సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నలుగురినే ఎందుకు ధ్యానించినట్లు!కొంత కాలమునకు బిమ్మట క్రీస్తును క్రైస్తవాదర్శమును ధ్యానించి తద్గమ్యమును నితర మతముల గమ్యమునొక్కటియేయని గ్రహించెను.
అనంతరము 1872-వ సంవత్సరమున శ్రీరామకృష్ణుడు షోడశీ పూజయను మహాసాధనయందు తన భార్యను సాక్షాత్పరమేశ్వరీ స్వరూపముగా నారాధించెను. అతని దివ్యసాధనల కిదియే పరిసమాప్తియని చెప్పనగును. శ్రీరామకృష్ణుని బాల భార్యయగు శారదామణీదేవి నవవనమ నొందినను ఇంతవఱకు భర్తను రెండుమూడుసారులు మాత్రమే దర్శించి యుండెను. కాకిమూకలగు లోకుల తన భర్త పిచ్చివాడని చెప్పకొనుచుండిన ప్రలాపములను విని యోమె కలవరపడి యాతని సేవించి తమకమున (1872వ సంవత్సరమున) స్వయముగా దక్షిణేశ్వరము వచ్చెను. దివ్యప్రేమమూర్తియగు శ్రీరామకృష్ణుడు సామాన్య సన్న్యాసులవలెగాక, శారదాదేవి నఖండ సానుభూతితో నాదరించి యైహికా ముష్మిక విషయము లన్నిటిలో నామెకు గురుత్వము వహించెను. వినిర్మల హృదయయగు శారదాదేవియు వెంటనే తన మగని యాశయములను గని తన ప్రాణేశ్వరుడు సాక్షాత్పరమేశ్వరుడను భావముతోనాతని సేవింపసాగెను. చంద్ర మండలమునకై నను మచ్చ కలదు కాని యాదివ్యదంపతుల యన్యోన్య ప్రేమమున కామకళంక మణు మాత్రమైనను కానరాదయ్యె. మఱియు మేలిమి బంగారమగు తనజితేంద్రియత్వమును బరీక్షించుకొనుటకేమి, స్ర్తిలనందఱను సాక్షాజ్జగజ్జన నీ స్వరూపిణులనుగా గాంచుటకేమి, తనచెంత శారదా దేవియునికి శ్రీరామకృష్ణునకు దోడ్పడియెను.
షోడశీపూజ శ్రీరామకృష్ణుని దివ్య జీవితమున సాధక భావమునకు శాంతిపాఠము; ఇంతటినుండియు లోకమున కాతడొనర్చిన దివ్యజ్ఞాన దానమునకు- అతని జగద్గురు భావమునకు- గణపతి పూజ. సాధనల నిమిత్త మాతనితీర్పరాని దాహము షోడశీ పూజానంతర ముపశమించెను; తత్త్వము నికర తలామలకముగాగాంచుచు, తన మనశ్శరీరముల మూలమున జగజ్జనని లోకమునకు బ్రకటించు విజ్ఞానమును అఖండాధ్యాత్మిక శక్తిని విస్పష్టముగా నాతడు గుర్తింపసాగెను. ఆత్మమార్గమును లోకమునకు బోధించుటకై యాతడు పరితపింపసాగెను.
శ్రీరామకృష్ణుని జీవితమును బరిశీలించినచో, బాల్యమునుండియు నాతనియందు సద్గురువరేణ్యుని లక్షణములు పొడకట్టును. అనేకుల కీ బాలశుకుని పలుకులు జ్ఞానప్రదీపకములై భాసించెను. సాధనకాలమున ఈ శక్తి వికసింపసాగెను. దక్షిణేశ్వరాలయ నిర్వాహకులగు రాసమణీ మథుర నాథులయెడ అతడెన్నడును సేవక భావమ వహింపలేదు; సరికదా, సామాన్య బ్రహిఃప్రజ్ఞయందు వారి యాప్తుడుగను దివ్యభావములందు రక్షకుడుగను ఇలువేలుపుగను వర్తించెను. అతనికి బోధింపవచ్చిన గురువులాతనికి నేర్పిన దానికంటె విశేషము తామే నేర్చుకొని వెడలిరి. భైరవీ బ్రాహ్మణి యాతని సాంగత్యముచే తన శీలమునందలి లోపములను సవరించుకొని యఖండ వైరాగ్య మలవరచుకొనియెను. తోతాపురియు దనక పూర్వమగు భక్తిరహస్యముల నాతనికడ గ్రహించెను. మఱియు 1870-వ సంవత్సరమున శ్రీరామకృష్ణుడు మథురనాథునితో తీర్థయాత్రకు వెడలినవు డనేకులాతని సంసర్గమున ధన్యులైరి. విశేషము, వివిధ సంప్రదాయములకు జెందిన సాధకులును సన్న్యాసులును వందలకొలది దక్షిణేశ్వరము వచ్చి యాతని దివ్యోపదేనుధారసమును గ్రోలసాగిరి. పండితులాతని వచనామృతము నాస్వాదించి ముగ్ధులై, ముముక్షువులైరి.
ఇంకా ఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి