సబ్ ఫీచర్

మహిళా రక్షణకు యాప్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందివచ్చిన సాంకేతికత మహిళల రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతోంది. మహిళలపై జరుగుతున్న దాడుల కేసుల్లోనూ ఈ సాంకేతికత కీలక సాక్ష్యంగా నిలుస్తోంది. ముఖ్యంగా షిఫ్ట్‌వారీగా పనిచేసే ఎందరో మహిళలకు పలు ఆధునిక యాప్‌లు బాడీగార్డులుగా పనిచేస్తూ సేవలందిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి కొన్ని యాప్స్ గురించి తెలుసుకుందాం..
మహిళలపై దాడి చేయాలన్న ఆలోచన రాకుండా చేయగల యాప్ ‘హ్యాక్ ఐ’. తెలంగాణా పోలీసులు అభివృద్ధి చేసిన ఈ యాప్‌ను ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకుని.. క్యాబ్‌లో కూర్చోగానే క్యాబ్ నెంబరు, డ్రైవర్ ఫొటోను ‘విమెన్ ట్రావెల్ మేడ్ ఈజీ’ అన్న ఐకాన్ దగ్గర పోస్ట్ చేస్తే పోలీసులు ఆ క్యాబ్‌పై నిఘా ఉంచుతారు.
తెలంగాణా రాష్ట్ర పోలీసులు మహిళా రక్షణ కోసం తెచ్చిన సేవ ఇది. కొత్త ప్రదేశాల్లో, రాత్రివేళల్లో ఒంటరిగా ప్రయాణించే విద్యార్థినులు, మహిళల భద్రతకోసం తాము ప్రయాణిస్తున్న క్యాబ్ లేదా ఆటో నెంబరును 9969777888కు ఎస్.ఎమ్.ఎస్. చేస్తే దానికి సమాధానంగా ఒక ఎస్.ఎమ్.ఎస్. వస్తుంది. అంటే వారు ప్రయాణిస్తున్న వాహనం జిపి ఆర్ ఎస్‌కు అనుసంధానం అయినట్లే.. దీనివల్ల వారు నిర్భయంగా గమ్యం చేరుకోగలుగుతారు.
విద్యార్థినులు, మహిళలు ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు, కిడ్నాప్ అయినప్పుడు తామున్న చోటును తెలియజేసే మరో యాప్.. ‘పేరెంట్ పెండింగ్ గ్లింప్స్ వాచ్’. ముందుగా ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, ఐవోఎస్, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ వాడేవారు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జీపీఎస్ ఉన్న ఫోనుకు లొకేషన్‌ను అనుసంధానం చేయాలి. దీంతో మీరెక్కడున్నారో కుటుంబ సభ్యులకు తెలుస్తుంది.
మహిళలకు రక్షణగా నిలిచే మరో యాప్ ‘మై సెక్యూరిటీ’. సమాచారంతో పాటు.. పరిసరాల ఫొటోలను కూడా సన్నిహితులకు పంపించగలిగే టెక్నాలజీ ఇందులో ఉంది.
బయట ఉన్నప్పుడు మీ క్షేమ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు తెలియజేసే ఉచిత ఆండ్రాయిడ్ యాప్.. ‘ఐయామ్ సేఫ్’ అప్లికేషన్. ఏ ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతో పాటు మ్యాప్స్ కూడా పంపుతుంది. ఒకవేళ ఏదైనా ప్రమాదంలో చిక్కుకొంటే మూడు సార్లు మెనూ బటన్ నొక్కితే నేరుగా ప్రమాద సమాచారం ఎస్.ఎం.ఎస్. రూపంలో ముందుగానే ఎంపిక చేసి సేవ్ చేసి పెట్టుకున్న కుటుంబ సభ్యులకు వెళ్లిపోతుంది.
దాడికి దిగిన వారిని వణికించేలా చేసే యాప్ ఇది. ‘షేక్ అలర్ట్’ యాప్. ఈ ఐ ఫోన్ అప్లికేషన్ ఉన్నవారిపై ఎవరైనా దాడి చేసినా.. కిడ్నాప్ యత్నం చేసినా.. చేతిలో ఉన్న ఫోన్‌ను గట్టిగా షేక్ చేస్తే చాలు.. చెవులు చిల్లులు పడేలా శబ్దం వస్తుంది. ముందుగా నమోదు చేసుకున్న ఫోన్ నెంబర్లకు మీరున్న లొకేషన్ వివరాలు చేరిపోతాయి. ఈ అప్లికేషన్‌ను ఆపిల్ స్టోర్ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మహిళల రక్షణకు ఉద్దేశించిన మరో మ్యాప్ బేస్డ్ మొబైల్ అప్లికేషన్ ‘సేఫ్టీపిన్’. ఈ యాప్‌లో ఏది పోస్ట్ చేసినా అది ఆ గ్రూప్ సభ్యుల వాల్ ట్యాగ్‌పై కనపడుతుంది. రోడ్డు స్థితి, ఏవైనా ఇబ్బందులున్నాయా, వీధి దీపాలున్నాయా? వంటి వివరాలు, రోడ్డుపై ఎవరైనా దాడులకు దిగుతున్నా ఆ గ్రూపులోని అందరికీ సమాచారం అందుతుంది. ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐ ఫోన్‌లో లభిస్తుంది.
ఈ యాప్స్ అన్నీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని వాటిని యాక్టివేట్ చేయాలి. జీపీఆర్‌ఎస్ ఆన్ చేసి ఉంచాలి. అలాగే మీ క్షేమం కోరే మీ కుటుంబ సభ్యులు, వారి ఫోన్ నంబర్లతో పాటు.. కొన్ని మెసేజ్‌లను కూడా ముందే టైప్ చేసి ఉంచుకోవాలి.
*