సబ్ ఫీచర్

ఉరితాడును ముద్దాడిన యోధుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నా మాతృభూమిని ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేయాలనుకున్నా... నా త్యాగం మరెందరికో స్ఫూర్తినిస్తుంది. హిందూస్థాన్ స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది. భారత్‌లోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడిగా గర్వపడుతున్నా..’’ -అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడును ముద్డాడి మెడలో తానే వేసుకున్నాడు. బ్రిటీష్ పాలనలో దాదాపు 200 ఏళ్లు అణగారిన మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు కొంతమంది నేతలు ముందుకు వచ్చి 1857లో ‘‘ది ఇండియన్ రెబిలియన్ గ్రూప్’’ పేరుతో పోరాటాన్ని ప్రారంభించారు. ఈ సమరయోధుల్లో ఇరవై ఏడేళ్ల పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ అష్ఫాఖుల్లా ఖాన్ చిరస్మరణీయుడుగా నిలిచిపోయాడు. స్వాతంత్య్ర పోరాటం చేసిన సర్దార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల కంటే నాలుగు సంవత్సరాల ముందే భరతమాత ఒడిలో అష్ఫాఖుల్లా ఖాన్ ఒదిగిపోయాడు.
అష్ఫాఖుల్లా ఖాన్ ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో అక్టోబర్ 22, 1900న జన్మించాడు. తండ్రి షఫీకుర్ రెహమాన్ పొలీసు శాఖలో పనిచేసేవాడు. తల్లి మజ్హరున్నీసా. ఈ దంపతుల ఆరుగురు సంతానంలో అష్ఫాకుల్లా చివరివాడు. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపు నిచ్చినపుడు అష్ఫాఖుల్లా పాఠశాల విద్యార్థి. సహాయ నిరాకరణ ఉద్యమం అతనిపై గొప్ప ప్రభావాన్ని చూపి, సమరయోధుడుగా మారడానికి కారణమైంది. మహాత్మాగాంధీ చౌరీచౌరా ఉదంతం తర్వాత సహాయ నిరాకరణోద్యమం నిలిపివేయడంతో నిరాశకు గురైన వేలాది మంది యువకులలో అష్ఫాఖ్ ఒకడు. దేశాన్ని త్వరగా పరాయి పాలన నుంచి విముక్తం చేయాలన్న తపనతో అతివాద ఉద్యమకారులతో చేరాడు. ఈ సమయంలోనే ప్రముఖ ఉద్యమకారుడు రాంప్రసాద్ బిస్మిల్‌తో పరిచయమేర్పడింది. ఆర్యసమాజ్ సభ్యుడైన రాంప్రసాద్ బిస్మిల్‌తో ముస్లిం మతస్థుడైన అష్ఫాఖుల్లా ఖాన్ స్నేహం కొంత విభిన్నమైనదే. అయినా వారిద్దరి సమష్టి లక్ష్యం ఒకటే- భారత స్వాతంత్య్ర సముపార్జన. తమ సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాలు, మం దుగుండు సామగ్రి కొనుగోలు చేయడానికి ఉద్యమకారులు 1925, ఆగష్టు 8న షాజ హాన్‌పూర్‌లో ఒక సభను నిర్వహించారు. కాకోరి రైలు దోపిడీ , కాకోరి కుట్ర అనేది బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో ఆగష్టు 9న జరిగింది. లక్నో సమీపంలోని కాకోరిలో రైలు దోపిడీ.కి హిం దూస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌ఏ) వ్యూహరచన చేసింది. ఆగష్టు 9న అష్ఫాఖుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్, సచీంద్ర బక్షీ, చంద్రశేఖర్ ఆజాద్, కేశవ్ చక్రవర్తి, బన్వారీ లాల్, ముకుంది లాల్, మన్మధనాథ్ గుప్తలు కలిసి కాకోరీ గ్రామం సమీపంలో ప్రభుత్వ ధనాన్ని తీసుకెళుతున్న రైలుని దోచుకున్నారు. అహ్మద్ అలీ అనే రైలు ప్రయాణీకుడు యాదృచ్ఛికంగా మరణించడంతో ఈ ఘటన కేసుగా మారింది. ఈ సంఘటన తర్వాత అనేక మంది విప్లవకారుల్ని ప్రభుత్వం అరెస్టు చేసింది.
