సబ్ ఫీచర్

ఆలోక హితాన్ని కోరే సాయితత్త్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజంగా శ్రీ సాయి సచ్చరిత్రలోనే రాధాబాయికి బాబా కనువిప్పు కలిగించిన అధ్యాయం అమూల్యమైనది. బాబా రాధాబాయ్‌కి చేసిన ఈ హితబోధ మనుషులు ఎదుర్కొంటున్న సకల సమస్యలు, ఆయా సందర్భాలకు అనుగుణమైనది. దీనిని ఎవరికివారు తమ సమయ, సందర్భానికి అనువుగా మలుచుకుని పరిష్కారాన్ని పొందవచ్చు. ఇది కేవలం వట్టి బోధన మాత్రమేకాదు. మనుషుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే విజయ రహస్యం.
***
బాబా మూడున్నర మూరల మానవదేహంతో కనిపించినా వారు సర్వహృదయాంతరస్థులు. అంతరంగాన బాబా పరమ నిరీహులు నిస్పృహులైనప్పటికి, బయటికి మాత్రం లోకహితాన్ని కోరేవారిగా కనిపించేవారు. లోక మమకార రహితులైనప్పటికి, బాహ్యదృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమాలకోసం ఎంతో తాపత్రయపడేవారిలా కనిపించేవారు. బాబా అంతరంగం శాంతికి ఉనికిపట్టు. కానీ, బయటకు మాత్రం చంచల మనస్కునిలా కనిపించేవారు. నిత్యం బాబా లోపల పరబ్రహ్మస్థితిలో ఉన్నప్పటికీ బయటకు దయ్యంవలె నటించేవారు. లోపల అద్వైతి అయినప్పటికీ బయటకు ప్రపంచంలోని అన్ని విషయాలను తగుల్కొనే వారిలా తోచేవారు. ఒక్కోసారి బాబా అందరినీ ప్రేమతో చూసేవారు. మరికొన్నిసార్లు కోపగిస్తూ, తిడుతూ ఉండేవారు. ఇంకొన్నిసార్లు భక్తులపై రాళ్లు విసిరేవారు. అంతలోనే తిడుతూ అంతలోనే ప్రేమతో సమాదరిస్తూ ఆత్మీయంగా అక్కున చేర్చుకునేవారు. బాబా ఎంతో నెమ్మదితోను, శాంతముతోను, ఓరిమితోను, సంయమనంతోనూ వ్యవహరించేవారు. బాబా భక్తులపై చూపే ప్రేమనానురాగాలు కొలువ రానివి. వారి అనుగ్రహం ఇంత అని చెప్పటానికి వీలుకానిది.
బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానంలోనే మునిగి ఉండేవారు, భక్తులపై అపార కారుణ్యం చూపేవారు. నిత్యమూ, నిరంతరమూ ఒకే ఆసనంపై స్థిరంగా ఉండేవారు. బాబా ఎన్నడూ ఎక్కడికీ ప్రయాణాలుచేసి ఎరుగరు. శిరిడీకి సమాన దూరంలో ఒకవైపు(దక్షిణమున) రహతా, మరోవైపు (ఉత్తరదిశ) నీమ్‌గాం ఉండేవి. ఈ రెండు గ్రామాలుదాటి బాబా ఎన్నడు ఎచ్చటికిపోయి ఉండలేదు. బాబా ఎన్నడూ రైలుబండిలో ప్రయణంచేసి ఎరుగరు. రైలుబండిని కనీసం చూసి కూడా ఉండలేదు. కానీ, సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలిసేవి.
చిన్న చేతికఱ్ఱ (సటకా)ను బాబా సదా ధరించి తిరిగేవారు. అదే బాబా చేతి దండం. చింతారహితులై ఎప్పుడూ శాంతంగా ఉండేవారు. సిరిసంపదలను, కీర్తిప్రతిష్టలను లక్ష్యపెట్టక, భిక్షాటనంచేస్తూ నిరాడంబరులై జీవించేవారు. అట్టి పావన జీవనులు బాబా. ఎల్లప్పుడు బాబా ‘అల్లామాలిక్’ (్భగవంతుడే యజమాని) అనేవారు. భక్తులపై అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానానికి బాబా గని వంటివారు. దివ్యానందానికి వారు ఉనికిపట్టు. సాయిబాబా యొక్క దివ్యస్వరూపం ఆద్యంతాలు లేనట్టిది. అక్షయమైనట్టిది. విశ్వమంతా ఆవరించి ఉన్న పరబ్రహ్మ తత్త్వమే సాయిబాబాగా రూపుదాల్చింది. ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే సాయిబాబా అనే ఆ నిధిని పొందగలుగుతారు. సాయితత్త్వాన్ని గ్రహించగలుగుతారు. సాయిబాబా నిజతత్త్వాన్ని గ్రహించలేక, బాబాను ఒక సామాన్య మానవునిగా భావించేవారు నిజంగా దురదృష్టవంతులు.
***
మానవరూపంలో అవతరించిన భగవత్ తత్వమే సాయిబాబా భగవంతునికి ఆరు లక్షణాలు ఉన్నాయి.
1) కీర్తి 2) ధనము 3) అభిమానం లేకుండుట 4) జ్ఞానం 5) మహిమ 6) ఔదార్యం.
ఈ గుణాలన్నీ మూర్త్భీవించిన సగుణ స్వరూపం శ్రీ సాయిబాబా. భక్తులకోసం మానవరూపంలో అవతరించిన భగవత్త్వమే సాయిబాబా. బాబా చూపే కరుణ, అనుగ్రహం అద్భుతములు. బాబాయే కనుక కరుణతో భక్తులను తమవద్దకు లాక్కుని ఉండకపోతే, బాబా మహాత్మ్యం గురించి తెలుసుకోగల శక్తి ఎవరికి ఉంది?.

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566