సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హృదయము ఱంపముతో గోయబడినట్లు బాధగలుగ నేలపైబడి పొరలాడుచు, నాతడు పడు వేదనను గాంచిన జనులు, ‘‘అయ్యో, పాపము! ఈతడేదియో ‘శూలనొప్పి’చే బాధపడుచున్నాడు కాబోలును, లేక నిజముగా మాతృవియోగముచే గుందుచున్నాడు కాబోలును’’అని జాలిపడువారు. ఆతడిక హతాశుడై యొకనాడు జీవితము నంతమొందించుకొన బ్రయత్నించునంతలో అకస్మాత్తుగా సాక్షాత్కారము లభించెను. ‘దేదీప్యమానమగు ననంత చైతన్య సాగరరూపమున’ దైవమును గాంచి యాతడు సమాధి నిమగ్నుడయ్యెను.
* (అపుడు తన యంతరంగమున అనిర్వచనీయానందసాగరము- అంతకుముందు తానెన్నడనుభవించి యెఱుగని దివ్యానందము- ప్రసరించుచుండెనని మాత్రమే తనకెఱుకయనియు, అయినను తన దివ్యజనని భవ్యసాన్నిధ్యము మాత్రము తన హృదయాంతరాళమున భాసించుచునే యుండెననియు తన దివ్యానుభూతినిగూర్చి కాలాంతరముననాతడు శిష్యులకు దెలిపియున్నాడు.)
కాని రుూ భగవదనుభవము శ్రీరామకృష్ణునకు నిరంతర బ్రహ్మానుభూతిని గల్గింపజాలదయ్యె. బ్రహ్మానందామృతము ననొకపరి రుచి చూపినను సంతతానుభవపిపాస నయ్యది తీర్పజాలదయ్యె. నిరంతర బ్రహ్మానుప్రాప్తికై పరితప్త హృదయుడై యాతడు దినములు గడపుచుండెను. సర్వకాల సర్వావస్థలయందును, సమస్త ప్రదేశములందును బ్రహ్మానుభూతి నొందుటకై యాతడు బాష్పధారలు ప్రవహింప వెక్కివెక్కియేడ్చుచు మునుపటికంటెను తీవ్రతర పరితాపముతో తన దివ్యజననిని బ్రార్థింపసాగెను. ఆ హృదయ మథనము నాతనికి బాహ్యలోకమే స్ఫురించెడిది కాదు- ఒకవేళ స్ఫురించినను కేవలము మిథ్యగా దోచెడిది. ఆతని ప్రార్థనలచేతను రోదల చేతను ఆకృష్టులై జనులు చుట్టును మూగిన యెడల వారు కేవలము ఆతనికి నీడలవలెను తెరపై వ్రాయబడిన బొమ్మలవలెను- అంత మిథ్యగా- అంతమాయగా- దోచెడివారు. నిద్రాహారములను మఱచి రేయింబవళ్లాతడు తదేకముగా జగజ్జననిని బ్రార్థింపసాగెను. తుద కాలయమున దేవి నర్చించుటాతని కసాధ్యమైపోయెను. ఆలయ నిర్వహకుడును రాణి రాసమణి యల్లుడునగు మథురనాథుడు శ్రీరామకృష్ణుని స్థితినిగాంచి ప్రేమ గౌరవములతో నాతని పూజావిధులనుండి తొలగించి సాధనకు దిగిన సమస్త సదుపాయములను సమకూర్చెను. ఈ సదవకాశమును గొని శ్రీరామకృష్ణుడు లోకాతీతమగు భగవత్పరితాపముతో, అపూర్వాశ్రయములతో, ధ్యానాది సాధనలందు నిమగ్నుడయ్యెను.
