సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఱల మఱల మునిగి వెదకులాడినచో తుదకు కష్టము ఫలించును. విశ్వమున దేవుడు కలడు. ఆ దేవుని కనుగొనుటలో నీ తొలి ప్రయత్నము సఫలము కాని యెడల నిరుత్సాహివి కావలదు. దీక్షతో సాధన చేయుము, తుదకు నీకు భగవద్దర్శనము లభించును.
14. సచ్చిదానందమయుని ధ్యానింపుము, నీకు బ్రహ్మానందము లభించును. బ్రహ్మానందమే నిత్యమైనది. ఐనను అజ్ఞానము దానిని గప్పిపుచ్చుచున్నది. విషయములయందు రాగము తగ్గిన కొలదియు ఈశ్వరానురక్తి నీయందు వృద్ధి యగుచుండును.
15. ధనము ఉన్నంతనే నరుని భాగ్యవంతుడనదగదు. భాగ్యవంతుని యింటికి లక్షణమేమన, ప్రతి గదియందును ఒక దీపము వెలుగుచుండవలయును. పేదలంతటి వ్యయము చేయజాలకుండుటచే అన్ని దీపములు పెట్టుకొనజాలరు.
దేహమను నీ దేవాలయమును చీకటికొట్టుగా జేయరాదు; అందు జ్ఞాన దీపమును వెలిగింపుము.! ‘‘నీ హృదయ కుహరమున జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపజేసి దివ్యమాతయొక్క ముఖారవిందమును గనుము.’’ ప్రతి వ్యక్తియు జ్ఞానలాభమునొందగలడు. జీవాత్మకలదు, అటులనే పరమాత్మయు కలదు. ప్రతి జీవాత్మకును పరమాత్మతో సంబంధమున్నది. పట్టణమున ప్రతి గృహమునకును వాయుదీప సంబంధము ఏర్పడి యున్నది. అందులకు వలయు వాయువును దానికి సంబంధించిన వారినుండి పడయవచ్చును. తగునధికారులకు దరఖాస్తుచేసిన పక్షమున అట్టియేర్పాటు చేయబడును. అపుడు నీ గది లోనికి వాయుదీపము వచ్చి వెలుగును.

జీవుని తత్త్వము
16.ఒకటికి సున్నలు జేర్చుచుదాని విలువ నెంతగానైనను పెంచవచ్చును. కాని యాఒకటిని కొట్టివేసిన, సున్నలకు విలువ సున్నయే గదా! అద్వితీయుడుగు దేవునాశ్రయింపనిదే జీవునకు విలువలేదు; ఏలన లోకమున సర్వమునకు భగవంతునితోడి సంబంధముచేతనే విలువ ఏర్పడుచున్నది. ప్రపంచమునకు ఆధారభూతుడును అన్నిటికిని విలువనిచ్చువాడును అగు భగవంతు నాశ్రయించి వాని కోసము కర్మములు చేయుచుండునంతవరకు జీవుడు పురోభివృద్ధి నొందుచుండును. ఇందులకు మారుగా భగవంతుని లక్షింపక తన ప్రతిష్ఠకై తాను చేయు కార్యములను మన కార్యములుగా నెంచుకొనుట నిష్ప్రయోజనము.
17.చమురులేనిదే దీపము వెలుగని రీతిని నారాయణుడు లేనిదే నరుడుజీవింపజాలడు.
18.నరునకును నారాయంనకును గల సంబంధము ఇనుమునకు సూదంటు రాతికిని గల సంబంధమువంటిది. ఐననను నరుడు నారాయణునిచే ఆకర్షింపబడడేమి? మట్టిచే గప్పబడిన ఇనుము సూదంటురాతి ఆకర్షింపబడని చందమున మహామాయచే గప్పబడిన జీవుడు ఈశ్వరాకర్షణమును బొందజాలకున్నాడు. కాని నీటితో ఆ మట్టిని గడిగివేసిన యెడల సూదంటు రాయి ఇనుము నాకర్షించుటకు ఏయాటంకము నుండదు. అటులనే జీవుడు తన్ను సంసారబద్ధుని జేయుచున్న మాయయను మలమును నిరంతర అపార్థన చేతను పశ్చాత్తాపము చేతను పొరలివచ్చు కన్నీటితో గడిగివేసెనేని వెంటనే నారాయణునిచే ఆకర్షింపమడును.
19.జీవాత్మ పరమాత్మల ఐక్యమెట్టింది?గడియారమునందలి చిన్న ముల్లును పెద్ద ముల్లును గంటకొక తడవ కలియుటవంటిది. అవి రెండును పరస్పర సంమంధముగలవై ఒకదానిపై నొకటి ఆధారపడియున్నవి. సాధారణముగా వేర్వేరైయున్నను అవకాశము లభించినపుడెల్ల అవి కలియుచుండును.
20.మాయాబద్ధమగు ఆత్మయే జీవుడు. బంధముక్తమగు ఆత్మయే ఈశ్వరుడు.
21.జీవాత్మ పరమాత్మలకు గల సంబంధము ఎట్టిది? ప్రవాహమునకు అడ్డముగా నొకబల్ల నుంచిన యెడల ప్రవాహము (నందలి జలము) రెండుగా జీల్పబడినట్లగుపడును. అటులనే మాయోపాధివలన అద్వితీయ బ్రస్మము జీవాత్మ పరమాత్మలుగా విభజింపమడినట్లు కాన్పించుచున్నది.
ఇంకావుంది...

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి