సబ్ ఫీచర్

గురువు అంటే అర్థం??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: సద్గురూ! మనం దేనిని గుడ్డిగా నమ్మకూడదనీ, జీవితంతో పరీక్షించి మనంతట మనమే తెలుసుకోవాలని మీరు చెబుతారు. కానీ, ఆధ్యాత్మికంగా ఎదగవలసిన విషయంలో మాత్రం గురువుపట్ల అచంచలమైన విశ్వాసం అవసరం అవుతుంది. నమ్మకానికీ, విశ్వాసానికీ మధ్య తేడా ఏమిటి?

సద్గురు:నమ్మకం మీరు ఆశించే ప్రయోజనాలనుండి జనిస్తుంది. మీరు ‘నేను మిమ్మల్ని నమ్ముతున్నాను’ అంటే నేను మీరు చేసే తప్పొప్పులకి అనుకూలంగా స్పందించాలని అర్థం. మీ తప్పొప్పులకి అనుకూలంగా స్పందించాలని అర్థం. మీ తప్పొప్పుల పరిధిలో లేని పనిని నేను చేసాననుకోండి. అది జరగగానే మొట్టమొదటగా మీరేమంటారు? ‘నేను మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. తీరా మీరు ఇలా చేశారు’ అని అంటారు. ఒకవేళ గురువు మీ పరిమితుల పరిధిలో ఉన్నాడంటే, మీరు ఆ వ్యక్తి చుట్టుప్రక్కలకి వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు దేనికీ పనికిరాడు. ఈయన మీకు ఊరటనిస్తాడు, సౌకర్యంతో ఉంచుతాడు. కాని ఇతను మీకు ఒక బంధనం. ఈయన ముక్తి ప్రసాదించేవాడు కాదు. విశ్వాసం అలా కాదు. విశ్వాసం మీ గుణం. దాన్ని వేరేదీ ప్రభావితం చేయలేదు. అది అలా ఉంటుంది, అంతే. మీరు ‘నేను విశ్వసిస్తున్నాను’ అని అంటే, దానర్థం ‘మీరు ఏమైనా చేయండి, నా విశ్వాసం సడలదు’ అని. అది మీ పరిమితుల పరిధులలో ఉండేది కాదు.
నేను మిమ్మల్ని ఎన్నడూ నన్ను విశ్వసించమని కోరలేదు. నేను ‘విశ్వాసం’ అన్న ఆ పదాన్ని ఎందుకు ఎక్కువగా ఉపయోగించకపోవడానికి కారణం ఆ మాటని అందరూ భ్రష్టుపట్టించడమే. ఇక్కడ ఎవరైనా ఎన్నడైనా విశ్వాసం గురించి మాటాడితే, మిమ్మల్ని మీ ఇష్టాయిష్టాల, మీ పరిమితుల చట్రం నుండి మిమ్మల్ని లేవనెత్తడానికే. ‘నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నా’ అన్న భావన మిమ్మల్ని ఎదగనిస్తుంది. ‘మీరేం చేసినా సరే, మీ మీద నా విశ్వాసం సడలదు’- మీరు నిజంగా మీ గురు సన్నిధివల్ల ప్రయోజనం పొందాలనుకుంటే, గురుసాన్నిధ్యం మిమ్మల్ని ముంచెత్తే విధంగా, మిమ్మల్ని లొంగదీసుకునే విధంగా మీరు మారిపోవాలి.
గోడలను కూలదొయ్యడం
ఎవరైనా విశ్వాసం గురించి మాటాడుతున్నారంటే, దానర్థం వాళ్లలోకి మరొకరిని అనుమతించడమే. ఒకరు మీలో చొరబడాలంటే, ఆ వ్యక్తికి మీరొక అవకాశంగా మారాలి. ఒకసారి ఆ వ్యక్తి ప్రవేశించిన తర్వాత, మీరు దేనికైనా గురికావచ్చు. మీరు గోడలు కట్టుకోవడానికి కారణం ఇదే. మీరు మరొకరికి అవకాశంగా మారినపుడు, మీరు అనుకోని ఒక పనిని ఎవరో చేశారు. దానికి భయపడి మీ చుట్టూ మీరు గోడలు కట్టుకున్నారు. ఇపుడు మీరు ‘నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను’ అంటే, ఆ గోడల్ని కూలదొయ్యడానికి ఇష్టపడుతున్నారన్నమాట. అంటే, అవతలి వ్యక్తి మీ బలహీనతల పరిధిలో ఉండనక్కరలేదన్నమాట. నాకు వ్యక్తులతో గడపగలిగిన సమయం చాలా