సబ్ ఫీచర్

విచ్ఛిన్నకర శక్తులకు విపక్షనేతల మద్దతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి యుద్ధం బెడద వచ్చినపుడు సరిహద్దుల్లో శత్రుసేనలను తరిమికొట్టి ‘భారతమాతాకీ జై’ అని మన జవాన్లు నినదిస్తారు. అసదుద్దీన్ ఒవైసీ లాంటి వాళ్ళు మాత్రం ‘్భరత్ మాతాకీ జై’ అనాలని రాజ్యాంగంలో వుందా? అని ప్రశ్నిస్తారు. జవాన్ల కంటే ఒవైసీ మొనగాడా? రజాకార్ల పార్టీని కొనసాగిస్తున్న ఒవైసీ గతంలో రజాకార్లు తెలంగాణలో చేసిన అరాజకాలకు క్షమాపణ ఎందుకు చెప్పరు? చెప్పమని కేసీఆర్ ఎందుకు అడగరు? గతం మరిచి నిస్సిగ్గుగా మళ్ళీ రజాకార్ల వారసులకు కేసీఆర్ ఎందుకు మద్దతు పలుకుతున్నారు? 25 కోట్ల విలువ చేసే భూమిని రూ. 3 1/2 కోట్లకు నగరం నడిబొడ్డులో ఒవైసీకి ఎందుకు ముట్టచెప్పారు? ఎవడబ్బ సొమ్మని తెలంగాణలో ఈ దోపిడీ జరుగుతోంది? చార్మినార్ వద్ద బతుకమ్మ ఆడిన ఆడపడుచులను అరెస్టు చేస్తారా? వరంగల్‌లో పూజారిని- మైకు పెట్టాడని ఓ మాల్వీ హత్యచేస్తే ప్రభుత్వం చోద్యం చూస్తోందా? ఎన్నాళ్లీ సంతుష్టీకరణ సంబరాలు?
***
స్వాతంత్య్రోద్యమంలో దేశ ప్రజలను మతం పేర విడగొట్టేందుకు జరిగిన కుట్రలో కాశీలో హిందూ విశ్వవిద్యాలయానికి ప్రతిగా అలీగఢ్‌లో ముస్లిం విశ్వవిద్యాలయం ఏర్పడింది. అది మైనారిటీ సంస్థ కాదు. ఈ విషయం సుప్రీం కోర్టు కూడా తేల్చి చెప్పింది. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వర్తించే అన్ని నిబంధనలు దానికీ వర్తిస్తాయి. కాని అక్కడ అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కారు. ఎస్.సి విద్యార్థులకు 15 శాతం, ఎస్.టి విద్యార్థులకు 2.5 శాతం రిజర్వేషన్లు లేవు ఎందుకని? రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదెవరు? యుపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీన్ని ప్రశ్నించడం తప్పా? ఈ విషయమై యుపి ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ అధ్యక్షుడు బిజ్‌లాల్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం యాజమాన్యానికి ఉత్తరం రాయడం తప్పా? దీన్ని యాజమాన్యం మళ్ళీ కోర్టుకెక్కించి జాప్యం చేస్తోంది.
***
తెలుగు రాజకీయం రంగులీనింది. చంద్రబాబు నాయుడు రాహుల్‌తో చేతులు కలిపారు. ‘చంద్ర’గ్రహణం అంటే ఇదేనేమో? ‘రాహుల్ ఏ మొఖం పెట్టుకుని వస్తారని’ ప్రశ్నించి, కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బహిష్కరించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు రాహుల్‌తో పోజులిస్తున్నారు. తెలంగాణలో మహాకూటమిలో చేరారు. బిజెపి, వైకాపాతో కలిసిందనుకున్నా, టిడిపికి ‘నో’ చెప్పిందనుకున్నా, చంద్రబాబు ప్రసంగాలను సమర్ధించవచ్చు. అలాంటివేమీ జరగలేదే? దేశమంతా తిరస్కరించిన కాంగ్రెస్ పంచన చేరి చంద్రబాబు సాధించాలనుకుంటున్నదేమిటి? చక్రం తిప్పే రాజకీయాలకు కాలం చెల్లింది. ప్రత్యేక హోదా పేర ధర్మపోరాట దీక్షలు పెట్టి ఆంధ్రప్రదేశ్ అంతటా తిరుగుతూ మోదీపై ఆయన తిట్ల దండకం సాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతుంటే కోట్లాది రూపాయల అక్రమ ధనం, లావాదేవీలు బయటపడ్తుంటే మోదీని చంద్రబాబు తిడ్తున్నారు. ప్రతిదాన్నీ రాష్ట్రాలపై కేంద్రం చేస్తున్న దాడిగా చిత్రిస్తున్నారు. తన పార్టీలోనే అక్రమ సంపాదన పరులు, ఘరానా మోసగాళ్ళున్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలి.
