సబ్ ఫీచర్

ఆశయాల ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నపిల్లల సంచుల్లో పుస్తకాలను నింపడం కన్నా వారి మనసుల్లో జీవిత ఆశయాలు నింపాలి. ‘నేను నిరర్థకుణ్ణి.. నేను బలహీనుణ్ణి.. నేను పెద్దవాళ్లు ఆడుకునే కీలుబొమ్మను..’ అనే ఆలోచనలు వారి మెదళ్లలోకి రాకూడదు. ‘నాకు ఒక అస్తిత్వం ఉంది.. నాకొక వ్యక్తిత్వం ఉంది.. నాకూ లక్ష్యాలున్నాయి..’ అనే ఆలోచనలు వారిలో బలంగా ఉంటాయి. పిల్లల్లో వ్యక్తిత్వాన్ని పెంచాలి. ‘నేనీ పనిచేయగలుగుతాన’నే ఆత్మవిశ్వాసం వారి హృదయం నిండిపోవాలి. అట్లని ఆ పిల్లల్లో అహం పెంచటం కాదు. తనమీద తనకు విశ్వాసం పెంచటం చేయాలి. చిన్నప్పటినుంచి పిల్లల్లో ఏర్పడే వ్యక్తిత్వాన్ని చెదరగొట్టకూడదు.
మనం చాలాకాలం పరాయి ప్రభుత్వాల ఆధీనంలో ఉండటం వలన మనకు విధేయతే నేర్పుతారు కానీ ఆత్మవిశ్వాసాన్ని నేర్పటం ఉండకపోయేది. మన పిల్లలకూ అమెరికన్ పిల్లలకూ తేడా ఉంది. చిన్నప్పటినుంచి తను ఏమి కాదల్చుకున్నారో, తమ ఆశయాలు ఏమిటో వారు బాల్యంలోనే ఏర్పరచుకుంటారు. తల్లిదండ్రులు వారి దినచర్యల కార్యక్రమంలో దీన్ని నిర్మిస్తారు. మ్యూజియంలు, పుస్తకాల బొమ్మలు చూపిస్తారు. తమ దేశ సంస్కృతిని చూపిస్తారు. వీటిద్వారా తాము చెప్పకుండానే పిల్లల్లో ఆశయ నిర్మాణం జరుగుతుంది. ఆ ఆశయ నిర్మాణం ఒక స్థాయిలో వచ్చేదికాదు. ఒక్కొక్క ఇటుకతో గోడలు నిర్మించటం లాంటిది. ఒక్కొక్క ఘటనతో ఒక ఆశయం నిర్మించబడుతుంది. 25 ఏళ్లు వచ్చిన తర్వాత ‘ఎందుకు నువ్వు చదువుకుపోతున్నావం’టే వాళ్లు చెప్పలేని స్థితిలో ఉంటే? ఒకవేళ చెప్పినా సంకుచితమైన ఆశయం చెబితే? మన పిల్లల నేపథ్యం ఏమిటో అర్థం అవుతుంది.
ఆశయాల నిర్మాణంలో కుటుంబం, ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దాలి. పుస్తకాల భారం శరీరంపైన పడుతుంది. ఆశయాల ముద్ర మాత్రం మెదడుపై పడుతుంది.
స్కూలు నియమావళి..
తరగతిని ఆరంభం చేసేటప్పుడు ఈ ఏడాది తరగతిని ఎట్లా మెరుగుపరుచుకుందాం? అని పిల్లలను అడిగాను. కొద్దిసేపు అందరూ వౌనంగానే ఉన్నారు. చివరకు ఒక విద్యార్థి లేచి- మీరు అమలు పరుస్తానంటే చెబుతానని అన్నాడు. అందరం నీ సూచనను ఏకీభవిస్తే ఈరోజు నుంచే అమలు పరుస్తానని చెప్పాను.
