సబ్ ఫీచర్

బుచ్చిబాబు చిరంజీవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు శతజయంతి ఉత్సవాల ముగింపు‘అనాగరికులైన స్ర్తిలపట్ల సానుభూతి, ఇష్టం నాకు ప్రబలంగా ఉన్నాయి. నా రచనలలో తరచూ అలాంటి స్ర్తిలు దర్శనమిస్తుంటారు. వారి శరీరాలను మూగ మనస్తత్వాలను వర్ణించడంలో ఒక వింత ఆనందాన్ని పొందుతాను’’ అన్నారు బుచ్చిబాబు.
ఆయన పుట్టగానే తల్లికి పెద్ద జబ్బు చేసింది. పిల్లవాడికి పాలు ఇవ్వలేని స్థితి! అందుకని పిల్లవాడికి ఒక ఉప్పర స్ర్తితో పాలిప్పించారు. బుచ్చిబాబుకు తానలా స్తన్యం పొందడనికి కారణమైన స్ర్తి లాంటి స్ర్తిలంటే చిన్నప్పటినుంచే ఒక ప్రత్యేక అభిమానం ఉండేది. పెద్దయిన తర్వాత వాళ్లకి రచనల్లో ఓ ప్రత్యేక స్థానమిచ్చారు.
మానసికమైన ఒక అమాయకత్వం మరుగునపడి, మనుషులలో ఒక కృత్రిమమైన మనస్తత్వం ఏర్పడుతోందన్న భయం ఆయనలో ఉండేది. ఆ అమాయకత్వం-నైతిక శక్తికి, నిజాయతీకి గీటురాయి. అలాంటి పాత్రలను సృష్టించడంలో ఆయనకెంతో ఆనందం ఉండేదిట. ‘‘నన్ను గురించి కథ వ్రాయవూ’’ లో కుముదం పాత్ర ‘‘అరకులోయలో కూలిన శిఖరం’’లో మూనా పాత్ర, ‘‘చివరకు మిగిలేది’’లో కోమలి పాత్ర అలాంటివే నంటారు.
‘‘పల్లెటూళ్లలో నేనెరిగున్న స్ర్తిలలో చాలామందిలో ఈ అమాయకత్వం ఉండేది. అది విలువ కలదని, పోగొట్టుకోకూడదని నమ్మే నేనలాంటి పాత్రలను చిత్రించడంలో ఆసక్తి చూపిస్తాను. దీనికంతటికీ కారణం చిన్నప్పుడు ఉప్పరి మనిషి పాలు త్రాగడం వల్లనే అనుకోవడం అతిశయోక్తి కాదేమో నాకు తెలియదు,’’ అని కూడా అంటారు బుచ్చిబాబు.
‘ఉత్తమ ఇల్లాలు’ అంటూ ఎంకి నాయుడు బావల గురించి బుచ్చిబాబు ఒక నాటకం రాశారు. ఈ నాటకంలో ఎంకిని స్వేచ్ఛాజీవిగా చిత్రించారు. నాయుడుతో సహజీవనం చేస్తుంది. అందుకు ఊళ్లో పెద్దలు అంగీకరించరు. వాళ్లని ఊళ్లోనుంచి వెళ్లగొడతారు. ‘‘స్వేచ్ఛని అంతగా కోరే ఎంకి-నాయుడు చెప్పినట్టు అంగీకరిచిందంటే చిన్ననాడు ఆడుకున్న ఆటల్లో ఏర్పడిన మనస్తత్వం-ఒకరు చెప్పినట్టు నడుచుకోవాలన్న మనస్తత్వం పట్ల తాత్కాలికంగా ఇష్టం ఏర్పడిందేమో నాలో..’’ అంటారు బుచ్చిబాబు.
విజ్ఞానశాస్త్రం పురోగమించి, మానవుడి సౌఖ్యానికి పరికరాలు, సదుపాయాలు కల్పించడం ఆయనకు ఇష్టమే. కాని వెనక్కి నడపకూడదు. ‘‘విజ్ఞాన శాస్త్రానికి నా ఊహలో సంకేతకం-ఒక చక్రం..ప్రకృతికి సాంకేతికం- ఓపుష్పం! అది చక్రం కింద పడి నలిగిపోకూడదు. దీని ఇతివృత్తంగా ‘‘ఊడిన చక్రం-వాడని పుష్పం’’ కథానికను రాశానంటారు..
‘‘చిన్నప్పుడు తస్కరించే ధైర్యం నాకు లేదు. అదే మరోడు చేస్తే దాని ఫలితం పొందడానికి సిద్ధం. అలాగే ఒకరి మీద కసిపుట్టి హత్య చేయాలనిపించవచ్చు-కానీ హత్య చేయలేరు. ఆ పనే మరొకరు చేస్తే లోలోన ఆనందిస్తారు. డిటెక్టివ్ సాహిత్యం నేడు ఇంత వ్యాప్తి చెందడానికి ఇదొక కారణం అనుకుంటాను’’ అన్నది ఆయన అభిప్రాయం.
