రవచనాలను గుర్తు పెట్టుకుని, ఇతరులకు బోధించమని అల్లాహ్ ఆదేశించినట్లు చెపుతారు. మహమ్మద్, అరబ్బులకు తెలిసిన జుడాయిజమ్ (యూదమతము)ను కాని క్రైస్తవ మతాన్ని కాని పూర్తిగా తిరస్కరించ లేదు.
ఇబ్రాహీం ప్రవక్త అవలంబించిన ఇస్లాం మతమును ప్రకటిస్తున్నానని చాటారు. తక్కువ సమయంలోనే అనేకుల విశ్వాసం పొందినా, విగ్రహారాధనావలంబీకులైన అరబ్ తెగల ద్వేషాన్ని తప్పించు కోవడానికి తాత్కాలికంగా 622లో మక్కా నుండి వలస వెళ్ళి, తన సహచరులతో కలిసి యస్రిబ్ (నేటి మదీనా)లో స్థిరపడినారు. ఇక్కడే మహమ్మద్ తొలి ముస్లిం సముదాయమును స్థాపించి, నాయకులైనారు.
తర్వాత ఖురేషులు మరియు మదీనా వాసులైన విశ్వాసులకు మధ్య జరిగిన యుద్ధంలో మహమ్మద్, ఆయన అనుచరులు విజయం సాధించారు. మహమ్మద్ మృతి చెందే నాటికి అరేబియా ద్వీప కల్పాన్ని సమైక్య పరిచి, ఉత్తరాన సిరియా మరియు పాలస్తీనా ప్రాంతాలలో ఇస్లాంను వ్యాపింప చేశారు. మహమ్మద్ తర్వాత ఖలీఫాల నేతృత్వంలో ఇస్లామీయ సామ్రాజ్యం పాలస్తీనా, సిరియా, ఇరాక్, ఇరాన్, ఈజిప్టు, ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్ దేశాలకు వ్యాపించింది. ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య వర్తక సంబంధాలు, మత ప్రచార కార్యకలాపాలు మహమ్మద్ ప్రవచించిన మతాన్ని భూమి నలు చెరగులా వ్యాప్తి చెందించడానికి దోహదపడ్డాయి.
ముహమ్మద్ జీవితాన్ని గురించి ఖురాన్, సీరత్, హదీస్ సేకరణలు తెలుపుతున్నాయి. హదిత్ సేకరణలలో ముహమ్మద్ జీవితానికి సంబంధించి అనేక అప్రామాణిక సాంప్రదాయాలు ముస్లిం, ముస్లిమేతర పండితులు ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. అయితే ముహమ్మద్ చారిత్రక, జీవిత విశేషాలను మాత్రం అందరూ అంగీకరిస్తారు. ముహమ్మద్ జన్మ తేది 20 ఏప్రిల్, 570గా, షియాల ప్రకారం 26 ఏప్రిల్ 571గా భావిస్తారు. 622లో ముహమ్మద్ మక్కావీడి మదీనాకు వలస వెళ్ళారు. ఈ వలస తేదీతోనే ఇస్లామీయ క్యాలెండర్ యొక్క మొదటి సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ శకానికే హిజ్రీ శకం అంటారు. మహమ్మద్ ప్రవక్త పేరు ఉచ్ఛరించినపుడు సల్లల్లాహు అలైహి వసల్లమ్ (అతని మీద శాంతి కలుగుగాక) అని పలుకుతారు. ముస్లింలు మహమ్మద్ ప్రవక్త జన్మ దినాన్ని మీలాద్ - ఉన్ - నబీగా జరుపుకుంటారు.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494