సబ్ ఫీచర్

నాజూకైన నడుముకు నవీన ఆభరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలేజీకి వెళుతున్న ఏ అమ్మాయిని చూసినా జీన్స్, టీషర్ట్.. కుర్తీ.. లాంగ్‌స్కర్ట్.. లేదా మిడ్డీలతో మెరిసిపోతుంటారు. వీటిల్లో ఏది వేసుకున్నా అదనపు హంగు కనిపించాలంటే మాత్రం బెల్టు వాడాల్సిందే.. దుస్తులతో పాటు నేడు బెల్టుల ఆకారాల్లో కూడా చాలా ట్రెండ్స్ వచ్చాయి. ఇటీవలి కాలంలో అమ్మాయిల బెల్ట్ రూపరేఖలు మారిపోయాయి. ధరించే డ్రెస్, వ్యక్తిగత అభిరుచులకు తగిన రకరకాల బెల్టులను అమ్మాయిలు వస్తధ్రారణలో భాగంగా చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్నా సందర్భానుసారంగా, డ్రెస్‌ను అనుసరించి.. ఇంకా చెప్పాలంటే వయసును, శరీర ఛాయను అనుసరించి పలురకాల బెల్టులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మరి నేటితరం ఎలాంటి దుస్తులకు ఎలాంటి బెల్టులను ఉపయోగిస్తున్నారో, ఎలాంటి వాటిని కొనుగోలు చేస్తున్నారో ఒకసారి చూద్దాం..
* సాధారణంగా బెల్టులు జీన్స్‌పాంట్స్, మిడ్డీలపైకి చక్కగా నప్పుతాయి.
* కొత్త బెల్టు కొనేటప్పుడు అది నడుము సైజుకంటే ఐదు అంగుళాలు మాత్రమే పెద్దగా ఉండేట్లు చూసుకోవాలి. మరీ పెద్దగా ఉంటే బాగోదు.
* ప్యాంట్ రింగ్స్, బెల్డ్ వెడల్పు తగిన నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి.
* కురచగా ఉండే టాప్, ఒంటికి అతికినట్లు ఉండే జీన్స్, ఫ్రాక్స్‌పైకి రిబ్బన్ బెల్టు ఉంటే అదనపు అందం చేకూరుతుంది.
* టీషర్ట్, జీన్స్ కాంబినేషన్‌తో మరింత అందంగా కనిపించాలని కోరుకునే అమ్మాయిలు వెడల్పైన బెల్టులను ఎంచుకుంటే బాగుంటుంది.
* ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఫార్మల్ డ్రెస్ వేసుకుని వెళతారు కాబట్టి.. దానికి తగినట్లుగా ఫార్మల్ పాంట్, లేత జీన్స్‌పైకి నలుపు లేదా ముదురు గోధుమరంగు బెల్టులు బాగా నప్పుతాయి.
* సన్నగా, మృదువుగా ఉండే బెల్టులు ఎలాంటి డ్రెస్‌పైకైనా చాలా బాగుంటాయి.
* బిగుతుగా ఉండే స్టైలిష్ డ్రెస్సెస్‌కి అంతకన్నా స్టైల్‌గా ఉండే ఎంబ్లిష్డ్ బెల్ట్‌లు బాగుంటాయి. ఇవి రకరకాల రంగుల్లో, సైజుల్లో లభిస్తాయి.
* నలుగురిలో ప్రత్యేకంగా, పోష్ లుక్‌తో కనిపించాలంటే మాత్రం పెద్ద సైజు బకిల్ ఉన్న బెల్ట్‌లను వాడాలి.
* దుస్తుల రంగుకు భిన్నమైన, తేలికపాటి రంగులున్న బెల్టులు చక్కగా నప్పుతాయి.