సబ్ ఫీచర్

చలిని తరిమేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలిని తరిమేయడానికి స్వెటర్, జర్కిన్ వేసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ముఖ్యంగా నేటి తరం అమ్మాయిలైతే కనీసం వీటివైపు కూడా చూడరు. హుడీ, స్కార్ఫ్, టోపీ, షగ్.్ర. ఇలా.. నేటితరం అమ్మాయిలు ట్రెండ్‌కి, ఫ్యాషన్‌కు దగ్గరగా ఉంటూ చలిని తరిమేస్తున్నారు. వీరి అభిరుచులకు తగినట్లుగా మార్కెట్లో కూడా కొత్త కొత్త డిజైన్లు కనికట్టు చేస్తున్నాయి. అయితే సరైన వాటిని ఎంచుకోవడం తెలియాలి.. లేకపోతే ట్రెండీ సంగతి దేవుడెరుగు.. మొరటుగా కనిపిస్తారు. అందుకే కాలేజీకి వెళ్లేవారు ఆధునికతను, ఫ్యాషన్‌ను కలబోసిన డిజైనర్ వేర్‌లను ఎంచుకుని ట్రెండీగా, అందంగా కనిపిస్తున్నారు.
స్కార్ఫ్
చలిని ఆపడంలోనూ, స్టైల్‌గా కనిపించేలా చేయడంలోనూ దీని ప్రత్యేకతే వేరు. స్కార్ఫ్ అనేది ఎవర్‌గ్రీన్ ట్రెండ్.. ఈ స్కార్ఫ్‌లో రకరకాల డిజైన్లు, ప్రింట్లు ఉన్నాయి. సందర్భానుసారంగా వీటిని ఎంచుకుంటే ఆ అందమే వేరు. ముఖ్యంగా కాశ్మీరీ స్కార్ఫ్ అయితే ఇక చెప్పాల్సిన పనేలేదు. బ్లాంకెట్ వ్రాప్ స్కార్ఫ్‌లు కొత్తగా, ట్రెండీగా ఉంటాయి. ఇది కాస్త పెద్దగా ఉండి మల్టీలేయర్స్‌లో స్టైలిష్‌గా కనిపిస్తుంది.
షగ్
నేటి అమ్మాయిలు వాళ్ల ఆహార్యానికి మరింత అందాన్ని అందించే షగ్‌న్రు ఎంచుకుంటున్నారు. షగ్ కూడా స్వెటర్‌లాంటిదే కానీ స్వెటర్ అంత మందంగా, బరువుగా ఉండదు. షగ్ చాలా తేలికగా, పలుచగా ఉండి శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. చలికాలంలో ఇది వేసుకోవడం వల్ల శరీరాన్ని చలి నుంచి కాపాడుకుంటూ ఫ్యాషన్‌గానూ, ట్రెండీగానూ కనిపించవచ్చు. స్వెటర్ నడుము వరకూ ఉంటే షగ్ మాత్రం ఛాతి కింది భాగం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అనేక ఆధునిక హంగులను అద్దుకుని స్లీవ్స్, ఫుల్‌స్లీవ్స్, నో స్లీవ్స్, వేస్ట్ లాంగ్, ఫుల్ లాంగ్ వంటి రకరకాల లెంగ్త్‌లలో, రకరకాల ఫ్యాషన్లలో లభిస్తుంది. పాశ్చాత్య దుస్తులపై వేటికైనా చక్కగా నప్పే షగ్‌ల్ల్రో కాలర్డ్, క్రాప్డ్, టై అప్, బొహీమియన్, ఫ్రింజ్ వంటి ఎన్నో రకాలు ఉన్నాయి. వేసుకునే దుస్తులను, శరీరాకృతి అనుసరించి వీటిని ఎంచుకోవచ్చు. ట్యాంక్ టాప్స్, ఆఫ్ షోల్డర్ షర్ట్‌ల మీదకు కట్ స్లీవ్స్ బాగుంటాయి. రోజువారీ వేసుకోవాలనుకుంటే షిఫాన్, జార్జెట్ రకాలను ఎంచుకోవచ్చు. వీటిల్లో ఫ్లోరల్ డిజైన్స్ అయితే మరింత బాగుంటాయి. ఇవి లాంగ్ స్కర్టుల పైకి బాగుంటాయి. జీన్స్ పాంట్స్‌పైకి స్లీవ్‌లెస్ షగ్స్ నప్పుతాయి. వీటిపైకి ట్యాంక్, స్పగెట్టీ టాప్స్ అదిరిపోతాయి.
మునుపు షగ్ ఉన్నితో మాత్రమే తయారయ్యేది. నేడు క్రోషియా, అపై నెట్టెడ్, కాశ్మీరీ కాటన్, మిక్స్‌డ్ కాటన్, సింథటిక్ కాటన్, షిఫాన్, జార్జెట్ లేస్, డెనిమ్ క్లాత్‌లలో కూడా దొరుకుతోంది. నేటితరం అమ్మాయిలు ఎక్కువగా షిఫాన్, డెనిమ్, జార్జెట్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రంగుల్లో కూడా నేడు చాలా మార్పులు వచ్చాయి. మ్యాచింగ్‌ను తప్పనిసరిగా పాటించే ఫ్యాషన్ గర్ల్స్‌కు రకరకాల రంగులు తప్పనిసరి. మునుపు షగ్‌ల్రు కేవలం నలుపు, తెలుపు రంగుల్లోనే వచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని రంగుల్లోనూ లభిస్తున్నాయి. అమ్మాయి వేసుకున్న దుస్తులకు కాస్త భిన్నంగా అంటే కాంట్రాస్ట్ రంగుల్లో షగ్‌న్రు ఎంచుకుంటే లుక్కు చాలా బాగుంటుంది. సంప్రదాయ దుస్తులు అంటే పంజాబీ డ్రస్సులపైకి పోల్కాడాట్స్, ఫ్లోరల్ పనితరం ఉన్న షగ్స్ చాలా బాగుంటాయి. ఇవి పటియాలా, జోథ్‌పూరీ పాంట్లపైకి కూడా బాగా నప్పుతాయి. షగ్స్ అన్ని శరీరాకృతుల వారికీ నప్పుతాయి. అధిక బరువు ఉన్నవారికి ముదురు రంగులు, శరీరం తీరైన ఆకృతిలో లేనివారు, నడుము భాగం లావుగా ఉన్నవారు, భుజాలు లావుగా ఉన్నవారు పొడవు చేతులుండే షగ్‌న్రు ఎంచుకుంటే బాగుంటుంది.
ఉలెన్ కోటు
మెడ చుట్టూ కప్పి ఉండే క్రూనెక్ ఉలెన్ కోటు ఎంత బాగుంటుందో.. ముఖ్యంగా కాలర్ ఉన్న షర్ట్‌లపై వేసుకుంటే మరింత అందంగా ఉంటుంది. ఈ కోటు స్కర్ట్స్, జీన్స్, ట్రౌజర్స్, లెదర్ పాంట్లపైకి ఎంతో బాగుంటాయి. టర్టిల్ నెక్ కోటు స్లీవ్‌లెస్ టాప్‌పైకి బాగుంటుంది. న్యూట్రల్ రంగుల టాప్‌లపైకి లాంగ్ కోటు బాగుంటుంది. అలాగే దీన్ని జీన్స్ జంపర్‌సూట్‌లకు, టోన్ జీన్స్‌లకు జతగా వేసుకుంటే మరింత బాగుంటుంది.