సబ్ ఫీచర్

ఆనంద బాష్పాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గదిలో ఉపాధ్యాయుడు కొన్ని ప్రశ్నలడుగుతాడు. ఉపాధ్యాయుడు పిల్లల్లో అహంభావం తక్కువ చేయాలన్న ఉద్దేశంతో వారి గ్రాహ్యశక్తికి మించిన ప్రశ్నలను అడుగుతాడు. అలాంటి సమయంలో పిల్లలు పడుతున్న ఆలోచనల నొప్పులను చూస్తే ఒక టీచర్‌గా ఆనందమేస్తుంది. ఇలాంటి సంఘటనలు కేవలం క్లాస్‌రూమ్‌లోనే కాదు, స్కూల్‌లో, ప్లేగ్రౌండ్‌లో కూడా తటస్థపడుతూ ఉంటాయి. అవి పుస్తకంలో ప్రశ్నలైతే విద్యార్థి ఠకీమని సమాధానం చెప్పేస్తాడు. తెలివిగల విద్యార్థి అయితే తనకు తెలియదని మాత్రం అనడు. ఆ లెక్క చేయలేనని మాత్రం అనడు. ‘కొద్దిగా టైం ఇవ్వండి సార్’ అంటాడు. ఆ సమస్య పరిష్కారానికి ఆ విద్యార్థి వేసే ఎత్తుగడలు ఉపాధ్యాయుల్ని ఆలోచింపజేస్తాయి. ఆలోచించాక సమాధానం దొరికిందని విద్యార్థి అంటాడు. ఈ పనిని న్యూక్లియరిస్ చేశాడు. ‘‘మనిషి నీటిలో మునిగితే ఎందుకు తేలికైపోతాడు’’ అని ఒక ఉపాధ్యాయుడు అడిగాడు.
అప్పటివరకు దానికి సమాధానం కనుక్కోబడలేదు. ఆ విద్యార్థి స్నానం చేస్తున్నపుడు హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. స్నానం చేసే దశ నుంచి అదే విధంగా ఆ విద్యార్థి ఒంటినిండా నీరు కారుతుండగా పరుగెత్తుతున్నాడు. ‘యురేకా’ (నేను కనుక్కున్నాను లేదా పరిష్కారం దొరికింది) అంటూ అరుచుకుంటూ ఉరుకుతున్నాడు.
నీటిలో మునిగినప్పుడు ఆ నీటిని శరీరం కొంత తొలగిస్తుంది. తొలగించిన ఆ నీరు ఆ మనిషిని పైకి లేపుతుంది. వస్తువు భారాన్ని నీరు తక్కువ చేస్తుంది అని విద్యార్థి తనకు బాత్‌రూమ్‌లో వచ్చిన ఐడియాను తన టీచర్‌కు చెప్పాడు. అదే ఆర్కిమెడిస్ సూత్రం అయిపోయింది.
చురుకైన విద్యార్థులను టీచర్ తనకు తెలియని ప్రశ్నలను సైతం అడుగుతాడు. తనకు, ఈ ప్రపంచానికి తెలియని సమాధానం కావాలని పిల్లలను అడుగుతాడు.
తెలివైన విద్యార్థి సమాధానం చెప్పి కొత్త ఆవిష్కరణలకు కారణభూతమవుతాడు. దానే్న గణిత శాస్తవ్రేత్త రామానుజం విద్యార్థి దశలో తరగతి గదిలో చేశాడు. కొన్నిసార్లు ప్రశ్న అడిగేవారికి సైతం సమాధానం రాదు. ఉపాధ్యాయుడు కొత్తజ్ఞానాన్ని సంపాదించటం కోసం కొన్నిసార్లు చురుకైన పిల్లలను వింత వింత ప్రశ్నలు అడుగుతాడు. అదే నూతన ఆవిష్కరణలకు కారణమవుతుంది. ఈ సందర్భంలో టీచర్ స్టూడెంట్ అయ్యాడు. స్టూడెంట్ గురవయ్యాడు. నవీన ఆవిష్కరణలకు సమయమదే.
