సబ్ ఫీచర్

‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’ .. దేశ ప్రజల ఆకాంక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజనాభము, ఆర్యావర్తనము, ధర్మభూమి, కర్మభూమి అనబడే విశిష్ఠ పదాలతో పిలువబడే భరతవర్షము, భరత ఖండము, భారతదేశము అనబడే మన దేశము తొలి మనువుచే పరిపాలించబడిన భూభాగమే పుణ్యభూమి హిందుస్థానము. ఈ హిందుస్థానములోనే మానవ సృష్టి ప్రారంభమైనదని వేద శాస్త్ర పురాణ ప్రమాణములచే పరిశోధనాత్మకమైన కృషి సల్పిన మేధావులు నిరూపించినారు. కాబట్టి తొలి మానవుడు భారతదేశములోనే ఆవిష్కరించబడినాడని వేదం చెప్పిన చరిత్ర ఆధారంగా మానవులు మరెక్కడి నుండో రాలేదన్నది వాస్తవం.
బతుకుదెరువుకోసం వ్యాపారం నెపంతో భారతదేశానికి వచ్చిన బ్రిటన్‌వారు ఆనాటికే మన దేశాన్ని ఆక్రమించిన ఇస్లాం జిహాదీల వల్ల అతలాకుతలం అయిన ఇక్కడి పరిస్థితులను గమనించి వారి ఆధిపత్యాన్ని కూడా సాగించాలని కుట్రలు, కుతంత్రాలతో మొత్తానికి ఈ దేశాన్ని వారి ఆధీనంలోనికి తెచ్చుకున్నారు. భారతీయ ఇతిహాసాలను వక్రీకరించి, మన విద్యా విధానాన్ని సమూలంగా నిర్మూలించి టి.బి.మెకాలే విద్యావిధానాన్ని అమలుపరిచారు. వక్రీకరించిన భారతీయ ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చి భారతీయులను మతిభ్రష్టులను చేశారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, మూఢ నమ్మకాలుగా భ్రమింపజేసి, బ్రిటన్ సంస్కృతియే మానవాళిని సంస్కరించినట్లు ప్రచారం చేశారు. బ్రిటీష్ పాలకులు రాకకు ముందు భారతదేశంలో ప్రజలు ఎక్కడి నుండో వచ్చినారని, మనకు సంస్కారం లేదని, తమ ద్వారానే నాగరికత అలవడిందని, భారతీయులకు జాతి అనేది లేదని మోసపూరిత చరిత్రను సృష్టించారు. భారత సంస్కృతి, సాంప్రదాయాల మీద భారతీయులకే అపనమ్మకం కలిగించినారు. బ్రిటన్ వారు అందించిన సంస్కార హీనమైన, జాతి ద్రోహమైన విద్యావిధానాన్ని, విదేశీ భావజాలాన్ని మన కమ్యూనిస్టులు పుణికి పుచ్చుకొన్నారు. స్వార్థపూరితమైన సెక్యులరిస్టులు కొందరు బ్రిటన్ విధానాలను అవలంబించారు. ఆత్మలేని ఆధ్యాత్మికతను భారత ప్రజలపై రుద్దడం చేత విదేశీయుల పరిపాలనతో, సిద్ధాంతాలతోనే కాకుండా మతిభ్రష్టులైన భారతీయ మేధావులు, సంఘ సంస్కర్తల పేరుతో భారతీయతను సర్వనాశనం చేశారు.
1857లో ప్రారంభమైన స్వాతంత్య్ర పోరాటం గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి 1915లో భారత్‌కు రావడంతో ఊపందుకుంది. బాలగంగాధర్ తిలక్ మరణానంతరం స్వాతంత్య్ర పోరాటాన్ని గాంధీజీ తన భుజస్కంధాలపై వేసుకున్నాక దాని రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న యువకులను నిర్వీర్యం చేయడం ప్రారంభమైనది. అందులో భాగంగానే చంద్రశేఖర్ ఆజాద్ తనకు తాను బలిదానం కావలసి వచ్చింది. భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజగురు ఉరికంబం ఎక్కవలసి వచ్చింది. 1943లోనే దేశానికి స్వాతంత్య్రాన్ని స్వయం ప్రకటితం చేసి కరెన్సీ, సైన్యం, రేడియో స్థాపన విదేశాలలో స్వతంత్య్ర భారతాన్ని గుర్తింపచేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్థంతిని గుర్తించలేని స్థితికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారు తమది ఘనమైన పార్టీ అని చెప్పుకుంటారు.
71 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దాదాపు 50 సంవత్సరాల పైబడి పాలించిన కాంగ్రెస్ అధినేతలు కేవలం నాలుగున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ ప్రధాన నరేంద్ర మోదీ చేపట్టిన పథకాలను చూసి విద్వేషం వెళ్లగక్కుతున్నారు. 126 పథకాల ద్వారా సామాన్య ప్రజలకు గతంలో ఎన్నడూ అందని ఫలాలను నేడు మోదీ ప్రభుత్వం అందిస్తోంది. దేశాన్ని దోచుకొని జైళ్ళలో మగ్గుతున్నవారు, బెయిల్‌పై ఉన్న బడా నాయకులు, బ్యాంకుల నుండి వందల కోట్ల రూపాయలు రుణాలు పొంది విదేశాలకు పారిపోయినవారు మోదీని శత్రువుగా చూస్తున్నారు. వేల కోట్ల రూపాయల రుణాలను దిగమింగి విదేశాలకు పారిపోయిన ఘరానా మోసగాళ్ల ఆస్తులను మోదీ సర్కారు జప్తు చేయిస్తున్నది. ఆ వంచకులను తిరిగి దేశానికి రప్పిస్తున్నది భాజపా ప్రభుత్వం.
