సబ్ ఫీచర్

చలికాలం-పిల్లలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల్లో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం వల్ల త్వరగా వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వ్యాధుల ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. గజగజా వణికించే ఈ చలికాలంలో పిల్లల్లో వచ్చే వ్యాధులు, ఈ వ్యాధులు రాకుండా తల్లిదండ్రులు ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.
ఊపిరితిత్తుల్లో నెమ్ము
చలికాలంలో జలుబు, దగ్గు.. బాక్టీరియా లేదా వైరస్ వల్ల వ్యాపిస్తాయి. జలుబు, దగ్గు మామూలే కదా అని అశ్రద్ధ చేస్తే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. దీనే్న న్యుమోనియా అంటారు. దీని కారణంగా ఊపిరితిత్తుల్లోకి నెమ్ము చేరి పిల్లలకు ప్రమాదంగా మారుతుంది. ఇలా నెమ్ము చేరకుండా ఉండాలంటే తల్లి, బిడ్డకు ఆరునెలల పాటు పాలు ఇస్తే మంచిది.
ఆస్తమా
అపరిశుభ్రత, కాలుష్యంలోని పుప్పొడి రేణువుల వల్ల, శ్వాసనాళాల్లో అడ్డుపడి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలా ఉండే పరిస్థితినే ఆస్తమా అని అంటారు. ఆస్తమా ఉన్నప్పుడు దగ్గు కూడా ఎక్కువగా ఉంటుంది. మంచు కురుస్తున్నప్పుడు పిల్లలను బయటకు తీసుకెళ్లడం చేయకూడదు. శ్వాసకోశాలు అడ్డుపడటం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
హైపోథరిమియా
చలికాలంలో మంచుకి, చలికి కొందరి శరీరం తట్టుకోలేదు. ఎక్కువగా వణికిపోతుంటారు. ఈ సీజన్‌లో చలి ప్రభావం కారణంగా కొందరి పిల్లల్లో సాధారణం కంటే తక్కువ శరీర ఉష్ణోగ్రత ఉంటుంది. దీనినే వైద్య పరిభాషలో హైపోథరిమియా అంటారు. దీని కారణంగా కాళ్లు, చేతులు పనిచేయకపోయే ప్రమాదం ఉంది.
ఫ్లూ జ్వరాలు
జలుబు, దగ్గు నుండి ఫ్లూ జ్వరాలు వెంటనే రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న పిల్లలను చేరుతాయి. అలాగే ఇంటి వాతావరణం సరిగా లేకపోయినా, కలుషిత నీటిని తాగడం వల్ల, దోమలు ఎక్కువగా ఉండటం కారణంగా వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా వ్యాపిస్తాయి.
స్కిన్ అలర్జీ
చలికి చర్మం పొడిబారడం వల్ల మంట, దురద కలగడంతో పిల్లలు వెంటనే చర్మంపై రుద్దడం, గిల్లడం చేస్తుంటారు. ఇలా ఒకరిని మరొకరు తాకినప్పుడు తామర, చర్మసమస్యలు అధికంగా ఉంటాయి. అయితే ఈ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
జాగ్రత్తలు
* చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలను రాత్రిపూట బయటకు తీసుకురావడం మంచిది కాదు. అలాగే ఉదయం సూర్యుడు వచ్చాకే పిల్లలను బయటకు తీసుకురావాలి. ఇంట్లో ముసలివారు ఉన్నా కూడా ఇలాగే చేయాలి.
* చలికాలంలో ఉన్నిదుస్తులు ధరించడం, తలకు మఫ్లర్, కాళ్ళు, చేతులకు సాక్స్ ధరించడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకు ఉన్ని దుస్తులు వేయడం మర్చిపోకూడదు.
* ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏసీ, ఫాన్లు వేయడం వల్ల మరింత చలి పుడుతుంది కాబట్టి వణికిపోతారు.
* చలికాలంలో చర్మ సంరక్షణ పిల్లలు, పెద్దలు తప్పకుండా చూసుకోవాలి. చర్మం పొడిబారి పక్కులు వచ్చి పెళుసుగా ఊడిపోయి మంట, దురదను కలిగిస్తాయి. అందుకని చర్మాన్ని కాపాడే చలికాలం క్రీములు లేదా నూనెలను రాయాలి.
* పిల్లలకు ప్రతిరోజూ తప్పకుండా ఒక గ్లాసు గోరువెచ్చటి పాలను తాగించాలి. అలాగే చలికాలం కదా అని నిర్లక్ష్యం చేయకుండా ఎక్కువ మంచినీటిని తాగిస్తూ ఉండాలి.
ఇలా చలికాలం ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి వ్యాధులూ రాకుండా పిల్లలను కాపాడుకోవచ్చు.