సబ్ ఫీచర్

స్కూలు ఒక జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాలల్లో ఉన్న వివిధ నైపుణ్యాలను ఒక రంగానికే పరిమితం చేయకుండా, ఆ రంగంలో ఏర్పడిన స్ఫూర్తిని వివిధ రంగాలలో ఉపయోగించటమే ఈ యుగం గొప్పతనం. కబడ్డీ ఆడుతుంటే మొత్తం జట్టు ఒక శక్తిగా ఏర్పడుతుంది. ఏడు రంగులు కలిస్తే ఒక కిరణం ఏర్పడుతుంది. దానే్న భానుకిరణం అంటారు. ఆటల్లో ఏర్పడిన స్ఫూర్తిని తరగతి గదికే కాకుండా మొత్తం పాఠశాలకు బదలాయించటాన్ని ‘టీమ్ స్పిరిట్’ అంటాం.
‘్ఫలానా వ్యక్తి మా క్లాస్‌మేట్’ అని కొందరు ఎంత గర్వంగా చెప్పుకుంటారో, ఫలానా వ్యక్తి మా స్కూల్‌మేట్ అని సగర్వంగా చెప్పుకుంటాం. దానే్న ప్రతి ఏడాది జరుపుకునే వార్షికోత్సవంలో చూసుకుంటాం. స్కూలు అంతా ఒక టీమ్ అవుతుంది. ఈ భావనను టీమ్ టీచింగ్ అంటాం. ఒక అంశాన్ని ఒకేసారి వివిధ భాగాలలో ఒక్కొక్క టీచరు తరగతి గదిలో బోధించడాన్ని టీమ్ టీచింగ్ అంటారు. అదే స్ఫూర్తితో ఒక జట్టు ఒక ప్రాజెక్టు చేస్తే దాన్ని టీమ్ లెర్నింగ్ అంటాం. ప్రాజెక్టు ఆరంభంలో అందరికీ విడివిడి స్వభావాలు, వైరుధ్యాలు ఉంటాయి. రుచులు వేరే విధంగా ఉంటాయి. కానీ ఒక ఆరు మాసాలు జట్టుగానే ఆలోచిస్తారు. అందుకే టీమ్ టీచింగ్ అయినా, టీమ్ లెర్నింగ్ అయినా జట్టులో వైరుధ్యాలు పోయి ఏకత్వం వస్తుంది. పాఠశాల అన్నది ఒక శక్తివంతమైన జట్టు.
ప్రజా స్కూళ్లు...
గత 20 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఊరు తిరిగాను. వెళ్లిన ఊళ్లల్లో రాత్రిపూట పడుకుని ఉదయం వాకింగ్ ఎక్కడ చేయాలో ముందుగా అడిగేవాడిని. ఉదయం 5 గంటలకు స్కూళ్లనిండా మనుషులే. ఆడామగా అందరూ వాకింగ్‌లోనే. స్కూలు ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉండేది. 10 మంది ఒక జట్టుగా ఏర్పడి ఉదయం 4 గంటలకే వచ్చి బడి పరిసరాలన్నింటినీ శుభ్రం చేస్తారు. పాఠశాలల ప్రాంగణాలన్నీ యోగాసనాలతో, నడకలతో, పరుగులతో నిండిపోతాయి. యోగాసనాలకు స్థానిక వ్యాయామోపాధ్యాయుడు శిక్షణనిచ్చేవారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఈ శిక్షణ పొందిన వారిలో కొందరు కానిస్టేబుళ్లుగా, ఎస్‌ఐలుగా ఎంపికవుతున్నారని చెబుతున్నారు. ఈ పద్ధతి గ్రామంలో అందరి ఆరోగ్యాలను కాపాడటమేగాక ఉపాధి అవకాశాలకు కూడా బాటలు వేస్తుంది. ఈ సంస్కృతి పల్లెలదాకా వచ్చింది.
ఈనాడు స్కూళ్లు చిన్న పిల్లల కోసమే కాదు పెద్దవారికి, గ్రామ జనాభాకు కూడా ఉపయోగపడితేనే సమాజం కూడా ఆ స్కూలును పట్టించుకుంటుంది. దీనే్న ‘ప్రజల భాగస్వామ్యం’ అంటారు. ఈనాడు స్కూలు పరిశుభ్రతకు చప్రాసీలే అవసరం లేదు. సమాజమే ఆ బాధ్యత తీసుకుంటుంది. మారిన పరిస్థితులలో పాఠశాల ద్వారా గ్రామ ఉద్ధరణకు కొత్త వ్యవస్థలు అమలులోకివచ్చాయి. నేడు పాఠశాలలు గ్రామ అభివృద్ధిలో పాల్గొనటానికి కొత్త విధానాలను అభివృద్ధి చేసుకున్నాయి. ఈ దృశ్యాలు ఇంచుమించు ప్రతి మండల కేంద్రంలోను కనిపించాయి. పాఠశాల కేవలం అక్షర జ్ఞానానికే కాదు ఆరోగ్యానికి, యువకుల ఉపాధికి తోడ్పడితే సమాజం కూడా ఆ పాఠశాలకు అండగా ఉంటుంది. అందుకే ఇవి ‘ప్రజా స్కూళ్లు’.
భవిష్యత్ దిక్సూచి...
21వ శతాబ్దంలో విద్యాలయాలు ఆర్థిక వ్యవస్థకు చేయూత ఇచ్చే వ్యవస్థలుగా రూపొందాయి. ప్రతి విద్యార్థి లింగ భేదం, వర్గ్భేదం లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు తనవంతు భాగస్వామ్యం అందించేలా తీర్చిదిద్దటమే విద్యారంగం లక్ష్యం. ఒకనాడు ఉపాధి కోసమే చదువుకునేది. ఒకనాడు బతుకుదెరువుకోసం చదువు, ఈనాడు జాతిని బతికించుకొనేందుకు చదువుకుంటున్నామనే లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. ఈ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి తరగతి గది ఒక పరిశోధనా సంస్థ కావాలి. ప్రతివ్యక్తిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. ఒకప్పుడు ఆ వనరులను బైటకు తీయటమే లక్ష్యం. కానీ ఈనాడు దాగివున్న మేధోసంపత్తిని బైటకు తీయటం ధ్యేయంగా మారింది. అంగవైకల్యం ఉన్నవారు కూడా తమ ప్రతిభను దేశానికి ధారపోస్తున్నారు. వారు అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తున్నారు. ‘చాక్ అండ్ బోర్డ్’ (సుద్దముక్క- బ్లాక్‌బోర్డు) అనే కాలం పోయింది. ఈనాడు ప్రతి పాఠశాల కూడా తాను దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడాలన్న దిశగా చొరవ చూపాలి. పాఠశాల బోధనకే పరిమితం కాకుండా అన్నిరంగాలనూ అభివృద్ధి చేసేలా ఉపాధ్యాయ వర్గం, తల్లిదండ్రులు చేయగలిగితే ప్రతి వ్యక్తి తానుకూడా దేశ అభివృద్ధిలో భాగస్వామిని కాగలిగాననే దశకు వెళతాడు. ఇపుడు గతాన్ని కాదు. భవిష్యత్తును నిర్మించాలి.

-చుక్కా రామయ్య