1925 సెప్టెంబరు 26న పొలీసులు రాంప్రసాద్ బిస్మిల్‌ను పట్టుకున్నారు. అష్ఫాఖ్ మాత్రం పోలీసులకు దొరకలేదు. అజ్ఞాతంలో బిహార్ నుంచి బనారస్‌కు వెళ్లి అక్కడ 10 నెలలపాటు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేశాడు. అజ్ఞాతంలో మరెంతో కాలం ఉండలేక విదేశాలకి వెళ్లి ఇంజనీరింగ్ చదవాలని నిశ్చయిం చుకున్నాడు. దేశాన్ని వదిలి వెళ్ళే మార్గాలు అనే్వషిస్తూ ఢిల్లీ చేరాడు. అక్కడ ఒక పఠాన్ స్నేహితుణ్ణి ఆశ్రయించాడు. అదే స్నేహితుడు అష్ఫాఖ్‌కు వెన్నుపోటు పొడిచి పోలీసులకి ఆయన జాడ తెలియచెప్పాడు. అష్ఫాఖ్‌ను ఫైజాబాద్ జైల్లో బంధించి కేసు నమోదు చేశారు. ఇతని పెద్దన్న రియాసతుల్లా ఖాన్ చివరి వరకూ అష్ఫాఖ్ తరఫున న్యాయవాదిగా వాదించాడు. అష్ఫాఖ్ జైల్లో ఉండగా ఈయన ఖురాన్ పఠనం చేసేవాడు. కాకోరీ దోపిడీ కేసులో రాంప్రసాద్ బిస్మిల్, అస్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి రోషన్ లకు మరణశిక్ష వేశారు. మిగిలిన వారికి జీవిత ఖైదు విధించడంతో ఆ కేసు ముగిసింది. అష్ఫాఖ్, బిస్మిల్ ఇద్దరూ ఒకే రోజు వేర్వేరు జైళ్లలో ఫ్రాణాలు అర్పించారు. అష్ఫాఖుల్లాను 1927 డిసెంబర్ 19 న ఉరితీశారు. ఉరితీతకు ముందు తన చివరి మాటలుగా - ‘‘నా దేశ సోదరులారా! మీరు మొదట భారతీయులు. మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐకమత్యంతో ఆంగ్లేయులను ఎదిరించండి. దేశ విముక్తే మన లక్ష్యం కావాలి’’ అన్నాడు.
షాజహాన్‌పూర్‌లోని ఆయన సమాధి ఒక స్మారక స్థలమైనది. కొందరు చరిత్రకారులు అష్ఫాకుల్లా ఖాన్ రాజద్రోహ నేరంపై ఉరితీయబడిన తొలి ముస్లిం అని భావిస్తారు. ఆయన నేటి యువతరానికి ఆదర్శనీయుడు. మాతృభూమికి సేవ చేయడానికి ఏకైక మార్గం అంకితభావం, నమ్మకం అని చెప్పేవాడు. మరణం వరకు అష్ఫాఖుల్లా ఖాన్, అతని తోటి సహచరులు చూపించిన స్వీయనమ్మకం, ఆత్మవిశ్వాసం మాతృభూమికి స్వాతంత్రం సాధించాలనే లక్ష్యం మీదున్న నిబద్ధతని చూపిస్తుంది. మాతృభూమి పట్ల స్పష్టమైన ఆలోచనా ధోరణి, ధైర్యం, నిశ్చయత, విశ్వసనీయత, ప్రేమ అష్ఫాక్ పిడికిలిలో ఉండేవి. స్వాతంత్య్ర సంబరాలని చూడకుండానే అసువులు బాసిన అష్ఫాఖుల్లా ఖాన్‌ని ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాలి.
(నేడు అష్ఫాఖుల్లా ఖాన్ వర్ధంతి)
*

నా మాతృధేశమా... సదా నీకు సేవ చేస్తూనే ఉంటా.. ఉరిశిక్ష పడినా, జన్మఖైదు విధించినా, బేడీల దరువుతో
నీ నామస్మరణ చేస్తూనే ఉంటా...
*

-దామరాజు నాగలక్ష్మి 99129 40182 nagalakshmidamaraju@gmail.com