సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని యిందు గూర్పబడిన విషయములు వివిధ సందర్భములో జెప్పబడినవగుటచే సామరస్యమును -ఏకవాక్యతను గూర్చుట కెన్నియుపాముల మేమెంత బ్రయత్నించియున్నను, అదుకులు గాన్పింపక మానవు- కొంతవరకైనను విషయము ఖండ ఖండములుగా దోపకమానదు. బోధనలను క్రమ వికాస మార్గమున బొందుపరచుటకై శ్రద్ధ వహించియున్నను, అందలి ప్రధాన తత్త్వములను ఇట సంగ్రహముగా దెల్లినచో, పాఠక జన సామాన్యమునకు విశేష ప్రయోజనకరమగునని మా ఆశయము. ఐనను దిగ్దర్శన్యాయయమున ఈ క్రింద జూపబడు విషయములు ప్రత్యేకమైనయొక మతమునుగాని, సంప్రదాయమునుగానినిరూపించునని కావని పాఠకులు గమనింతురగాక. శ్రీరామకృష్ణ పరమహంస ప్రత్యేమగు నేమతమునుని, ఏ సంప్రదాయమునుగాని, ఏ సిద్ధాంతమునుగాని ప్రకటింపయుండలేదు, బోధించి యుండలేదు. వివిధోపాసనా వాహినులు వివిధ మత సాధనలు-అతని విజ్ఞానసాగరమున లీనమై యొప్పుచున్నవని గమనింపవలసియున్నది. అందలి సారామృతమే రుూ క్రింది తత్త్వ సంగ్రహము.
సత్యము లేక తత్త్వము స్వయంజ్యోతి. ఏకమగు నీ తత్త్వమే ప్రపంచమందలి వివిధ మతములచే భగవంతుడు, అల్లా,బుద్ధుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మము- మొదలగు నామములచే సూచింపబడుచున్నది. సాకారమదియే, నిరాకారమునదియే; సగుణమదియే, నిర్గుణము నదియే, నిరాకార మ్రహ్మమనునది సాకార బ్రహ్మముకంటె తక్కువదని గాక, నిరుపాధికమని భావింపనగును.
స్వతస్సిద్ధముగా బ్రహ్మము సర్వాతీతమయ్యు, పరమేశ్వరాంశమున (లీరూపమున)చేతనాచేతన ప్రపంచమున కంతకును మూలాధారమై సృష్టి స్థితిలయ కారణమై యొప్పుచున్నది. ఈ భావముననే బ్రహ్మము జగత్పతయనిగాని జగన్మాతనిగాని సూచితమగుచున్నది.జీవులును జగత్తును గూడ బ్రహ్మస్వరూపములే-పరమేశ్వర స్వరూపములే.
భక్తునకు అతడు ప్రేమమూర్తి, జీవనజ్యోతి, సంసార దుఃఖములు తన్ను మరచి సంచరించుచున్న తన బిడ్డలను తిరిగి తనయొద్దకు జేర్చుకొనుటకై ఆతడువినియోగించు నుపాయములు, సర్వాంతర్యమియై వెల్గొందుచున్నను భక్తిపూరితులగు వారలకు ఆతడత్యంతాప్తుడు. మానవుని హృదయాంతరాళమునుండి వెలువడు ప్రార్థనల నాతడాలకించును- ఆలకించి తన కటాక్షమును వానిపై బరుపును.
నిర్గుణ నిరాకారతత్త్వమున వానిని జ్ఞాన మార్గముచే బ్రాపింపనగును;సగుణసాకార రూపమున వానిని భక్తిమార్గమున బొందవచ్చును. ఐనను ఆత్మార్పణముతో గూడినభక్తి మార్గమే మానవునకెంతయు సహజము, సులభము. ఈ మార్గమునవలభించువారల కాతడు జ్ఞానఫలమగు బ్రహ్మైక్యమును కూడా బ్రసాదించును. భక్తిమార్గమున భగవానుని మన తండ్రిగా గాని, తల్లిగా గాని,మిత్రునిగాగాని, పుత్రునిగాగాని, ప్రాణేశ్వరునిగా గాని, సన్నిహితము, ప్రియతమమునగుమరియే ఇతర సంబంధమున గాని భావింపనగును, భజింపనగును. భక్తుని మనోభావముననుసరించి భగవానుడు వివిధ దివ్య రూపములతో సాక్షాత్కరించుచుండును.
సాక్షాత్కార వాఙ్మయమున అద్వైతము తుదిమాట. అది మనస్సునకును మాటలకును అతీతమగుటచే యోగ సమాధిలో ననుభవింపబడవలసిదే. మనస్సును బుద్ధియు విశిష్టాద్వైతము వరకుగల విజ్ఞానమును గ్రహించి మాటలలో జెప్పగలుగును.
ఇంకా ఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి