సబ్ ఫీచర్

మారాల్సింది మనమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజ గమనంలో దాగివున్న ఒక అద్భుతమైన రహస్యాన్ని చాలామంది గుర్తించరు. మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం ఉండి తీరుతుంది. అయితే దాన్ని గుర్తించడానికి ఎక్కువమంది అసలు ప్రయత్నించరు. ఒకటి, రెండు మార్గాలలో ప్రయత్నించి, అందులో వైఫల్యం ఎదుర్కోగానే అన్ని అవకాశాలు మూసుకుపోయాయనే నిర్ణయానికి వస్తుంటారు. ఇది మంచిది కాదు
**
మారుతున్న కాలం మన జీవితంలో, సామాజిక గమనంలో ఎన్నో మార్పుల్ని తెచ్చిపెడుతుంది. ఈరోజు ఏ పరిష్కారమూ లేదనుకున్న సమస్య మరుసటిరోజుకు తనంతట అదే మటుమాయం కావచ్చు. అంతా అంధకారమయం అనుకున్న జీవితంలో ఉన్నట్టుండి వెలుగు ప్రసరించవచ్చు. అనుకోని అవకాశం అందిరావచ్చు.
ఈ జీవితమింతే అని ఎవ్వరూ నిరాశా, నిస్పృహలకు గురి కావలసిన అవసరం లేదు. ఎంతటి భయంకర సమస్య ఎదురైనా పరిష్కారం లభిస్తుంది. సమాజం కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరికీ ఎంతో తోడ్పాటును అందిస్తుంటుంది. ఆ తోడ్పాటును అందుకోవడానికి సిద్ధంగా ఉంటే చాలు.
సరోజ భర్త వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఎదుర్కొని అనేక అప్పులు మిగిల్చి అకస్మాత్తుగా మరణించాడు. భర్త చనిపోయాక తమకున్న ఆస్తులన్నీ అమ్మి కొంతవరకూ అప్పులు తీర్చింది. ఆమె కుమార్తెలిద్దరూ డిగ్రీ పూర్తిచేయలేదు. వారిని కొద్దిపాటి జీతానికి ఉద్యోగాల్లో చేర్చింది. నెలకు పది రూపాయల వడ్డీకి యాభై వేల అప్పు తీసుకున్నాడు భర్త. చనిపోయిన తర్వాత సరోజ అయిదారు నెలలు వడ్డీ చెల్లించింది.
కొన్నాళ్లకు తాను ఇక చెల్లించలేనని ఆమె ఎంతగా ప్రాధేయపడినా అప్పిచ్చినవాడు రోజూ వచ్చి ఓ గంటసేపు కదలకుండా కూర్చుని వేధించేవాడు. తనకు చెల్లించాల్సింది వడ్డీతో కలిపి లక్ష రూపాయలైందని, వాళ్ళు ఉంటున్న ఇల్లు రెండు లక్షల రూపాయలు చేస్తుందని, అది తన పేరిట రాస్తే, తిరిగి లక్ష రూపాయలిస్తానని విసిగించేవాడు. దానికి సరోజ అంగీకరించలేదు.
అతడు ఒక ఉదయం వచ్చి ఇంట్లో టీవీ, ఫ్యాన్లు, మిక్సిలు లాంటి సామాన్లు బలలవంతంగా తీసుకుపోయాడు. ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి మరుసటి రోజు వస్తానని చెప్పాడు. ఇది జరుగుతుండగా పక్కింటామె వచ్చి చూడటంతో సరోజ బిక్కచచ్చిపోయింది. ఆ వడ్డీ వ్యాపారి దౌర్జన్యాన్ని గురించి ఆమె పోలీసు స్టేషన్‌కు వెళ్లి చెబితే, వాళ్ళు వినిపించుకోకుండా అవమానకరంగా మాట్లాడారు. సాయంత్రానికి ఆమె ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చుంది. కాసేపటికి ఆమె కుమార్తెలిద్దరూ వచ్చి, తాము ఎంతో కష్టపడి సంపాదించుకు వస్తున్న దానిలో సగం పాత బాకీలకు వడ్డీలు కట్టడానికే సరిపోతోందని, ముగ్గురూ విషం తాగి చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు.
సరోజలో కూడా అంతవరకూ వున్న ధైర్యం సడలిపోయింది. తెల్లరగనే ఆ వడ్డీ వ్యాపారి మళ్లీ వస్తాడనే భయంతో వణికిపోతూ ఆ రాత్రంతా నిద్రపోకుండా గడిపారు. పొద్దుపొడవగానే వచ్చిన వడ్డీ వ్యాపారిని చూసి పక్కింటామె, ఆమె భర్త అక్కడకు వచ్చారు. వాళ్ళతోపాటు చుట్టుప్రక్కలవాళ్ళు ఓ ఇరవైమంది పోగై ఆ వడ్డీ వ్యాపారిని నిలదీశారు. కావాలంటే కోర్టుకు వెళ్ళమని, ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తే సహించేది లేదని చెప్పారు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత ఆ వడ్డీ వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఇరుగుపొరుగు వారు జోక్యం చేసుకుని మిగిలిన బాకీవాళ్లకు కూడా నచ్చచెప్పి బాకీలు వదులుకొనేట్లు చేశారు. సరోజ జీవితంలో నూతన అధ్యాయం మొదలైంది.
సమాజం వేగంగా మారిపోతుంటుంది. కొండలు, గుట్టల్లోనే బ్రహ్మాండమైన భవంతులు వెలుస్తాయి. నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమ ఉన్నట్టుండి లాభాల బాటలకు మళ్ళుతుంది. ఎందుకూ పనికిరానివాడని ఈసడింపుల్ని ఎదుర్కొన్న వ్యక్తి ఉన్నత స్థానాన్ని అందుకొంటాడు. అందరూ తక్కువగా చూసే వ్యక్తి కోట్లు ఆర్జించి అందరినీ నివ్వెరపరుస్తాడు.
సమాజంలో ఎదురయ్యే సమస్యలే మరో రూపంలో వ్యక్తిగత జీవితంలో కూడా దర్శనమిస్తాయి. నిరంతరం కలతలల్లో మునిగితేలే దంపతులు, ఎవరికివారు తమ దృక్కోణమే సరైనదని భావించుకుంటారు. దానిలో మార్పు వచ్చే అవకాశం ఉందని కూడా వారికి తట్టదు. ఈ వివాహ వ్యవస్థలో, ఆ వ్యవస్థపట్ల తమకున్న అభిప్రాయాల్లో లోపాలున్నాయనీ వాటిని సవరించుకోవాలనీ భావించారు.
అంతేకాదు.. భర్తపట్ల, పైఉద్యోగినిపట్ల, సహచరులపట్ల తమ దృక్పథం, ప్రవర్తన ఎలా ఉండాలన్న స్పష్టత చాలామందికి గోచరించదు. భర్త తనను, తన తల్లిదండ్రులను తక్కువ చేసి చూస్తుంటే, అతని దృక్పథాన్ని మార్చాలి. తమకు తోటివారితో ఉండాల్సిన సంబంధాలను నిర్దేశించుకోగలిగితేనే వారికి తప్పకుండా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితే ఎప్పటికీ కొనసాగుతుందని భావించి ఎదుటివారిపై ఆగ్రహాన్ని, వ్యతిరేకతను, ద్వేషాన్ని పెంచుకునేవారు. వాటిమధ్యే సతమతమవుతారు.
ఈ గతిశీల ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మార్పు ఒక్కటే స్థిరం.

- పి.ఎం.సుందరరావు