‘మీరు పరీక్ష పేపర్లు తిరిగి ఇస్తుంటే మా పేరు చదువుతున్నారు. మార్కులు కూడా చదువుతున్నారు కదా! నా మార్కులు ఇతరులకు ఎందుకు అవసరం సార్?’ అన్నాడు ఆ విద్యార్థి. ‘అది నా వ్యక్తిగతమైంది కదా. దాన్ని మీరు బహిరంగ పరచకూడదు’ అన్నాడు.
అందరూ నవ్వారు. ‘మేమందరం ఇదే కోరుతున్నాం సార్..’ అని తరగతి గది అంతా అన్నది. ఇక నుంచి మీ మార్కులు బహిర్గతం చేయనని పిల్లలకు చెప్పాను.
ప్రతిరోజూ ఒకే సీటులో ఎందుకు కూర్చోవాలి సార్? మా ఇష్టం వచ్చిన దగ్గర కూర్చుంటాం. అందరితో కలిసి కూర్చుంటే అందరూ దగ్గరి స్నేహితులవుతాం కదా సార్.. అని ఒక విద్యార్థి అన్నాడు. దాంతో పిల్లలందరూ చప్పట్లుకొట్టారు. నేను సైతం మంచిదని అన్నాను.
మీరు చేసిన తప్పులు చెబుతున్నాను కానీ, మీరు ఏమిచేస్తే తరగతి గది మరింత మెరుగుగా ఉంటుందో చెప్పండి అన్నాను.
ఒక విద్యార్థి తన అనుమానం వ్యక్తం చేస్తుంటే మొత్తం తరగతిని వినడానికి నిర్ణయం తీసుకుందాం సార్. ఆ అభిప్రాయం చెబుతుంటే దాన్ని ఎవరు అడ్డుకోకూడదు. విద్యార్థి అడిగిన ప్రశ్నకు తిరిగి టీచర్ సమాధానం చెప్పేవరకు కొత్త ప్రశ్నలు వేయకూడదు- అని వారు అన్నారు.
అంటే తరగతి గది క్రమశిక్షణ ఒకనాటితో ఏర్పడలేదు. ప్రతి సంవత్సరం కొన్ని నిర్ణయాలు వస్తాయి. ప్రతి విద్యార్థి దానిలో పాత్రధారియే. స్కూలు నియమావళిని విద్యార్థులే నిర్ణయిస్తారు. అదే ఆచరణ యోగ్యం.
హోం వర్క్...
బోధనకు, సాధనకు మధ్యనున్న వారధి హోం వర్క్. తరగతి గదిలో ఏర్పడిన భావాలు హోం వర్క్‌లో మొలకెత్తుతాయి. ఇది అర్థం చేసుకోక తల్లిదండ్రులు జోక్యం చేసుకోవటం, వారే హోం వర్క్ చేయడం కొన్నిసార్లు జరుగుతుంది. తమ కొడుకు బాధలు పడుతున్నాడని బాధపడటమో జరుగుతుంది. ఉపాధ్యాయుడికి తను వేసిన విత్తనాలను ఎలా అంకురింపజేయాలో తెలుసు. విద్యార్థి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అదే నిజమైన లెర్నింగ్ (సాధన). అందరికీ సమానమైన సమస్యలు రావు. ఒకే రకమైన పరిస్థితికి ఉండదు. అది వారి జ్ఞాన స్థోమతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టే ఇతర దేశాలలో హోం వర్క్ గ్రేడింగ్‌కు మూలం. కొందరు విద్యార్థులు ఉపాధ్యాయుల ఊహలకు కూడా మించిపోతారు. కొందరు కుస్తీపడుతూనే ఉంటారు. ఈ తారతమ్యాన్ని తరగతి గదిలో బోధనతో ఉపాధ్యాయులు సరిచేసుకుంటారు. విద్యార్థులు చేసిన శ్రమే ఆ పాఠానికి నేపథ్యం. ‘‘అందుకే లెర్నింగ్ అండ్ టీచింగ్ ఆర్ కాంప్లిమెంటరీ ఈచ్ అదర్.’’ ఆ లెర్నింగ్‌ను హోం వర్క్ సుస్థిరపరస్తుంది. పిల్లలనే హోం వర్క్ చేయనీయండి.

-చుక్కా రామయ్య