సబ్ ఫీచర్

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యానందో నిర్గుణం బ్రహ్మ తస్మాత్ సగుణా విర్భావః
సగుణాత్‌శక్తిః శక్తేర్నాదబిందుః
బిందోః కుండలినీ కుండలినే్య ఆంతరరూపా
ఇయం చిత్కళా (షట్చక్ర నిరూపణం)
నిరాకారము నిర్గుణమూ అయిన పరతత్త్వము నుండి సగుణము సాకారమూ అయిన శక్తి తత్వమొకటి ప్రకటనమైనదనీ
సావిద్యా పరమా ముక్తేః హేతు భూతాసనాతనీ
సంసారబన్ధ హేతుశ్చ సైవ సర్వేశ్వరేశ్వరీ
ఆమెయే పరావిద్య అని ముక్తి హేతువని శాశ్వతమైనదనీ ఈశ్వరులకు ఈశ్వరి అయినదనీ చెప్పబడుతున్నది. యోగమాయరూపిణి అయిన ఆమె చేత ఆవరింబడి మహావిష్ణువు కల్పాంతములో వటపత్రంమీద నిద్రపోతూ ఉంటే ఆయన నాభి నుండి బ్రహ్మ ఉదయించేడు. ఆయన కర్ణమలమునుండి మధుకైటభులనే రాక్షసులు పుట్టేరు. ఈ రాక్షసులు బ్రహ్మను హింసించటం మొదలుపెట్టేరు. విష్ణువు నిద్రలో అచేతునుడయ్యేడు. అపుడు బ్రహ్మ పరాశక్తిని స్తోత్రం చేయటం మొదలుపెట్టేడు.
త్వయైత ద్ధార్యతే వివ్వం త్వయైతత్ సృజ్యతేజగత్
త్వయైతత్పాల్యతే దేవి! త్వమస్త్యనే్తచ సర్వదా
విసృష్టౌ సృష్టి రూపత్వం స్థితి రూపాచ పాలనే
తధా సంహృతి రూపానే్త జగతోస్య జగన్మయే-అని స్తుతిస్తాడు. అంటే- ఈ విశ్వమంతా నీ నుండి సృష్టింపబడుతున్నది. నీవలన పాలింపబడుతున్నది. నీ కారణముగానే సంహరింపబడుతున్నది. కనుక సృష్టి స్థితిలయములు మూడు రూపములూ నీవే అయి ఉన్నావు అని. అందుకే అమ్మవారిని-
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ
సంహారిణీ రుద్ర రూపా తిరోదానకరీశ్వరీ
అని సహస్రనామాలలో స్తుతిస్తూ వుంటారు. అంటే, ఈ విశ్వము యొక్క సృష్టి స్థితిలయ కారకులుగా మనం ఏ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తలుస్తూ ఉంటామో, ఆ త్రిమూర్తులు కూడా మూలరూపిణి అయిన మహాశక్తివలన ఉద్భవించిన రూపాలే తప్ప స్వతంత్రులు కారు.
ఈశ్వరో హంచ సూత్రాత్మా
విరాడాత్మాహమస్మిచ
బ్రహ్మాహం విష్ణు రుద్రౌచ
గౌరీ బ్రాహ్మీచ వైష్ణవీ- అని అమ్మవారు హిమంతునితో అంటుంది.
ఇప్పుడా తల్లి వాళ్ళ స్థితికి తల్లి అయింది. అమేయశక్తి. శక్తిహీనులైనప్పుడు త్రిమూర్తులు కూడా ఏమీ చేయలేదు. కనుక వాళ్ళకు తన సాన్నిహిత్యమును కలిగించటం కోసం తనను తానే మూడు విధాలుగా విభజించుకొని- సరస్వతీ లక్ష్మీ పార్వతులుగా రూపధారణ చేసి వారి యందు అంతర్హితయై వారిని శక్తిమంతుల్ని చేస్తుంది.
ఇపుడు మాతృరూపిణి అయిన పరాశక్తే భార్య రూపకంగా పురుషుణ్ణి వరించింది. అంతేకాదు, శివరూపంగా వున్న పురుషునికి భార్య అయిన శక్తి విష్ణురూపునిగా వున్న పురుషునిచే సహోదరిగా గౌరవింపబడింది. అందుకే అమ్మవారిని నారాయణ సహోదర్వైనమః అని స్తుతిస్తాం. అంటే పురుషుని యందు శక్తి రూపంగా ఉండి ఆ పురుషుణ్ణి కదిలించి చేతనునిగా చేసే స్ర్తిమూర్తిని ఈ హైందవ సంస్కృతి తల్లిగా గౌరవించింది, భార్యగా ప్రేమించింది, సోదరిగా అభిమానించింది. అంతేకాని ఏనాడూ పనికిరానిదిగా అబలగా చూసి చులకన చేయలేదు. అలా చూసే ప్రకృతి ఒకటున్నది-
అది మహిష ప్రకృతి
అది రాక్షస ప్రకృతి
అందుకే వాడు తపస్సు చేసి విశ్వంలో వున్న ఏ మగవాడూ తనను చంపలేకుండా వరాన్ని కోరేడు.
మరి! ఆడవాళ్ళ మాటేమిటి? వాడు లెక్క చేయలేదు. ఎందుకని? తాను మగవాడు. అది అబల. తనను ఏదైనా చేయగల సామర్థ్యం దానికి లేదు.
ఇదీ వాడి భావన! దీనిని ఖండింపవలసి అవసరం వచ్చింది. మహాశక్తి విజృంభించింది. సర్వ పురుష తత్వమూ ఆమెకు దోహదం చేసింది. ఆ మహిషాసురుడు నశించేడు. ఇదీ ఈ గడ్డమీద పుట్టిన మహాగ్రంధాలు అందించిన సందేశం.
దీన్ని వినాలి. దీన్ని గ్రహించాలి. దీన్ని ఆచరించాలి. అప్పుడే జాతి సంప్రదాయం ప్రకటనమవుతుంది. ఈ సృష్టిని దుష్ట్భావనలనుండి దుష్ట సంప్రదాయములనుండి రక్షించే తత్త్వాన్ని విష్ణుశక్తిగా కొలుస్తాం. పరాశక్తి ఈ రక్షణకు సంబంధించిన కార్యాన్ని విష్ణువు చేతనే చేయిస్తూ వుంటుంది. ఆయన వెనుక తాను-
యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా
అనినట్లు తాను లక్ష్మీ కళగా ఉంటూ ఉంటుంది.

- కాశీభొట్ల సత్యనారాయణ