సబ్ ఫీచర్

ప్రగతి బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ప్రగతికి పట్టుకొమ్మలుగా రహదార్లు వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఎన్డీయే ప్రభుత్వం సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన పనులకు మోక్షం కలిగించే దిశగా పూనుకోవడం హర్షదాయకం. జాతి జీవనాడులుగా రహదారులను మలచుకొన్న అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలు అభివృద్ధిపథంలో నిక్షేపంగా కొనసాగుతున్నాయి. జాతీయ రహదారుల నిర్మాణాన్ని వేగవంతంచేస్తూ రోజుకు కనీసం 41 కిలోమీటర్ల రోడ్లువేయాలన్న కేంద్ర రవాణామంత్రి నితిన్‌గడ్కరీ తాజా లక్ష్యం దేశ ప్రగతికి కొత్త ఊపునివ్వడంలో ఎలాంటి సందేహం కానరాదు. ఈమేరకు 2016-17 బడ్జెట్‌లో లక్ష కోట్ల రూపాయల దాకా నిధులు కేటాయించడం అందుకు నిదర్శనం. నిధుల కేటాయింపుతోనే సరిపెట్టుకొంటే పనులు జరగవు. ఆమేరకు దేశం మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని పనిచేయించి, నాణ్యతాపరమైన పనులను చేయించే తీరుపై అప్రమత్తం చేయించేందుకు నిరంతరం కృషిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 2019నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి సగం తగ్గించే దిశగా ఏటా 2000 కోట్ల ఖర్చుతో ప్రధానమంత్రి సురక్ష రహదారి పథకం, సేతు భారతం ప్రాజెక్టు పేరిట రైల్వేక్రాసింగ్‌లపై రోడ్డువంతెన నిర్మాణంకోసం రూ.20వేల కోట్లకు పైగా నిధులు కేటాయించి సుస్థిర, సురక్షిత రహదారుల వ్యవస్థకు ఎన్డీఏ ప్రభుత్వం పూనుకోవడం హర్షదాయకం.
జాతీయ రహదారుల విస్తరణకోసం తెలంగాణకు రూ.43వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.65వేల కోట్లు కేటాయించనున్నట్లు ఇటీవల కేంద్ర రవాణమంత్రి గడ్కరీ ప్రకటన పట్టాలెక్కితే ఉభయ రాష్ట్రాల ప్రగతిపథంలో పడుతుంది. దేశంలో ఈ ఏడాది ఆరువేల కిలోమీటర్లమేర నేషనల్ హైవేల నిర్మాణం కొనసాగేందుకు కేంద్రం అన్నిరకాల చర్యల్ని చేపట్టింది. ప్రమాదకరంగా మారిన రోడ్డు ప్రమాదాలు, వాయు, ధ్వని కాలుష్యాలను నివారించి, వాహనచోదకులకు ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెరుగుతున్న జనాభా, రవాణా అవసరాలు దృష్ట్యా రోడ్లు విస్తరణ, రైల్వేక్రాస్‌లలో తప్పనిసరి రైల్వేరోడ్డు వంతెనలు నిర్మాణం, రహదారులను కారిడార్ల రూపంలో మలచుకొని ఒడ్డుపైన వాణిజ్య వ్యూహానికి విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు కేంద్రం ఆమోదం తెలపడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల పురోగతికి కలసి వచ్చే అంశమే.
రహదారుల వ్యవస్థ ఒక్కసారితో తీరిపోయే సమస్యకాదు. ఏటా రోడ్ల విస్తరణ, వాటి బాగోగుల్ని చూడాల్సిన ఆవశ్యకతను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోని రాష్ట్రాలన్నింటినీ అనుసంధానిస్తూ 1956లో ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఐసన్ హోవర్ ప్రారంభించిన రహదారి ప్రాజెక్టు అగ్రరాజ్యం రూపురేఖల్నే మార్చేసి ప్రగతిపథంవైపు దూసుకెళ్ళింది. అభివృద్ధిపథంలో నడుస్తున్న ఏ దేశమైనా మన్నికైన రహదారులు కీలక వౌలిక వనరులుగా, వృద్ధిరేట్లను పరుగులు పెట్టించిన వైనం కళ్ళకు కడుతోంది. ఆనాటి దేశ ప్రధాని వాజ్‌పేయి దేశంలోని నాలుగు ప్రధాన నగరాలను నాలుగు, ఆరుమార్గాల రోడ్లుతో కలుపుతూ ‘స్వర్ణచతుర్జుజి...’ పథకానికి ఆ తర్వాత ఏలుబడిలోకి వచ్చిన యుపీఏ ప్రభుత్వం నీరుగార్చింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రహదారి వ్యవస్థగల భారత్‌లో అభివృద్ధి లక్ష్యాలకు దీటుగా రాచబాటల నిర్వహణ, నిర్మాణంలో యుపీఏ ప్రభుత్వ నిర్వాకం ఘోరంగా విఫలమైంది. లక్ష్యాలమేరకు హైవేల నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళలేక, రోడ్డు ప్రాజెక్టుల్లో అనివార్యంగా ఎదురయ్యే ప్రతిబంధకాల్ని పరిష్కరించలేక వేల కిలోమీటర్ల మేర ఎక్కడి పనులను అక్కడ వదిలేసి చేతులెత్తేసింది. ఏ ప్రభుత్వాలైనా నిక్కచ్చిగా నిర్మాణాలు చేయగలిగే వారికి ప్రథమస్థానం కల్పించి నాణ్యతపై ప్రభుత్వపరమైన పర్యవేక్షణతో ముందుకు సాగితే ప్రభుత్వాలు పదికాలాలపాటు కొనసాగే వీలుండడమే కాకుండా ప్రజల మన్ననలు పొందుతారు.

- దాసరి కృష్ణారెడ్డి