సబ్ ఫీచర్

యోగా సాధనతో ఎన్నో లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిశ్చల జీవనశైలే కాకుండా అనేక రకాల కారణాల వల్ల కూడా బరువు పెరగడం జరుగుతుంది. అధిక మోతాదులో కేలరీలు కలిసిగిన చిరుతిళ్ళు అంటే ఇష్టం కలిగి ఉండడం మరియు వ్యాయామం చేయడం చాలా వరకు తగ్గించడం వంటి కారణాలు కావచ్చు. చాలామంది ఆరుబయట గడపడం లేదా తక్కువ మొత్తంలో కాలినడక కోసం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కుర్చీల్లో కూర్చొని సమయాన్ని గడుపుతున్నారు. అలా ఉండడం ద్వారా బరువు అమాంతంగా పెరిగిపోతారు. ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ వారు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ‘బరువు కోల్పోవడం కొనసాగించడం లేదా సాధారణ బరువును సాధించడానికి సంభావ్యత తక్కువగా ఉంటుంది’ అని సూచించడం జరిగింది. పలువురు నిపుణులు ఒక వారానికి మూడుసార్లు ముప్ఫై నిముషాల పాటు సాధారణ వ్యాయామం సాధన చేయడం లేదా రోజువారిగా ఐదు వేల అడుగుల కాలినడక సాధారణ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అని సూచించారు. అయితే పెరిగిన కాలుష్యం కారణంగా బయటకు వెళ్ళడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని అర్థమవుతుంది. ఇలాంటి సమయాల్లో శతాబ్దాల కాలం నాటి ‘యోగా’ తెరపైకి రావడం జరిగింది.
యోగా అనేది ఒక జీవన మార్గం. క్రమం తప్పకుండా యోగా చేసేవారు అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటారు. యోగా కేన్సర్ రోగులకు కూడా సహాయపడుతుంది అని గమనించారు నిపుణులు. ‘జానైస్ కియోకల్ట్-గ్లాసర్, ఒహియో స్టేట్ యూనివర్శిటీ’ మానసిక, మనస్తత్వ ప్రొఫెసర్ నేతృత్వంలోని అధ్యయనాల, ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ ప్రచురణల’ ప్రకారం, పరిశోధకులు రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న రెండు వందల మంది ఇంతకుముందు యోగా సాధన చేయనటువంటి రోగులను పరిశీలించారు. సగం సమూహం వారు, యోగాను పట్టించుకోకుండా కొనసాగగా, మరో సగం వారు డీవీడీల సహాయంతో వారానికి రెండు సార్లు, తొంభై నిముషాల తరగతులను పనె్నండు వారాలపాటు ఇంట్లోనే సాధన చేయడం జరిగింది. మూడు నెలల తర్వాత చికిత్స ముగిసే సమయానికి యోగా సాధన చేసిన సమూహం వారు తక్కువ అలసటను మరియు శక్తి అధిక స్థాయిలను కలిగి ఉన్నట్లుగా తెలిపారు. ఇదంతా గమనిస్తే యోగా కేవలం అదనపు పౌండ్ల బరువును తొలగించడానికే కాకుండా అనేక రకాలుగా సహాయపడుతుంది. అయితే విషయం సారాంశాన్ని గమనిస్తే బరువును తగ్గించుకోడానికి ఎవరైనా సాధన చేయదగిన కొన్ని యోగా వ్యాయామాలను పరిశీలిద్దాం.
సాధారణంగా కనీసం వారానికి మూడుసార్లు, ప్రతి భంగిమలో మూడు నుండి ఐదు లోతైన శ్వాసలను తీసుకుంటూ సాధన చేయాలి.
సేతు బంధ్
వీపును నేలకు ఆనించి పడుకోవాలి. పాదాలు నేలపై విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మోకాళ్ళను వంచాలి. పాదాలు మరియు పిరుదుల మధ్య దూరం చేతులకు సమాంతరంగా ఉండేట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు శరీరాన్ని పైకెత్తడానికి ప్రయత్నించాలి. ఈవిధంగా ఐదు నుండి పదిసార్లు సాధన చేయడానికి ప్రయత్నించాలి. తరువాత యథాస్థానానికి వచ్చేయాలి.
శలభాసన
నుదురు, గదవ భాగాలు నేలపై.. చేతులు తొడల కింద విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉంచి కడుపుపై పడుకుని ఆసనాన్ని ప్రారంభించాలి. ఎడమకాలును నేరుగా ఉంచి, పది అంగుళాల వరకు పైకి ఎత్తడానికి ప్రయత్నించాలి. కానీ మోకాలు వంగకుండా చూసుకోవాలి. తరువాత కుడి కాలుతో కూడా అదేవిధంగా చేయాలి. చివరగా ఇదేవిధంగా రెండు కాళ్ళతో చేయాలి.
చక్కి చలనాసన
కడుపులోని కొవ్వును తగ్గించుకోవడానికి సహాయపడే శక్తివంతమైన వ్యాయామం ఇది. దీనికోసం ముందుగా సౌకర్యవంతమైన స్థానంలో కూర్చోవాలి. ఇప్పుడు రెండు కాళ్లు ఒకదానితో ఒకటి ఆనించుకుంటూ ముందుకు చాపాలి. మోకాళ్లు వంచకూడదు. తరువాత రెండు చేతులను ఒకదానితో ఒకటి జోడించుకోవాలి. కాళ్లపై నుంచి వృత్తాకారంలో కదుపుతూ తిప్పాలి. ఈ విధమైన చలనాలను సవ్యదిశలో పదిసార్లు, అపసవ్యదిశలో పదిసార్లు తిప్పాలి. తర్వాత యథాస్థానానికి వచ్చేయాలి.
నౌకచలనాసన
సౌకర్యవంతమైన స్థానంలో కూర్చుని కాళ్లని ఒకదానితో ఒకదాన్ని ఆనించి నేరుగా ముందుకి చాపాలి. మళ్లీ మోకాళ్లను వంచకుండా చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి. ఇప్పుడు చేతులను ముందుకు, వెనుకకు కదపడానికి ప్రయత్నించాలి. చేతులు కదులుతున్న పద్ధతిలోనే శరీరం కూడా కదపాలి. ఒక పడవను నడుపుతున్న విధంగా కదలాలి. ఈ విధంగా సవ్యదిశలో పదిసార్లు మరియు అపసవ్యదిశలో పదిసార్లు పునరావృతం చేయాలి.
ధనురాసనం
దీనినే బో పోజ్ అంటారు. ముందుగా బోర్లా పడుకోవాలి. కడుపు నేలకు పూర్తిగా ఆనాలి. ఛాతికి ఇరువైపులా చేతులను ఉంచాలి. తర్వాత లోతైన శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు కాళ్లను, తొడలను పైకి ఎత్తాలి. అదే సమయంలో చేతులతో కాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే భంగిమలో కనీసం ముప్ఫై సెకన్ల పాటు నిలిచి ఉండడం మంచిది. తర్వాత యథాస్థానానికి రావాలి.
ఈ ఆసనాలు జిమ్, పరిగెత్తడం కంటే సులభమైనవి. ఆరోగ్యకరంగా ఉన్న ప్రతి ఒక్కరూ, వయస్సుతో సంబంధం లేకుండా ఈ ఆసనాలు వేయొచ్చు. దీంతో ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవనశైలిని అవలంబిస్తూ ముందుకు సాగవచ్చు.
*