సబ్ ఫీచర్

భక్తుల కోసమే బాబా ఆకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే వింత అనుకుంటే బాబా మరో వింత చేసేవారు. బాబా బల్ల నాలుగు మూలలా నాలుగు దీపపుప్రమిదలను ఉంచి రాత్రంతా దీపాలు వెలిగించి ఉంచేవారు. ఇది మరీ చిత్రంగా ఉండేది. అసలే బాబా ఆజానుబాహువు. బాబా సరిగాపడుకోవటానికే ఆ బల్లసరిపోదు. పైగా దానికి నాలుగు మూలలా నాలుగు దీపపుప్రమిదలు. మధ్యలో బాబా శయనించటం. నిజంగా బాబా ఆ బల్లపై పడుకునే తీరును దేవతలైనా చూసి తీరాల్సిందే. నేలకు కొద్ది అడుగుల దూరంపైన వేలాడే ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కుతున్నారు? ఎలా దిగుతున్నారు? అనేవి అందరికీ ఆశ్చర్యం కలిగించేది. శిరిడీవాసులు పలువురు ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కటం, దిగటాన్ని గమనించేందుకు మసీదువద్దే కనిపెట్టుకొని ఉండేవారు. కాని బాబా ఎవరికి ఆ వైనం అంతు తెలియనిచ్చేవారు కారు. ఆ వింత చూడ్డానికి జనం గుంపులుగుంపులుగా గుమికూడటం చూసి బాబా విసుగెత్తి ఒకనాడు ఆ బల్లను విరిచి ముక్కలుచేసి పారవేశారు. అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వాటిని ఆపేక్షించలేదు. వాటికోసం ఏ అభ్యాసాలూ చేయలేదు. బాబా పరిపూర్ణులు. కాబట్టే సహజంగానే అవి బాబాకు సిద్ధించాయి.
ఒకసారి కాకాసాహెబు దీక్షిత్‌వద్ద బాబా బల్లప్రస్తావన తెచ్చారు. ‘‘బాబా! మీకు మనసుపడితే కొయ్యబల్లను తయారుచేయించి తీసుకువస్తాను’’ అన్నాడు కాకాసాహెబు. ‘‘మహల్సాపతిని వదిలి నేనొక్కడినే పైన పడుకోను’’ అని బాబా చెప్పారు. ‘‘అతనికికూడా మరొకటి చేయిస్తాను బాబా’’ అన్నాడు కాకా. ‘‘అంతెత్తు బల్లపై మహల్సాపతి ఎలా పడుకోగలడు?. ఎవరైతే కళ్లుతెరిచి నిద్రించగలరో వారే పడుకోగలరు. నేను నిద్రపోయేటప్పుడు నా పక్కన కూర్చుని తన చేయిని నా హృదయంపై ఉంచమంటాను. అక్కడినుంచి వినబడే భగవన్నామస్మరణను శ్రద్ధగా వినమంటాను. నేను నిద్రలోకి జారుకుంటే కనుక మేల్కొల్పమంటాను. కానీ, మహల్సాపతి గుర్రుపెట్టి నిద్రపోతుంటాడు. కునికిపాట్లుపడతాడు. నిద్రవల్ల నా హృదయంపై ఉంచిన వాడి చేయి బరువెక్కటం గమనించి ‘ఓ భగత్’ అని పిలుస్తాను. ఉలిక్కిపడి లేస్తాడు. ఎవరైతే నేలపై చక్కగా నిద్రించలేరో, ఎవరైతే నిద్రకు బానిసలో, ఎవరైతే కొద్దిక్షణాల పాటైనా కదలక, మెదలక ఉండలేరో వారు ఎతె్తైన బల్లపై ఎలా పడుకోగలరు? మంచి కాని, చెడ్డ కాని ఏది మనదో అదే మనవద్ద ఉంటుంది. ఏది ఇతరులదో అది ఇతరుల వద్దే ఉంటుంది’’ అని చెప్పి బాబా ఆ సంభాషణను ముగించారు.
డేంగలే కొయ్యబల్ల ఇవ్వటానికిముందు బాబా మసీదులో నేలపై పాత దుప్పట్లను పర్చుకుని మహల్సాపతి, తాత్యాకోతే పాటీలుతోకలిసి నిద్రించేవారు. ముగ్గురూ తమ తలలను తూర్పు, పడమర, ఉత్తర దిక్కులుగాచేసి పడుకునేవారు. పక్కలుపర్చుకుని, వాటిపై చతికిలబడేవారు. సగం రేయివరకు ఏవేవో కబుర్లు కలబోసుకునేవారు. మాటలమధ్యలో ఎవరైనా నిద్రపోయినట్టనిపిస్తే మిగతావారు నిద్రలేపేవారు. తాత్యా గుర్రుపెడితే బాబా అతనిని అటూఇటూ ఊపి తలగట్టిగా నొక్కేవారు. బాబా ఒక్కోసారి మహల్సాపతిని అక్కున చేర్చుకునేవారు. అతని కాళ్లుపట్టేవారు. వీపు రుద్దేవారు.
అమృత హృదయం..
సాయి నిరాకారుడు. భక్తులకోసమే బాబా ఆకారాన్ని ధరించారు. ఈ మహా జగన్నాటకంలో మాయ అనే నటి సాయంతో బాబా నటుని పాత్ర ధరించారు. సాయిని స్మరించి ధ్యానింతము గాక. శిరిడీలో మధ్యాహ్న హారతి తరువాత జరిగే కార్యక్రమాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకువచ్చి గోడ పక్కన నిల్చుని ప్రేమతోను, దయతోను భక్తులకు ఊదీ ప్రసాదాన్ని పంచిపెట్టేవారు. భక్తులు కూడా బాబాతో సమానమైన ఉత్సాహంతో బాబా సమక్షంలో నిలిచి బాబా పాదాలకు నమస్కరించేవారు. బాబా ముఖారవిందాన్ని కనులారా చూస్తూ భక్తులు ఊదిప్రసాదపు జల్లులను అనుభవించేవారు. బాబా భక్తుల చేతులలో పిడికిళ్ళతో ఊదిపోస్తూ, వారి నుదిటిపై తమ చేతులతో ఊదీ బొట్టుపెట్టేవారు. బాబా హృదయాన భక్తులపై అమితమైన ప్రేమ పొంగేది. బాబా భక్తులకు కింది విధంగా పలుకరించేవారు.
‘‘అన్నా, మధ్యాహ్న భోజనమునకు పో! బాబా, నీ బసకు వెళ్లు. బాపూ! భోజనము చేయి’’ ఈ విధంగా ప్రతి భక్తుడిని పలకరించి ఇంటికి సాగనంపేవారు. ఇప్పటికి అదంతా ఊహించుకుంటే, ఆ దృశ్యాలను తిరిగి చూసినంత ఆనందం కలుగుతుంది. మనోఫలకంపై సాయిని నిలిపి, ఆపాదమస్తకం ధ్యానిద్దాం. వారి పాదాలపై పడి సగౌరవంగా ప్రేమతో వినయంగా సాష్టాంగ నమస్కారం చేద్దాం.

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566