సబ్ ఫీచర్

వంటగది శుభ్రత ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడమనేది ఒకరకంగా కళే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని శుభ్రపరచినా వంటగదిలో ఎక్కడో ఒక చోట అపరిశుభ్రత తాండవిస్తుంది. స్టవ్‌ని అలాగే, కౌంటర్ టాప్స్‌ని శుభ్రపరిచేటప్పుడు అలాగే కిచెన్‌లో పేరుకున్న మొండి జిడ్డును వదిలించుకునేందుకు ప్రయాస పడాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలనుండి విముక్తి పొందడానికి మార్కెట్లోకి ప్రొఫెషనల్ గ్రేడ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ చాలా మార్కెట్లో ఉన్నాయి. వీటిని ఉపయోగించి వంటగదిని శుభ్రపరిస్తే శుభ్రమవుతుందని గ్యారెంటీ లేదు. పైగా బోలెడంత డబ్బు నష్టం. అందుకే అమ్మమ్మల కాలం నుండి వస్తున్న పర్యావరణ స్నేహపూర్వక ప్రత్యామ్నాయాలను ఒకసారి తెలుసుకుందాం. వీటిని పాటించడం వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగదు. మరి అవేంటో ఒకసారి చూద్దామా..
బేకింగ్ సోడా..
బేకింగ్ సోడా అన్నిరకాలుగా ఉపయోగపడుతుంది. కేక్స్ తయారీకి, బ్రెడ్‌లో దీని వినియోగం మనకు తెలుసు. బేకింగ్ సోడా ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. వంటగదిని శుభ్రపరచడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. గ్యాస్ స్టవ్‌ను శుభ్రపరుస్తుంది. ఇప్పటి వరకు వాడుతున్న ఖరీదైన సంప్రదాయ క్లీనర్స్ నుంచి వచ్చే వాసన భరించడం కష్టం. పైగా ఇవి అనారోగ్యకరం కూడా.
నిమ్మ, వెనిగర్, సోడాలను కలిపి..
మురికిని శుభ్రం చేయడానికి, మరకలు పడ్డ వంటగదిని శుభ్రపరచడానికి నిమ్మ, వెనిగర్, సోడాలు బాగా ఉపయోగపడతాయి. చెత్తను తొలగించడానికి, సింక్ డ్రైనేజ్ పాత్‌వేను తిరిగి మామూలుగా పనిచేసేలా చేయడానికి నిమ్మ, వెనిగర్, బేకింగ్ సోడాలను కలిపి సింక్‌లో వేస్తే అందులో ఇరుక్కున్న చెత్తంతా కరిగిపోతుంది. అలాగే వంటగది గట్టు కూడా ఈ మూడూ కలిపి తుడవడం వల్ల మురికి, సూక్ష్మ క్రిముల బెడద తీరిపోతుంది. ఇలా సులభమైన పద్ధతిలో ఈ మూడింటి కాంబినేషన్‌తో వంటగది శుభ్రంగా మారుతుంది.
అమ్మోనియా
వంటగదిలో అనేక సమస్యలు ఎదురవుతాయి. గ్యాస్ స్టవ్ బర్నర్‌లో ఉండే గ్రేట్స్‌ను జాగ్రత్తగా చూసుకోవడం మరింత కష్టమైన పని. ఇది జిడ్డుకు, చెత్తగా అయస్కాంతంగా వ్యవహరిస్తుంది. వేపుడు పదార్థాలు, పిండి వంటలు చేసినప్పుడు బర్నర్ గ్రేట్స్ అపరిశుభ్రంగా మారతాయి. అప్పుడు వీటిని శుభ్రపరచడం చాలా కష్టమవుతుంది. అలాగని వీటిని మార్చాలనుకుంటే చాలా డబ్బులు ఖర్చవుతాయి. జిడ్డు పట్టిన బర్నర్ గ్రేట్స్‌ను శుభ్రపరచడానికి అమ్మోనియా చక్కగా పనిచేస్తుంది. సమయం వృథా అవకుండా, డబ్బు కూడా ఆదా అవుతుంది.