విద్యార్థి లేత మేధస్సు ఉపాధ్యాయుని మేధస్సు కన్నా పదునుగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడి ప్రశ్నకు తరగతి గదిలో అప్పటికప్పుడు సమాధానం దొరక్కపోయినా విద్యార్థులను ఆలోచనలకు పురికొల్పుతుంది. శిష్యుణ్ణి శాస్తవ్రేత్తగా మార్చుతుంది. శిష్యుడి కీర్తిని విని ఉపాధ్యాయుడు కళ్లు తడుస్తాయి. ఆ కన్నీటి ధారలే ఆనంద బాష్పాలు.
తరగతి గది ఉపాధ్యాయుడి ఆనంద బాష్పాలకు కేంద్రం. సమస్య చిక్కుముడుల్ని విద్యార్థి విప్పిచూపినపుడు ఉపాధ్యాయుడి ఆనందానికి అవధులుండవు. తనను మించి విద్యార్థి ఎదిగిపోవటం చూసి టీచర్ ఆనందిస్తాడు. ఇట్లాంటి ఘడియలు ఎన్నో నా తరగతి గదిలో అన్వయించాను.
మధుర క్షణాలు...
నా జీవితంలో మధుర క్షణాలు నాకు గుర్తుకు వస్తున్నాయి. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ నాకు ఒక మధురానుభూతిని మిగిల్చాయి. అదొక తపస్సు. నాగార్జునసాగర్ డిగ్రీ కాలేజీకి పిల్లలు, ఉపాధ్యాయులను నియమించారు గానీ బ్లాక్ బోర్డు లేదు, బెంచీలు లేవు. పిల్లలు తాము ఎక్కడ కూర్చోవాలి సార్ అన్నారు.
ఫర్నిచర్ వచ్చేదాకా సెలవులు వద్దు, మేం కిందనే కూర్చుంటాం. మాకు తరగతులు నిర్వహించండని పిల్లలు కోరారు. మెస్‌ను కూడా మేమే నిర్వహించుకుంటామని పిల్లలే ముందుకొచ్చారు. పిల్లలు ఉదయం 4 గంటలకు నిద్ర లేచేవారు. ఓ విద్యార్థి ఇడ్లీ పిండి రుబ్బేవాడు. 8 గంటలకు టిఫిన్ తయారయ్యేది. పిల్లలు 6 గంటలకే వచ్చి వ్యాయామం చేసేవారు. 7 గంటలకు మార్నింగ్ అసెంబ్లీని పిల్లలే నిర్వహించేవారు. ప్రిన్సిపాల్‌గా నేను నామ్‌కేవాస్తేగా నిలుచునేవాణ్ణి. పిల్లలు క్లాసులకు క్రమశిక్షణతో వెళ్లేవారు. మొత్తం అన్ని సబ్జెక్టుల టీచింగ్ కార్యక్రమం జరిగేది.
విద్యార్థులు తల్చుకుంటే కానిదేమీ లేదు. పిల్లలను చూసి స్ఫూర్తిచెందేవాడిని. పిల్లలు ఇబ్బంది పడే దృశ్యాలను పత్రికలకెక్కించటం వల్ల నెల రోజుల్లో రావాల్సిన ఫర్నిచర్ 15 రోజులకే వచ్చింది. కాలేజీకి సెలవులు లేకుండానే అకడమిక్ క్యాలెండర్ మొదలైంది. అన్ని కాలేజీల మాదిరిగా ఫర్నిచర్ లేకుండా క్లాసులు నడువగలుగుతాయా? అన్న సందేహం రావచ్చు. కాలేజీలను నిర్మించేది, నడిపించేది పిల్లలే. ఇది యాధృచ్చికమే కావచ్చు. ఇది నా జీవితంలో మాత్రం మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇప్పటికీ నా విద్యార్థి వెంకటకృష్ణ వచ్చి పలకరిస్తున్నట్లుగానే అనిపిస్తుంది. పిల్లలు కాలేజీలో మమేకమైతే అదొక ఆనంద నిలయంగా మారుతుంది. అదే నాకు ఆదర్శం.

-చుక్కా రామయ్య