***
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హిందువులపై ముఖ్యంగా దళిత బంధువులపై ఎందుకు దాడులు చేయిస్తోంది? ముస్లిం వలసలను దేశ సరిహద్దుల నుంచి ఎందుకు ప్రోత్సహిస్తోంది? స్వాతంత్య్రోద్యమానికి కర్మభూమి అయిన బెంగాల్‌లో నేడు అరాచకం తాండవిస్తోంది. 1998లో కాంగ్రెస్ నుంచి బహిష్కుృతురాలైన మమతకు నాడు ఎన్‌డిఎ అండగా నిలిచింది. వాజపేయి మమతను ‘కలకత్తా కాళి’ అన్నారు. ఆమె నేడు చేస్తున్నదేమిటి? పదవుల కోసం, ఓట్ల కోసం ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం మందిని నామినేషన్లు వేయనీయలేదు. 20 మంది హత్యకు గురయ్యారు. బెంగాలీ, ఉరుదూ భాషా వైషమ్యాలు పెచ్చరిల్లుతున్నాయి. లక్షా 96 వేల కోట్ల రూపాయల అప్పు ఉండగా బెంగాల్ పగ్గాలు చేపట్టిన మమత నేడు దాన్ని 3 లక్షల కోట్లకు పెంచింది. అన్ని రంగాల్లోనూ ప్రగతి సూచికలు కనుమరుగైపోయాయి. ఆయుధాలు, ఆయుధ సరఫరా విచ్చలవిడిగా జరుగుతోంది. రాజకీయాలు నేరపూరితమయ్యాయి.
***
ఇటీవల కర్నాటక ఉపఎన్నికల్లో రెండు, మూడు సీట్లు రాగానే కాంగ్రెస్- జెడిఎస్ కూటమి చంకలు గుద్దుకుంటున్నది. పదవీ రాజకీయం తప్ప కర్నాటకలో పొంచి వున్న అసాంఘిక శక్తుల పట్ల ఆ కూటమికి స్పష్టమైన వైఖరి లేదు. బుద్ధగయ పేలుళ్ళలో నిందితుడు జహిదుల్ ఇస్లాం ఈమధ్యనే బెంగుళూరుకు 70 కి.మీ దూరంలోని రామనగర్‌లో అరెస్టయ్యాడు. రామనగర్ ముఖ్యమంత్రి కుమారస్వామి నియోజకవర్గం కూడా. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చట్టబద్ధత లేని వలసదారుడు జహిదుల్ ఇస్లాం. 2015లోనే కుమారస్వామి బెంగళూరులో 40,000 మంది అక్రమ వలసదారులున్నారని ప్రకటించాడు. బంగ్లాదేశ్ నివాసి జహిదుల్ ఇస్లాం ఆ దేశంలోని తీవ్రవాద సంస్థ జమాయత్ ఉల్ ముజాహిదీన్‌లో సభ్యుడు. కేంద్ర నిఘా సంస్థ ఎన్‌ఐఎ పట్టుకునేవరకు జెడిస్- కాంగ్రెస్ కూటమికి ఈ విషయం తెలియదు. మరో బంగ్లాదేశ్ తీవ్రవాది అదిల్ షేక్ అరెస్టుతో చాలా విద్రోహక విషయాలు వెలుగుచూచాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విచ్ఛిన్నకర శక్తుల పట్ల ఏ మాత్రం చింత లేదు. బౌద్ధ మతగురువు దలైలామాను హత్యచేసేందుకు ఈ జీహాదీలు కుట్ర పన్నారు. కేంద్రం హోంశాఖ రాష్ట్ర పోలీసుశాఖను ఈ విషయమై హెచ్చరించింది కూడ. నిఘా వర్గాల నివేదికను బట్టి బెంగళూరులోనే సుమారు 1,80,000 మంది అక్రమ వలస దారులున్నట్టు అంచనా. మొత్తం కర్నాటకలో వీరి సంఖ్య 6,30,000. ఓటు బ్యాంకు రాజకీయం తప్ప దేశభద్రత జెడిఎస్-కాంగ్రెస్ కూటమికి పట్టదా?
