సబ్ ఫీచర్

పిల్లల జ్ఞానమే ఉపాధ్యాయునికి ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడ సాధన ఉండదో అక్కడ బోధన ఉండదు అంటారు. ఎక్కడ విద్యార్థి ఉండడో అక్కడ ఉపాధ్యాయుని అస్తిత్వం కనపడదు అంటారు. బోధించేటప్పుడే ఉపాధ్యాయుడు నేర్చుకుంటాడు. తను చదువుకున్నది వల్లెవేయటం కాదు. విద్యార్థుల్లో ఉండే ఆసక్తే ఉపాధ్యాయుని సాధనకు మూలం. విద్యార్థులు చేసే తప్పులు ఒప్పులను సరిచేసే మార్గమే ఉపాధ్యాయునికి సాధన. అధికారుల భయంతో కాదు, యూనివర్సిటీలలో చదువుకున్న డిగ్రీల వల్లకాదు లేదా బీఎడ్ కాలేజీల్లో నేర్చుకున్న పద్ధతుల వల్ల కాదు. విద్యార్థుల్లో ఉండే ఆసక్తి మేరకు తాను చెప్పబోయే పాఠం కోసం ఉపాధ్యాయుడు అనేక పుస్తకాలు చదువుతాడు. గంటలకొద్దీ అధ్యయనంలో లీనవౌతాడు. విద్యార్థి జ్ఞానతృష్ణను సంతృప్తి పరచటానికై ఎన్నో పద్ధతులు, ఎన్నో మార్గాలను అవలంబిస్తాడు. లేత మనస్సులను సంతృప్తి పరచటం, విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించటం, వివేచనా లక్షణాలను విద్యార్థిలో కల్గించటానికై ఉపాధ్యాయుడు తాపత్రయపడతాడు. అధ్యయనంలో తాను ఏదైనా సాధిస్తేనే పిల్లలకు బోధించగలుగుతాడు. 45 నిమిషాల బోధనకై గంటలకొద్దీ నేర్చుకుంటాడు. అందుకోసమే మా ఆవిడ లక్ష్మీభాయి ఎప్పుడూ- ‘30 ఏళ్లుగా చదువుచెబుతున్నావు కదా.. మళ్లీ ఇపుడు కూడా చదువుకుంటావు.. నువ్వు ఇంత మొద్దువనుకోలేదని వ్యంగ్యంగా అనేది.
తరగతి గది స్వరూపమే, విద్యార్థుల లేత ముఖాలే నాలో బోధనపై ప్యాషన్‌ను కలిగించాయి. దానే్న ఫాల్‌ఫెర్రి సాధన అంటారు. ఉపాధ్యాయుడు నిత్యం చదువుతాడు. విశే్లషణ చేస్తాడు. ప్రతిసారీ కొత్త కోణంతో దాన్ని పరిశీలిస్తాడు. ఇదివరకు కనపడనటువంటి విషయాలను తను శోధిస్తాడు. ఉపాధ్యాయుడు 30 ఏళ్లపాటు చదువు చెప్పినా మళ్ల క్లాసుకు వెళుతుంటే తిరిగి అతను సైతం ఓ విద్యార్థి అవుతాడు. కొత్త విషయాలను తన కాల్పనికశక్తితో నిర్మిస్తాడు. రాబోయే 30 ఏళ్లపాటు తనను పిల్లలే అనుకుంటాడు. విద్యార్థుల సామర్థ్యమే తనను సజీవంగా ఉంచుతుందని ఉపాధ్యాయుడు భావిస్తాడు. బోధన అంటే చెప్పబోయే పాఠాన్ని కంఠస్థం చేయటం కాదు. విద్యార్థి ఆలోచన నుంచి కొత్త జ్ఞానాన్ని జనించే శక్తిని కలిగించాలి.
ఉపాధ్యాయుడి అంకిత స్వభావమే రాబోయే దేశం స్వరూపాన్ని నిర్ణయించగలుగుతుంది. ఈనాడు క్యూబాకు ఇంత ప్రతిష్ట రావటానికి కారణం ఫాల్‌ఫెర్రి ఉద్భోదన కదా! ‘‘క్యూబాలో జరిగే విద్యాసాధనను కాపీ కొట్టకండి. మీరు ఆలోచించే వారిగా తయారుకండి, బోధనకు కావల్సిన కమిట్‌మెంట్‌ను కలిగించండి’’ అని అమెరికాను సంబోధిస్తూ ఫాల్‌ఫెర్రి అన్నాడు.
అక్షరాలను మాత్రమే ప్రేమించకండి. దానివెనుక ఉండే సమాజాన్ని ప్రేమించండి. అప్పుడే తరగతి గదిలో సాధనతో కూడిన బోధన జరుగుతుంది. ‘‘రీడింగ్ ఎ వర్డ్ నాట్ ఇంపార్ట్‌టెంట్. రీడింగ్ ఎ వర్డ్ ఈజ్ ఇంపార్ట్‌టెంట్’ అక్షరానికి సామాజిక చైతన్యమే ప్రధానం. లాటిన్ అమెరికన్ దేశాలు ఫెర్రి ఆలోచనలను అమలు జరుపుకుని తమ దేశాల ముఖచిత్రాలనే మార్చుకున్నాయి.