తన యఖండ పరింపమును గూర్చి కాలాంతరమున నాతడు- నీటముంచి యుంపబడినవాడుక్కిరిబిక్కిరియై యెట్లు గిజగిజలాడునో- సాక్షాత్కరమునకై అట్టివేదన ననుభవించితినని శిష్యులకు దెల్పియున్నాడు. లోభికి తాను కూడబెట్టి కొనిన ధనమునందుండు మక్కువ, పవిత్రతకు భర్తయందలి ప్రణయము, తలిదండ్రులకు తమ యేకైక పుత్రునందుండు ననురాగము- ఎట్టిదో- ఊహించిన యెడల తన భగవదనురాగమును భగవత్ పరితాపమును లేశము గ్రహింపవచ్చునని యాతడు శిష్యులకు దెలుపువాడు.
ఇంచుమించుగా ఈ సమయమున నాతడు స్వగ్రామమగు కామారి పుష్కరము నొకసారి చూచుటకై వెడలెను. పెండ్లి చేసినచో, ఆతని భగవదున్మాదమును ప్రపంచ విముఖతయు గొంత లొంగుబాటునకు వచ్చుననియు, ‘‘నలుగురితోబాటు నారాయణా’’యనునట్లు క్రమముగా సంసారధోరణి యలవడుననియు తల్లి చంద్రమణీదేవి తల పోయసాగెను. తదనుసారము సమీప గ్రామమందలి రామచంద్ర ముఖోపాధ్యాయుని కుమార్తెయగు శారదామణీదేవియను నైదేండ్ల బాలికను శ్రీరామకృష్ణునకు ఇచ్చి పెండ్లిచేసిరి. కాని యాతని పిచ్చి మాత్రము కుదరలేదు. అది దివ్యోన్మాదముగదా! అనతికాలముననే 1860-వ సంవత్సరమున తిరిగి దక్షిణేశ్వరము వచ్చినంతనే భగవదున్మాదమున మునిగిపోయెను.
ఇంతవఱకును శ్రీరామకృష్ణుడు తన భక్తిసాధనలను ఏ గురు సాహాయ్యమును లేకయే స్వయముగా సాగించుచుండెనని చెప్పనగును. ఇంతటి నుండియు దై వనిమంత్రితులై గురువులాతని వెదకికొనుచు రాసాగారి. పూవు వికసించినంతనే మధుపము దానిని వెదకికొనుచు రాకుండునా? శ్రీరామకృష్ణుడా గురువరేణ్యుల సాయమును గొని శాస్త్రోక్తముగా వివిధ సాధనల నభ్యసింపసాగెను.
బ్రహ్మానుభవమున నితరసాధకులకును శ్రీరామకృష్ణునకును రెండు విషయములలో విస్పష్టమగు భేదముగాన్పించును. ఏ సాధన నవలంబించినను ఆతడతి శీఘ్రముగా సిద్ధినిబొందుట మొదటి విషయము. ఆతని సత్యానే్వషణమునందలి తీవ్రతయే- ఆతని యనిర్వచనీయ భగవత్పరితాపమే- ఇందులకు కారణమని చెప్పనొప్పును. మానవ కోటి మత చరిత్రలో నింతకుముందు కనివిని యెఱుంగని వివిధ సాధనల నాత డభ్యసించుట రెండవ విషయము. ఆతని జీవితము బ్రహ్మానందానుభవ నందనవనమై, సర్వమత సామరస్య నిలయమై దీపించుటకిదియే హేతువ.*
శ్రీరామకృష్ణుని ప్రథమ గురువు భైరవీ బ్రాహ్మణియను యోగినీమణి. ఈమె విశేష విద్యావంతురాలు, తాంత్రిక సాధనలయం దఖండ విజయమును బడసిన మహనీయురాలు.
*( ‘బ్రహ్మానంద తేజము బహువిధములుగా ప్రకాశితమై శ్రీరామ కృష్ణుని దివ్య జీవితమున సామరస్య దేవాలయమును నిర్మించియున్న’దనియు ‘ఆ దేవళమున కివే నా ప్రణతు’అనియు కవి చంద్రుడు రవీంద్రడు నుడివి యున్నాడు.)
ఇంకావుంది...
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మెహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి