సబ్ ఫీచర్

అందమైన కళ్లకోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్లు త్వరగా అలసిపోవడం, కళ్ల కింద నల్లని వలయాలు రావడం వంటివి కంప్యూటర్‌పై పనిచేసేవాళ్లకు తరచూ జరుగుతుంటాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంతో పాటు కళ్లు ఆకర్షణీయంగా, మరింత అందంగా తయారవుతాయి.
* కీరాని ముక్కలుగా కోసం రుబ్బి రసం తీయాలి. దాంట్లో కొద్దిగా రోజ్‌వాటర్‌ని కలిపి కళ్ల చుట్టూ పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి.
* గంధం పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఇందులో కొద్దిగా జాజికాయ పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు కళ్ల చుట్టూ పట్టించాలి. తెల్లవారి కడిగేసుకుంటే కంటికి చలువే కాకుండా నల్లని వలయాలు కూడా తగ్గిపోతాయి.
* బంగాళాదుంపని మెత్తగా రుబ్బి రసం తీయాలి. అందులో దూదిని ముంచి కనురెప్పలపై పదిహేను, ఇరవై నిముషాల పాటు ఉంచి కడిగేయాలి.
* బేబీ ఆయిల్‌ని కళ్ల చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తే ఒత్తిడి తగ్గి రిలీఫ్ లభిస్తుంది.
* కొబ్బరి నూనె చుక్కల్ని కళ్ల చుట్టూ వలయాకారంలో రాసి నెమ్మదిగా మసాజ్ చేస్తే కళ్ల కింద నలుపు తగ్గుముఖం పడుతుంది.
* కనురెప్పలు దట్టంగా పెరగాలంటే క్రమం తప్పకుండా ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కనురెప్పలకి ఆముదం రాయాలి.
* కాచి వడబోసిన నీటిలో చిటికెడు ఉప్పు వేసి కళ్లను కడిగితే కళ్లు కాంతివంతంగా కనిపిస్తాయి.
* టొమాటో రసాన్ని, నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి కళ్లచుట్టూ పూయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే కళ్ల కింద నలుపు తగ్గడమే కాకుండా ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఈ మిశ్రమం రోజు విడిచి రోజు పూస్తే మంచి ఫలితం ఉంటుంది.
* కీరాను చక్రాల్లా కోసి ఐదు నిముషాలు కళ్లమీద ఉంచినా కళ్లు తాజాగా ఉంటాయి.
* ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా ఉసిరిక పొడిని వేసి అరగంటపాటు ఉంచాలి. ఈ తేటతో కళ్లను శుభ్రం చేసుకుంటే కళ్లు తాజాగా ఉంటాయి.
* ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల కళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.