బుచ్చిబాబుగారి తండ్రి మద్రాసు ఇంజినీరింగ్ చదివే రోజుల్లో-ఆయన ఉంటున్న ఇంట్లో మరో వాటాలో నర్సింగ్ శిక్షణ పొందుతున్న కోమలి అనే ఆవిడ ఉండేది. ఆవిడకు-‘‘బుచ్చిబాబుగారి తల్లిదండ్రుల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కోమలికి పెళ్లి కాలేదు. నాన్నగారి కోసమని కోమలి పెళ్లిచేసుకోకుండా ఉండిపోయందనుకుంటే ఆదర్శ తత్వజ్ఞుల మనస్సులు చల్లగా ఉంటాయి. శరీర సుఖంతో మానసిక వార్థక్యం తెచ్చుకొని, హతమవని ఆదర్శ జీవి. ప్రేమించి దూరంగా ఉండి, శరీర సుఖం కోరక మనస్సును ఆనందంతో నింపుకునే ఉదంతం సాహిత్యంలో రాణిస్తుంది. కుముదం కథ అలాంటిదే. ఇట్లాంటిదే ‘పొగలేని నిప్పు’ అన్న కథానిక. నా కథానికలలో ఇది నాకు చాలా ఇష్టం’’ అంటారు బుచ్చిబాబు.
ఆయనే అన్నట్లు ‘‘చివరకు మిగిలేది’’ నవలలో మధ్య మధ్య జీవితానికి సంబంధించిన ఎన్నో నిర్వచనాలు చేస్తారు. అవి ఎంతో విలువైనవి. వాటిలో కొన్నింటిని చూద్దాం.
‘వివాహం కోసం స్ర్తి భర్తను అంగీకరిస్తుంది. మగాడు స్ర్తీ కోసం వివాహాన్ని అంగీకరిస్తాడు.’
‘వికృతమైన, అసహ్యకరమైన సత్యం ఎవరిక్కావాలి? అందమైన అసత్యాలే కావాలి.’
‘నేను పెళ్లి చేసుకొని ఆమెనో మనిషిని చేయాలని ఆశయం. నేను చేసుకోకుండా విడిచేస్తే ఆమె పదిమందిలో పడి ఏమైపోతుందో తలచుకుంటేనే భయమేస్తుంది!
‘మనస్సులో జరిగిన మార్పులు శరీరంలో బహిర్గతం కాకుండా చేసుకోలేరు స్ర్తిలు. కొందరి స్ర్తిల కదే అలంకారం. మరి కొందరికి ఆయుధం. బాధ పడడం వాళ్లకి సంతృప్తినీయదు. ఆ దృశ్యం ఇతరులు చూసి సానుభూతి ప్రకటిస్తేనే ఆ బాధ తీరుతుంది. ఆ ఇతరులు మళ్లీ స్ర్తిలు కాకూడదు..’
‘హద్దులు లేనిది అనుభవం. గొప్ప సౌందర్యానికి హద్దులు లేవు. రెండింటికి శరీరం హద్దు కాదు. కాకూడదేమో!
‘వాంఛించిన వస్తువును ఎవ్వరూ ప్రేమించలేరు. వాంఛించడం అంటే అనుభవించడం. అనుభవించడం వల్ల ఆ వస్తువు నశిస్తుంది. నశించకుండా చేసేదే నిజమైన ప్రేమ!
‘ఒక విషయాన్ని ఖండించడంలోను, ద్వేషించడంలోను, మనుషులు ఐక్యం అయినట్లు-ప్రేమించడంలో అవరు’
‘ఏడవడం ఆడవాళ్ల వంతు. బాధపడటం మగాడివంతు.’
‘ప్రేమకి ద్వేషం ముగింపు. యవ్వనానికి వాంఛ ముగింపు. జీవితానికి మృత్యువు ముగింపు.’
‘నిజం చెప్పినంత మాత్రాన అది ఉత్తమ సారస్వతం అనిపించుకోదు. వ్యక్తిగతమైన కష్ట సుఖాల్ని, సకల మానవులకూ వర్తించేటట్లు చిహ్న ప్రధానంగా చిత్రించాలి.
‘సానుభూతి చూపే వ్యక్తులు కనిపించే వరకు స్నేహితుల కోసం అనే్వషించక మానం. సత్యాన్ని, సౌందర్యాన్ని, అనే్వషించడం అంటే నిజంగా అదే అర్థం.’’
-ఇలాంటి ఎన్నో సత్యాలని ‘చివరికి మిగిలేది’ నవల ద్వారా చెప్పారు బుచ్చిబాబు.
జీవితాన్ని మధించి రచనలు చేసినావడు కాబట్టే మరో వందేళ్లయినా బుచ్చిబాబు చిరంజీవి.

-డా. వేదగిరి రాంబాబు సెల్: 9391343916