సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానిని దాటి యవి పోజాలవు. విశిష్టాద్వైతముయొక్క సంపూర్ణావస్థయం దఖండ సచ్చిదానంద వస్తువును తద్బాహ్య రూపమును సమముగా సత్యములని కనుగొనవచ్చును.
జీవులయెడ తన యనంత కారుణ్యముచే భగవానుడవతరించును.అబహ్మ మార్గమును-్ధర్మ మార్గమును -లోకమునకుదెలుపుటకై ఆత్మశక్తికిని పవిత్రతకును నిలయమగు నొకానొక దివ్య మానవ రూపమున నాతడావిర్భవించును. వివిధ దేశ కాలములలో లోకమునకు అధ్యాత్మిక జీవన మార్గములను జూపిన ధర్మస్థాపకులందరను ఇట్టి యవతార పురుషులే -లేదా ఈశ్వరాదేశమునొందిన మహనీయులే. వారి నారాధించుటయు వారి జీవితచరితములను ధ్యానించుటయు ఆత్మవికాసమునకు సులభోపాయములు.
జీవుని వ్యక్తిత్వమునకు ఈశ్వర చైతన్యముతో సన్నిహిత సంబంధముగలదు; ఏలన పరమేశ్వర చైతన్యమే ఉపాధిబద్ధమైన జీవరూపమున భాసించుచున్నది.కావున ప్రతి జీవియందును దివ్యత్వము -ఈశ్వరత్వము -గర్భితముగానున్నది. బాహ్యాంతర ప్రకృతులను వశమొనర్చుకొని యంతర్గతముగానున్న ఈశ్వరత్వమును ప్రకాశితమొనర్చుటయే జీవిత పరమావధి. సరియగుమనోభావముతో నవలభించినచో, సమస్త ధర్మమార్గములును ఈయాత్మ వికాసము నొనగూర్చునవియే.
బ్రహ్మ సాక్షాత్కారమును బొందుటకై జ్ఞానయోగము, కర్మయోగము, భక్తియోగము, రాజయోగము నను ముఖ్యమగు యోగములలో దేనిని గాని, కొన్నిటినిగాని, అన్నిటినిగాని అవలంభింపనగును.
పారమార్థిక జీవమునకు ప్రధానాంగము బలము. శారీర మానసికాధ్యాత్మిక బలము. బలమే పుణ్యము, దౌర్బల్యమే పాపము. బలమునకంతకును మూల కారణము నమిమ్క-తన యందును భగవంతునియందును నమ్మిక; ఆత్మనిరసనము లేక స్వయముగా తాన పాపిననుకొనుట ధర్మ లక్షంము కానేరదు. అటిట దౌర్బల్యమును త్రోసిరాజనవలయును. ఏలన స్వతస్సిద్ధమగు తన దివ్యత్మును ధ్యానించుటచే మానవుడు పాపముక్తుడు కాగలడు గాని, ‘‘నేను పాపిని, పాపి’’నని కుందుచుండుటచే విముక్తుడు కాజాలడు. నిజముగా ‘అమృతపుత్రు’డగు మానవుని పాపియనుటకంటె మహాపాపము మఱియొకటి లేదు.
అవినీతిపరుడగువాడు- పాపమునకు వెరవనివాడు- పారమార్థికుడగు కలలోని వార్త. సమస్త నీతి నియమములకును మూలాధారము స్వార్థరాహిత్యము, స్వార్థరాహిత్యమునకు మూలాధారము వైరాగ్యము.వైరాగ్యమనగా కామినీ కాంచనసంగత్యాగము. వినిర్మల వర్తనమున, సర్వభూతహితాచారణమున, సర్వేశ్వరుని బొందవలయునను పరితాపమున, వైరాగ్యమును ప్రజ్లలించును. ఇట్టి వైరాగ్యముచే వినిర్మలమగు హృదయమున భగవానుడు ప్రతిఫలించును. దుర్లభమగు మానవజన్మము నెత్తియు భగవద్దర్శనము నొందనివాని జీవితము-తుదకందులకై తగు సాధనయైన నొనర్పనివాని జీవితము -నిరర్థకము, నిరర్థకము!
జీవుని పరమావధి
1. రాత్రి కాలమున ఆకాశమున నీకు అనేక నక్షత్రములు కన్పించుచున్నవి. సూర్యోదయమైన పిమ్మట అవి కనబడుటలేదు. అందుచే నీవు పగటివేళ ఆకాశమున నక్షత్రములు లేవనవచ్చునా? ఓ నరుడా! అజ్ఞాన దశలో నీవు భగవంతుని కనుగొనజాలని కారణమున భగవంతుడు లేడనబోకుము.
2. దుర్లభమగు మానవజన్మము నెత్తియు ఈ జన్మముననే భగవంతుని దెలిసికొన యత్నింపనివాని జీవితము నిరర్థకము.
ఇంకా ఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి