సబ్ ఫీచర్

ఆత్మరక్షణకు యాప్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి సమాజంలో మహిళలకు రక్షణ చాలా అవసరం. ఆలస్యంగా ఇంటికి చేరుకునే క్రమంలో కొన్ని యాప్‌లు మహిళలు అండగా నిలుస్తున్నాయి. మహిళల రక్షణకోసం సాంకేతికంగా చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా చాలా యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల మన రక్షణ మన చేతుల్లోనే ఉంటుంది. ప్రమాద సమయంలో వీటిని ఉపయోగించినట్లయితే తక్షణ సహాయం అందుతుంది. అలాంటి యాప్‌లలో కొన్ని మీకోసం..
లైఫ్ 360 ఫ్యామిలీ లొకేటర్
దూరప్రాంతాలకు ఒంటరిగా వెళుతున్నప్పుడు, ఆలస్యంగా ఇంటికి చేరుకునే క్రమంలో ఈ యాప్ ఆడవారికి చాలా అండంగా ఉంటుంది. దీన్ని మనం ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ముందుగా మనకు బాగా దగ్గరి వాళ్లవి, ఆరుగురి నెంబర్లను పొందుపరచాలి. ఒంటరిగా ఉన్నప్పుడు, క్యాబ్‌లో తిరుగుతున్నప్పుడు, దారి తప్పిపోయినప్పుడు ఈ యాప్‌ను ఓపెన్ చేస్తే సేవ్ చేసిన నెంబర్లకు మనం ఎక్కడున్నామనేది తెలుస్తుంది. దాంతో అందరికీ మన గురించిన సమాచారం అందుతుంది. అలా అవతలివాళ్లు అప్రమత్తమై మనం ఉన్న చోటికి చేరుకోగలుగుతారు.
వాచ్ ఓవర్ మీ
ఆ యాప్ మన ఫోన్‌లోనే కాదు.. ఇది కుటుంబ సభ్యులు, స్నేహితులకూ ఉంటే వారికి తక్షణ సమాచారం అందించడం తేలికవుతుంది. ఈ యాప్‌తో పాటు వారి నంబర్లను కూడా ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. దీనిద్వారా జీపీఎస్ లొకేషన్‌ను పంపుకోవచ్చు. ఒకవేళ అది కుదరకపోయినా ఎమర్జెన్సీ బటన్ నొక్కినా చాలు.. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వెంటనే అలర్ట్ వెళుతుంది. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో మహిళలు ఫోన్ తీసి ఆపరేట్ కూడా చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు ఈ యాప్ ఆన్‌లో ఉంచితే.. ఫోన్‌ని అటూ ఇటూ ఊపినా ఫోన్‌లోని కెమరా ఆన్ అవుతుంది. లేక ఫోన్ పవర్ బటన్‌ను నాలుగుసార్లు నొక్కగలిగినా చాలు వెంటనే కెమరా ఆన్ అవుతుంది. అంతేకాదు అక్కడి పరిస్థితులన్నింటినీ వీడియో రికార్డ్ అయి యాప్ కాంటాక్ట్‌లో ఉన్నవారికి క్షణాల్లో చేరిపోతుంది. ఫలితంగా వారు వెంటనే స్పందించి మీ రక్షణకై చర్యలు తీసుకుంటారు. ఈ యాప్ ఇంటర్నెట్ అవసరం లేకుండానే పనిచేస్తుంది.
చిల్లా..
చిల్లా అంటే అరుపు.. ఈ యాప్ కూడా మహిళల ఆత్మరక్షణకు సంబంధించినదే.. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అన్ని యాప్‌లలో వలె దీనిలో కూడా కుటుంబ సభ్యుల, స్నేహితుల నెంబర్లను సేవ్ చేసుకోవాలి. ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్‌లోని బటన్‌ను అయిదుసార్లు నొక్కితే చాలు ఈ యాప్ పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రమాద సమయంలో మీరు అరిచే అరుపు మీ ఫోన్ నుంచి అత్యవసర నెంబర్లకు అలారంలా.. మీరున్న ప్రాంతం వివరాలను పంపిస్తుంది. దీంతో మీరేదో ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరుతుంది. ఒకవేళ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా మీ ఆప్తులకు అలారం రూపంలో సమాచారాన్ని చేరవేస్తుంది. అంతేకాదు.. మీరు ఉన్న ప్రాంతం వివరాలను ఎస్సెమ్మెస్ లేదా ఈమెయిల్ ద్వారా మీరు ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం అందజేస్తుంది.