***
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. రాఫెల్‌పై ఎందరు నిపుణులు చెప్పినా, స్వయానా ‘ది సాల్టు’ సీఈవో వివరణ యిచ్చినా రాహుల్ అబద్ధపు ప్రచారం మానలేదు. సర్వేలు మళ్ళీ ఎన్‌డిఎ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనడంతో రాహుల్ గంగవెర్రులెత్తుతున్నారు. దేశంలో పరిస్థితులేమైనా, రాహుల్ ప్రధాని పదవి కోసం పాకిస్తాన్ సహకారం తీసుకుంటున్నారన్న సామాజిక మాధ్యమాల వార్తలు ఆందోళన కలిగించేవిగా వున్నాయి. పాకిస్తాన్ పూర్వ గృహమంత్రిగా వున్న రహమాన్ మాలిక్ రాహుల్ భారత ప్రధానమంత్రి కావాలన్నారు. రాహుల్ ఇటలీ పౌరుడుగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఆయన యింతవరకూ దాన్ని పరిత్యజించలేదు. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని పాకిస్తాన్‌తో పోల్చి ఆయన ఘోర తప్పిదం చేశారు. పాకిస్తాన్‌లో గత 70 ఏళ్ళలో 33 ఏళ్ళ పాటు సైన్యం రాజ్యం చేసింది. పాకిస్తాన్‌ను ఏర్పరిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే దేశ విభజన కోరుకుంది. మానవ హక్కుల ఉల్లంఘన పాకిస్తాన్‌లో జరుగుతున్నది. భారత్‌లో ఇది జరిగే పనేనా? అర్బన్ నక్సల్స్ దేశ ప్రధానిని హతమార్చేందుకు పథకాలు రచిస్తే వారి నిర్బంధాన్ని వ్యతిరేకిస్తున్న రాహుల్‌కు పాకిస్తాన్‌లో ఇస్లామిక్ చట్టం అమలులో వుందని, అక్కడ పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడినా పౌరుల భద్రత ప్రశ్నార్థకమవుతుందని తెలుసా?
రాహుల్ తాను ఏర్పాటు చేయదల్చుకున్న ‘మహా కూటమి’లో పాకిస్తాన్ కూడా వుందా? ఎందుకంటే పాకిస్తాన్, రాహుల్ ‘మోదీ హటావో’ అంటున్నారు. రాహుల్ మోదీని నియంత అంటున్నారు. 1975లో ఎమర్జెన్సీని విధించి నియంతలా వ్యవహరిచింది ఎవరో రాహుల్‌కు తెలియదా? కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పాకిస్తాన్ టిప్పు సుల్తాన్‌ను ‘టైగర్ ఆఫ్ మైసూర్’ అంటూ పొగిడి రాహుల్‌కు వంత పాడింది. జాతి నిర్మాణ దీక్షలో వున్న ఆరెస్సెస్‌ను ఆయన తన విదేశీ పర్యటనలో ఐసిస్‌తో పోల్చడం హాస్యాస్పదం. దేశంలో పలు ప్రాంతాలలో సాగుతున్న విచ్ఛిన్నకర శక్తుల ఆగడాలు జాతీయోద్యమాన్ని బలహీనపరచలేవు.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 96761 90888