రాణిస్తున్న విద్యార్థులు..
విద్యావ్యవస్థలో ఇంకా ఎన్ని అవకతవకలున్నా విద్యార్థులలో నేర్చుకోవాలనే తృష్ణ మాత్రం బాగా ఉన్నది కాబట్టే ఇప్పటికీ సాంకేతిక రంగంలో మన పిల్లలు రాణించటమే కాదు ఆదర్శవంతులుగా కూడా నిలుస్తున్నారు. ప్రతి దేశం తన తరగతి గదిని తర్కబద్ధంగా చేసుకుంటున్నది. తర్కానికి మూలం మానవీయ శాస్త్రాలు. విద్యార్థులకు చిన్నప్పటి నుంచి మానవీయమైన పుస్తకాలను కథలను నవలలను సాహితీ పుస్తకాలను ఎంత చదివిస్తే అంతగా సామాజిక పరిజ్ఞానం సహా హేతుబద్ధత వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర దేశాలలో పలు మెడిసిన్, ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులను ఎంపిక చేసేటప్పుడు సాహిత్య పఠనాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక ప్రయోగం జరిగినప్పుడు అకస్మాత్తుగా విద్యార్థి ఆనందంతో ఆవేశంతో ‘ఆహా’ అంటాడు. అలా అన్నప్పుడు ఆ విద్యార్థి మెదడులో జరిగే మార్పే అవగాహనకు మూలం. విద్యార్థికి అవగాహన కాగానే నవ్వుముఖం పెడతాడు. అక్షరాన్ని ధ్వనిలోకి మార్చటం, ధ్వనిని అక్షరంలోకి మార్చటం అనే అవగాహన వచ్చిన నాడు దాన్ని మార్చగలుగుతాడు. ఉపాధ్యాయుని సేంద్రీయ బోధనే నూతన ఆవిష్కరణలకు మూలం అవుతుంది. ఈనాడు సిలబస్ పూర్తిచేయటం ప్రధానం కాదు. అవగాహన ప్రధానం. విద్యార్థికి అవగాహన వివిధ రంగాల నుంచి వస్తుంది. తరగతి గది ఎన్నో కలల సంగమం. సాధనతో వచ్చే ప్రతి అనుభవం తరగతి గది ఖాతాలోనే చేరుతుంది.
పదం నుంచి ప్రపంచం..
ప్రస్తుత 21వ శతాబ్దంలో ఉపాధ్యాయులను, విద్యార్థులను, శాస్తవ్రేత్తలను అమితంగా ప్రభావితం చేసినవాడు పాల్స్‌ఫెర్రి. అతడు బ్రెజిల్ విద్యావేత్త. ప్రపంచాన్ని చదవడానికి అక్షరం ఓ సాధనమని ఆయన అన్నాడు. అభివృద్ధి చెందని దేశాల్లో దారిద్య్రం, హింస, నిరాశ్రయులుగా మారడం వంటి అనేక సమస్యలకు కారణం నిరక్షరాస్యతే అని అంటాడు. పీడిత ప్రజానీకానికి బోధన, ఆశయ సిద్ధికై సాధన అనే గొప్ప పుస్తకాలను ఆయన రాశాడు. ఆ పుస్తకాలు ప్రపంచాన్ని కదలించాయి. లాటిన్ అమెరికాలో జరిగిన ప్రగతికి ఆయన బోధనలే కారణం. ప్రతి సామాజిక కార్యకర్త ఆయన రాసిన పుస్తకాలను చదవాలి. ప్రజాస్వామిక వ్యవస్థకు విద్య అనేది గొప్ప రక్షణ కవచం అని ఆయన చెప్పేవారు. పాలకులు, పాలితులు దీక్షతో ప్రజాస్వామాన్ని రక్షించాలని అంటారు. వీరి మధ్య అంతరాలు ఏర్పడితే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని ఫెర్రి హెచ్చరించారు. అక్షరాలే ఈ ఇద్దరినీ దగ్గరకు చేరుస్తాయంటారు. వయోజన విద్య నుంచి విశ్వవిద్యాలయ విద్య వరకూ మహోద్యమాన్ని నడిపిన ఘనుడు ఆయన. ఆయన సూచించిన విద్యావిధానం ప్రపంచంలోనే ‘ఫెర్రి మెథడ్’గా గుర్తింపు పొందింది. పదం నుంచి ప్రపంచం అనే విషయాన్ని ఆయన బోధనలు గుర్తు చేస్తాయి.

-చుక్కా రామయ్య