సబ్ ఫీచర్

పతి విజయానికి సతి ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యే ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ భర్త గెలుపు కోసం తన వంతు కృషి చేస్తున్నారు. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుండగా, ఆయన భార్య సాధన ‘బుధ్ని’ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. భాజపా పాలిత రాష్టమ్రైన మధ్యప్రదేశ్‌లో గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న శివరాజ్ సింగ్ ఈసారి కూడా ‘బుధ్ని’ నుంచే బరిలో నిలిచారు. సీఎం హోదాలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నందున, సొంత నియోజకవర్గంలో భార్య సాధన ప్రచార బాధ్యతలను తీసుకున్నారు. చౌహాన్ భార్యగా ఆమెను ‘బుధ్ని’ నియోజకవర్గ ప్రజలు ‘ఆత్మీయురాలైన కోడలు’ అని పిలుస్తుంటారు. కుమారుడు కార్తికేయ సైతం ఆమె వెంట ప్రచారంలో పాల్గొంటున్నాడు. 1980 ప్రాంతంలో శివరాజ్ సింగ్ తన రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు ‘బుధ్ని’ నుంచే శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఆ ప్రాంతవాసులు ఆయనను తమ ఆత్మీయ బంధువుగా అభిమానిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సాధన వోటర్ల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. ప్రధానంగా తాగునీటి సమస్య వేధిస్తోందని మహిళలు ఆమెకు ఫిర్యాదు చేస్తున్నారు. సమస్యల్ని తీర్చాలని డిమాండ్ చేసే హక్కు వోటర్లకు ఉందని, నియోజకవర్గ ప్రజలందరూ తన కుటుంబ సభ్యులేనని సాధన చెబుతున్నారు. ‘పెద్ద కోడలి’గా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె వోటర్లకు భరోసా ఇస్తున్నారు. చిరకాలంగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజల కోర్కెలను తీర్చడం తమ బాధ్యత అంటున్నారు. తన భర్త శివరాజ్ సింగ్‌కు నియోజకవర్గంలో అందరూ చిరపరిచితులే గనుక ఈసారి కూడా గెలుపుతథ్యమని సాధన ధీమా వ్యక్తం చేస్తున్నారు. దైవభక్తి అమితంగా ఉన్న ఆమె తరచూ భర్తతో కలసి గోపూజలు చేస్తుంటారు. ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆమెకు వోటర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.