రక్షణరంగ కొనుగోళ్ళలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోట్ల రూపాయల లబ్ది చేకూర్చిన క్రిష్టియన్ మైకేల్‌ను దేశానికి రప్పించి దర్యాప్తు జరుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థతను దేశ ప్రజలు గుర్తిస్తున్నారు. విమానాల కొనుగోలు ఒప్పందంలో కమీషన్ అందని కారణంగా రక్షణ విభాగాన్ని నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల పరిపాలనలో అనేక మంది సైనికులను దేశం కోల్పోవలసి వచ్చింది. విమానాల ఒప్పందం ప్రారంభించి సగంలోనే వదిలిపెట్టిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఫ్రాన్స్, భారత ప్రభుత్వాలు మధ్యవర్తిత్వం లేకుండా జరిపిన ఒప్పందానికి ఆధారాలు చూపకుండా అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ నేడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
న్యాయస్థానాల తీర్పులను గౌరవించని కాంగ్రెస్ పార్టీకి అవినీతి బాగోతాలు వెన్నతో పెట్టిన విద్య అనేది దేశ ప్రజలందరికి తెలిసినదే! అలనాడు తన ఎన్నిక చెల్లదని అలహాబాద్ కోర్టు తీర్పును చెత్తబుట్టలో వేసి ఎమర్జెన్సీని ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది ఇందిరాగాంధీ. ‘‘తీన్ తలాక్’’కు గురైన ‘‘షహబానో’’ సుప్రీం కోర్టు మెట్లెక్కగా ఆమెకు అనుకూలంగా వచ్చిన న్యాయస్థానం తీర్పును తుంగలో తొక్కి పార్లమెంటులో ‘తీన్ తలాక్’కు అనుకూలంగా రాజీవ్‌గాంధీ చట్టం తెచ్చినాడు. రాఫెల్ ఒప్పందం విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నేడు కాంగ్రెస్ వారు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాల తీర్పులను ఏనాడూ అంగీకరించలేదు, గౌరవించలేదు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం యువకులకు ఉపాధి కల్పించలేదు, రైతులకు న్యాయం చేయలేదు.. తమ ప్రభుత్వమే ఈ వర్గాలకు న్యాయం చేయగలదని రోజూ వాపోయే రాహుల్ గాంధీ, కేవలం 40 స్థానాలు గల మిజోరాంలో 10 సంవత్సరాలు పాలించి ఇటీవలి ఎన్నికల్లో 5 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. 125 కోట్ల మంది ప్రజలను పాలించే స్థాయి రాహుల్ గాంధీకి ఉన్నదా? అనేది దేశ ప్రజల ప్రశ్న. నిరంతరంగా పది సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ 2014 లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్ష హోదా కూడా సాధించలేదన్న దానికి కారణం వారి అసమర్థ, అవినీతిమయమైన పాలనే.
పరిపాలనకు పనికిరాదని ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ నేడు- అవినీతిలో కూరుకుపోయి, సిద్ధాంతాల ఉనికిని కోల్పోయిన మిగతా పార్టీల మద్దతు కూడగట్టి గద్దెనెక్కాలని ప్రయత్నం చేస్తున్నది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిజెపియేతర కూటమిని కాంగ్రెస్‌తో కలసి ఏర్పాటు చేయాలని తాపత్రయ పడుతున్నారు. తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిజెపి, కాంగ్రెసేతర కూటమి అంటూ అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు సాధించాలని వ్యూహరచన చేస్తున్నారు. సిద్ధాంతాలు లేని ఇలంటా కూటములకు అధికారం అప్పగిస్తే- దేశరక్షణ బలహీనపడుతుంది. ఆర్థిక నేరాలు ఆకాశాన్నంటుతాయి. కులాల పరంగా, మతాల పరంగా, భాషల పరంగా దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసేందుకు కొందరు ప్రయత్నించే ప్రమాదం ఉంది. విద్యాలయాలు, వైద్యాలయాలు, వ్యాపార కేంద్రాలు ఆయా రాజకీయ పార్టీల అధినాయకులు హస్తగతం చేసుకొంటారు. సంక్షేమ పథకాల పేరుతో ఓటర్లను మభ్యపెడతారు. విదేశీ క్రైస్తవ మిషనరీలతో వచ్చే నిధులతో మతమార్పిడులు చేసే ఎన్‌జిఓలకు ఊతమివ్వడమే బిజెపియేతర కూటమి లక్ష్యమని విజ్ఞులైన దేశ ప్రజలు గుర్తిస్తున్నారు. ‘‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’’ నినాదానే్న దేశ ప్రజలు నేడు అంగీకరిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో ఈ నినాదానికే పట్టం కట్టి దేశాన్ని రక్షించుకోవాలనేదే ప్రజల ఆకాంక్ష.

-బలుసా జగతయ్య 90004 43379