సబ్ ఫీచర్

బౌద్ధ సన్యాసినుల జీవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశాన్ని అందేలా ఉన్న హిమాలయాల అంచుల్లోని శివారు ప్రాంతం లడఖ్. ఉత్తరాదిన భారతదేశం చివరన ఉన్న ప్రాంతం కూడా ఇదే.. ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా, ఎంతో అందంగా, అద్భుతంగా, వర్ణనాతీతంగా ఉంటుంది. ఇక్కడ బౌద్ధులు.. వారి మఠాలతో కిక్కిరిసి ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రతీ సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు పర్యటిస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇది 28 మంది బౌద్ధ సన్యాసినుల నివాస కేంద్రం కూడా అని.. అదే లడఖ్ లోని కుగ్రామం అయిన నయిమా.. ఇక్కడ ఇరవై ఎనిమిది మంది బౌద్ధ సన్యాసినులు జీవనం గడుపుతూ ఉంటారు.
మహిళలకు హక్కులుండాలని ప్రతిపాదించినవారిలో బుద్ధుడు కూడా ఒకరని విశ్వసిస్తుంటారు.. బౌద్ధం వ్యాప్తి చెందిన కాలం నుంచి ఈ మతంలో సన్యాసినులు ఉండే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే.. వందల ఏళ్ల నుంచి సన్యాసం స్వీకరించే మహిళల సంఖ్య తగ్గుతూ వస్తోంది. బౌద్ధసన్యాసుల మాదిరిగా మఠాల్లో ఉంటూ ధ్యానం చేసే అవకాశం ఈ మతంలోని సన్యాసినులకు లేదు. కానీ 2012లో లడఖ్‌లోని సన్యాసినులంతా ఛట్న్ యాన్లింగ్ కేంద్రంలో ఉంటున్నారు. దీనిని లడఖ్ నన్స్ అసోసియేషన్ స్థాపించింది. అయితే ఇక్కడి మహిళలకు తినడానికి తిండి లేదు. ఇంటి పనులు చేసుకుంటూ బతుకును వెళ్లదీస్తున్నారు. ఛట్న్ యాన్లింగ్‌లోని అత్యంత వృద్ధురాలు లొబ్జాంగ్ డొల్మా. ఈమె ఇక్కడికి రాకముందు పొలం పనులకు వెళ్లేది. ఛట్న్ యాన్లింగ్ కేంద్రస్థాపకుల్లో ప్లామో ఒకరు. ఈయన డాక్టరు కూడా.. ఇక్కడి మహిళలకు నిరంతరం వైద్య సహాయం అవసరం ఉండటంతో ఈ డాక్టరు వారికి అందుబాటులో ఉంటాడు. బౌద్ధతత్త్వం, వైద్యం గురించి కూడా ప్లామో చదువుకున్నాడు.
మొదట్లో కేవలం బౌద్ధసన్యాసులు మాత్రమే ఇక్కడికి వచ్చి సంస్కార విధులను నిర్వహించేవారట. కానీ ఇప్పుడు యువ సన్యాసినులను కూడా సంస్థకు ఆహ్వానించి ఆచారక్రియలను జరిపిస్తున్నారు. ఇక్కడున్న సన్యాసినుల్లో అత్యంత పిన్నవయస్కురాలు స్కర్మా చుక్సిట్.. ఆ సన్యాసిని వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు. 2008లో ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు పోషకాహార లోపంతో రికెట్స్ వ్యాధి బారినపడిందట. మత సంబంధ సంస్థల్లో తీవ్రమైన లింగవివక్షను స్కర్మా ఎదుర్కొన్నట్లు అక్కడివారు చెబుతారు. ఆధునిక విద్య ఈమెలాంటి యువ సన్యాసినుల్లో ఆత్మవిశ్వాసం నింపుతుందని, సంప్రదాయ పద్ధతులను ఎదిరించే శక్తినిస్తుందని చెబుతారు ఆ సంస్థవారు. ఛట్న్ యాన్లింగ్‌లోని సన్యాసినుల్లో చాంబ ఒకరు. ఈమె సైక్లింగ్ సాధన చేస్తోంది. ఈ సన్యాసినుల కేంద్రంలో గ్రంథాలయం, కూరగాయల క్షేత్రం కూడా ఉంది. ఇక్కడున్న యువ సన్యాసినులు ఆడుకోడాన్ని, ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని కూడా ప్రోత్సహిస్తుంటారు ఛట్న్ యాన్లింగ్ కేంద్ర స్థాపకులు. మరో సన్యాసిని కున్‌జొమ్.. ఆమె ఏడేళ్లున్నప్పుడే సన్యాసినిగా మారాలని నిర్ణయించుకుందట. అంతరాత్మ పిలుపు మేరకే ఎవరైనా సన్యాసిగా మారాలని అనుకుంటారు. ఎప్పుడైతే ప్రేమ, కరుణలతో ఇతరులకు సేవచేయాలనుకుంటారో వారిని ఆపలేరు అని చెబుతుంది ఆమె.