సబ్ ఫీచర్

ఆరోగ్యంగా ఎదిగేలా వ్యాక్సిన్లు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిడ్డ పుట్టిన వెంటనే కెవ్వున కేక వేస్తే ఆ తల్లికి ఎంతో ఆనందం. పుట్టిన బిడ్డకు వెంటనే పాలివ్వాలని ఆరాటపడే తల్లి ఆ బిడ్డ ఏటేటా ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన వ్యాక్సిన్లు కూడా ఇప్పించేందుకు ఆసక్తి కనబర్చటం లేదు. పిల్లలు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా, భవిష్యత్తులో ప్రాణంతకమైన జబ్బులు రాకుండా అవసరమయ్యే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. డిటిపి, తట్టు తదితర అంటువ్యాధులు రాకుండా ఇచ్చే టీకాలను ఇప్పించటంలో తల్లిదడ్రులు శ్రద్ధచూపటం లేదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మన దేశంలో రెండు వంతుల మంది పిల్లలకు వ్యాక్సినే్ల వేయించటం లేదని మిచిగాన్ యూనివర్శిటీవారు చేసిన సర్వే వెల్లడైంది. ఇలా సకాలంలో చిన్నారులకు వ్యాక్సిన్లు ఇప్పించకపోవటం వల్ల ఏటా ఐదేళ్లలోపు పిల్లల మరణాలు అధికంగా సంభవిస్తున్నట్లు తమ అధ్యయనాల్లో వెల్లడైనట్లు శ్రీవాత్సవ వెల్లడించారు. జిల్లా మొత్తంగా కేవలం 2,70,000 మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేస్తున్నట్లు వెల్లడైంది.
ఏటా 26 మిలియన్ల పిల్లల జననం
భారతదేశంలో ఏటా 26 మిలియన్ల బిడ్డలు పుడుతున్నారు. ప్రపంచంలోనే ఏ దేశంలోనూ ఈ విధంగా బిడ్డల జననం లేదు. కాని నిరక్షరాస్యత, అవగాహనలేమి వల్ల ఇలా పుట్టిన బిడ్డలకు వ్యాక్సిన్లు వేయించక ఇన్‌ఫెక్షన్లు, అంటువ్యాధుల బారిన పడి చనిపోతున్నారని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ సంస్థకు చెందిన బోల్టన్ వెల్లడించారు. తట్టు వ్యాధులు రాకుండా కేవలం 12శాతం మంది పిల్లలకు మాత్రమే వ్యాక్సిన్లు ఇప్పిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తొమ్మిది నెలల బిడ్డలకు ఇవ్వాలి. కాని వయసును బట్టి ఇవ్వాల్సిన ఈ వ్యాక్సిన్ సరైన టైమ్‌కు ఇవ్వటం లేదు. ఐదేళ్లలోపు పిల్లలకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ మాత్రం 75శాతం వరకు ఇప్పించగలుగుతున్నారు. దేశంలో 95శాతం పిల్లలకు సంపూర్ణంగా వ్యాక్సిన్లు ఇప్పించగలిగితే దేశం నుంచి తట్టులాంటి అంటువ్యాధులను తరిమికొట్టవచ్చని డాక్టర్ బోల్టన్ అంటున్నారు. పిల్లలు పుట్టిన వెంటనే ఏటేటా వారు ఆరోగ్యంగా ఎదిగేందుకు తల్లిదండ్రులు అవసరమైన వ్యాక్సిన్లు ఇప్పించగలిగితే వారి ఎదుగుదలకు దోహదపడినవారవుతారు.