పరిమితం. కనుక నా సన్నిధికి అవకాశం కలిగిస్తున్నారు తప్ప, నా వ్యక్తిత్వాన్ని ఒక సాధనంగా ఉపయోగించడంలేదు. వ్యక్తిగా, చాలావరకు మీ అభీష్టాలకి అనుగుణంగా ఒక పార్శ్వాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను నా వ్యక్తిత్వాన్ని కూడా సాధనంగా ఉపయోగించవలసి వస్తే, అపుడు మరింత విశ్వాసం అవసరం అవుతుంది. బహుశా ఎక్కువ సమయం కూడా గడపవలసి రావొచ్చు. నాతో చాలాకాలంగా వుంటున్నవారు నన్ను ఎంత దుర్భరమైన మనిషినని అనుకుంటున్నారో, నేను అలా మీతో ఉండటం లేదు.
బుద్ధిపూర్వకంగా చేస్తున్న కల్పన
ఈ క్షణంలో మీరు ఏ వ్యక్తిత్వాన్నైతే ‘నేను’ అని భ్రమిస్తున్నారో, అది ఒక రకంగా కాకతాళీయం, అది మీరు ఎదుర్కొన్న పరిస్థితుల ప్రభావంమీద ఆధారపడ్డది. జీవితం ద్వారా లొంగదియ్యబడుతూ నిరంతరం మీ వ్యక్తిత్వం మార్పుకి లోనవుతూనే వుంటుంది. మిమ్మల్ని జీవితం ఎటువైపుకి లొంగదీస్తే, మీకు అటువంటి వ్యక్తిత్వం, ఆకారం వస్తాయి. బాహ్య సంఘటనలు మీ వ్యక్తిత్వాన్ని నిరంతరం తీర్చిదిద్దుతుంటాయి. మీరు ఎవరినైతే ‘గురు’ అని పిలుస్తారో అతను వ్యక్తికాదు. కానీ, అన్ని పరిమితులకీ అతీతంగా తనని తాను అనుభూతి చెందుతున్న వ్యక్తి, దీనినే మరింత లోతుగా చెయ్యగలుగుతాడు. అటువంటి వ్యక్తి, జీవితంలోని అన్ని పార్శ్వాల్ని తను నిర్వహించదలచుకున్న పాత్ర అవసరాలకు అనుకూలంగా మలుచుకుంటాడు. అది స్పృహతో చేసే కల్పన. స్పృహతో చేసినపుడు ఆ కల్పన ఒక సాధనం అవుతుంది. అది ఇక ఎన్నడూ బంధనం కాదు. అతను ఏ క్షణంలోనైనా దాన్ని కూలదొయ్య సమర్థత కలిగి వుంటాడు. మీరు దానికి భిన్నమైన వ్యక్తిత్వాన్ని చూసినపుడు తట్టుకోలేకపోతారు. ఒక గురువు తన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటాడంటే, అతన్ని అభిమానించాలో, ద్వేషించాలో తెలియక తికమకపడుతారు. ఒక క్షణంలో ‘అవును, నిజంగా ఈ వ్యక్తంటే నాకు ఇష్టం’ అనుకునేట్టూ, మరుక్షణంలోనే, అతనిమీద దానికి భిన్నమైన అభిప్రాయం కలిగేటట్టూ గురువు ఎంతో జాగ్రత్తగా తన వ్యక్తిత్వాన్ని దిద్దుకుంటాడు.
దూకు దూకడం
మీ అనుభవంలో లేనిదానిని మేధోపరంగా అర్థమయేట్టు చెప్పడం సాధ్యం కాదు. ఒక వ్యక్తిని ఒక పరిమితికి చెందిన అనుభవం నుండి వేరొక పరిమితికి చెందిన అనుభవంలోకి తీసుకుపోవాలంటే, అతనికంటే ఎంతో శక్తివంతమైన సాధనం కావాలి. అటువంటి సాధనానే్న మనం గురువు అంటాం. గురుశిష్యుల సంబంధం శక్తి సమీకరణానికి సంబంధించినది. ఇంతకుముందు మిమ్మల్ని ఎవ్వరూ స్పృశించని ప్రమాణంలో గురువు మిమ్మల్ని స్పృశిస్తాడు.
మీ శక్తుల్ని ఆజ్ఞా చక్రంలోకి తీసుకుపోవడానికి అనేక మార్గాలున్నాయి. కానీ ఆజ్ఞాచక్రం నుండి సహస్రార చక్రానికి తీసుకుపోవడానికి ఒక ప్రత్యేకమైన మార్గం అంటూ లేదు. అందుకనే, మన సంస్కృతిలో గురు-శిష్య సంబంధాన్ని అంత పవిత్రమైన సంబంధంగా భావిస్తారు. ఇలా దూకాలంటే, మీకు గురువు పట్ల అటువంటి విశ్వాసం ఉండాలి. లేకపోతే, అది సాధ్యపడదు.

-సద్గురు