సబ్ ఫీచర్

ఆ సంకల్పానికి జోహారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్‌కు చెందిన బాను అక్తర్‌కి పుట్టుకతో రెండు చేతులూ లేవు. పుట్టగానే బానూని చూసి తల్లి భయపడిందట. ఆ బిడ్డకు చనుబాలు కూడా ఇవ్వలేదట. ఇలాంటి వికలాంగురాలిని పెంచడం భారమని, చంపేయమని చుట్టుపక్కలవాళ్లు ఆ తల్లిదండ్రులకు చెప్పారట. కానీ ఆ తల్లి చంటిబిడ్డను చంపలేదు. వదిలేసింది. తల్లిదండ్రులు బానుకు నడక కూడా నేర్పలేదు, బడికి పంపలేదు. అందరూ నడవడం చూసి బానునే సొంతగా నడవడం నేర్చుకుంది. ఊళ్లోని ఓ పెద్దమనిషి సాయంతో స్కూలుకు వెళ్లింది బాను. కొద్ది సంవత్సరాలు గడిచాయి. కానీ బానుని ఆ ఊళ్లో ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఈసడింపుగా చూసేవారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా తన బిడ్డ ఇంట్లో పెరుగుతోంది అని ఎప్పుడూ అనుకునేవారు కాదు. నిజంగా చెప్పాలంటే ఆమెవైపు నవ్వుతూ కూడా చూసేవారు కాదు.. దాంతో బానుకు చాలా బాధకలిగి ఇల్లొదిలి ఢాకాకు వెళ్లిపోయింది. ఊరి నుంచి అయితే వచ్చేసింది కానీ ఆమె చేతిలో చిల్లిగవ్వలేదు. ఇంటింటికీ వెళ్లి పనికోసం అడిగింది. కానీ బానుకు చేతులు లేవని ఎవరూ అవకాశం ఇవ్వలేదు. దిక్కుతోచని స్థితిలో ఆమెకు అడుక్కుందామనే ఆలోచన వచ్చిందట. కానీ ఆ పనిచేయడానికి చాలా సిగ్గుగా అనిపించిందట, ఆత్మాభిమానం అడ్డొచ్చిందట.. అందరిలానే తనూ కష్టపడి సంపాదించుకోవాలనుకుంది. క్రమంగా కష్టపడి రెండు కాళ్లతో బట్టలు కుట్టడం, కళాకృతులు చేయడం నేర్చుకుంది. కాళ్లనే చేతులుగా ఉపయోగించడం మొదలుపెట్టింది. ఎన్నో కష్టాలను దాటుకుని కళాకృతులను తయారుచేయడంలో నైపుణ్యం సాధించింది. ప్రస్తుతం బాను బతకడానికి సరిపడా డబ్బును తనే సంపాదించుకుంటోంది. చేతులు లేకపోతేనేం, కాళ్లతో పాటు కొండంత ఆత్మవిశ్వాసాన్ని చూపుతూ, స్వతంత్రంగా బతుకుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది బాను అక్తర్.