సబ్ ఫీచర్

ఎన్నికల వ్యవస్థకు చికిత్స అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచే ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య విలువలకు గట్టిగా పునాదులు పడ్డాయ. ఎన్నికల నిర్వహణ భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓటర్ల నమోదు, గుర్తింపు కార్డుల విడుదల, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ఫలితాల ప్రకటన మొదలగు కార్యక్రమాలను ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగాలంటే, దాదాపు ఎన్నికల ప్రక్రియకు ఒక నెల కాలం పాటు జరుగుతుంది. అవసరమైతే ఇంకొన్నాళళు ఎక్కువనూ తీసుకోవచ్చు. ఓటర్ల నమోదు , ఓటర్ల జాబితా తయారీ, జాబితాకు సవరణలు, పరిశీలనలు,పరిష్కారాలు వగైరా సాధారణ కార్యక్రమాలు జరుగుతాయి. ఎన్నికల తంతు ప్రారంభం కాగానే ఎన్నికల నియమావళి (కోడ్) అమలులోకి వచ్చిందంటే ప్రజా ప్రతినిధులు నామమాత్రం అయిపోతారు. దాదాపు ప్రభుత్వ విభాగాలన్నీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తాయ.
పోలింగ్ కోసం ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు ఉపయోగిస్తారు. పోలింగ్ ముగిశాక వీటిని అత్యంత జాగ్రత్తతో భద్రపరుస్తారు. ఎన్నికలు అయిన తరువాత, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను, ప్రకటింపబడిన వోట్లలెక్కింపు రోజున తెరచి వోట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపడుతారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో గెలిచినవారి జాబితాను గవర్నరుకూ, రాష్టప్రతికీ అందజేస్తారు. ఇంతటితో ఎన్నికల కమిషన్ బాధ్యత తీరుతుంది. ఆ తరువాత కార్యక్రమాన్ని లోక్‌సభకు సంబంధించి రాష్టప్రతి కేంద్రస్థాయిలోనూ, శాసనసభలకు సంబంధించి గవర్నర్లు రాష్టస్థ్రాయిలోనూ చేపడుతారు.
లక్షల మంది ఉద్యోగులు పగలనకా, రాత్రనకా కష్టపడితేనే ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతంగా ముగుస్తుంది. ఇదంతా చూడడానికి పక్కాగా ఉన్నదనిపిస్తున్నప్పటికీ ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్ల నైతేనేమి, ఎన్నికల వ్యవస్థలో ఉన్న డొల్లతనం వల్ల నైతేనేమి అక్రమార్కులకు చక్కటి అవకాశాలను దక్కడం విచారకరం. ఎంతో కష్టపడి చక్కటి ప్రణాళికలు వేసుకున్నా, క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలను ఉత్పన్నమవుతున్నాయ. వాటిని పరిష్కరించుకోగలిగితేనే దేశంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుంది.
అందులో మొదటిది- మన ఓటు హక్కును మనం పోలింగ్ కేంద్రంలోకి పోయేలోగానే ఎవరో తస్కరించడం లేదా మన ఓటు గల్లంతై ఉండడం. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని ఇటు ప్రతిపక్ష పార్టీలు , గెలిచిన తరువాత అధికార పార్టీ పేర్కొనడం గమనార్హం. ఒక పక్క పోలింగ్ జరుగుతుండగానే తమ ఓట్లు గల్లంతైనట్టు లేదా ఎవరో వేశారంటా అని కొందరు ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసిన దృశ్యాలు టీవీలలో ప్రత్యక్ష ప్రసారం అయినాయి. ఇష్టమైన నాయకుడికి ఓటు వేసి మద్దతు తెలియజేయాలన్న ఆశతో ఎక్కడెక్కడినుండో ప్రయాణం చేసి అలసిన శరీరాలతో, ఎంతో ఓపికగాక్యూలో తన వంతు వచ్చే వరకు నిలబడి తీరా లిస్టులో పేరు కనబడకపోతే ఓటరు పొందే నైరాశ్యానికి కారకులు ఎవరు? తన ప్రమేయం లేకుండా తన ఓటు ఎలా పోతుంది? వీటికి కారణాలు తెలుసుకోవాలన్నా, ఎవరిని ప్రశ్నించాలో తెలియక మొత్తం ఎన్నికల వ్యవస్థను , అధికారులను ఓటర్లు ఆడిపోసుకుంటారు. ఇది ప్రధాన లోపం. అప్పటికప్పుడు ఓటర్ల సమస్యని గుర్తించి,ప్రత్యమ్నాయం చూపించే వ్యవస్థని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలా చేయాలంటే, ఓటు నమోదు చేయడానికి అన్ని స్థాయిలలో ఎంత మంది అధికారులు ,ఎన్ని ప్రశ్నలు వేసే వారు,ఎనె్నన్నో తనిఖీ పేపర్లు ,తనిఖీలు చేసే అధికారులు ఇంత సమగ్రంగా చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికీ ఓటు ఇవ్వడానికి అధికారులు రాత్రింబవళళు కష్టపడతారు. మరి ఓట్లను తీసేటప్పుడు కనీస సమాచారం ఇవ్వక పోవడం ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో శోచనీయం. తనకు తెలియకుండా,కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా తీస్తారు? అనే ప్రశ్న సామాన్యుడికు కచ్చితంగా ఉదయించక మానదు!
మన దేశంలో కోట్ల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు ఉన్నా మన అకౌంట్లో దేనిలోనైనా ఒక్క రూపాయి తీసినా, వేసినా మనకు అలర్టు వచ్చే సదుపాయం ఉన్నప్పుడు మన ఓటు తీసేస్తే మనకు సందేశం వచ్చే ఏర్పాటు చేయలేమా? వేలి ముద్రతో లక్షలకు లక్షలు ఒక ఖాతా నుండి ఇంకొక ఖాతాకు తరలించే అవకాశం ఉన్న దేశంలో వేలి ముద్ర ద్వారా మన ఓటును వేరే వారు వేయకుండా ఆపలేమా? ఆ వ్యవస్థను తెచ్చుకోలేమా? వీటిని అధిగమించాలంటే కావాల్సింది రాజకీయ నాయకులకు పట్టుదల, ప్రజాస్వామ్యం మీద ధృడమైన నమ్మకం. అవే ఉంటే ఈపాటికి ఎపుడో న్యాయంజరిగి ఉండేది.
డబ్బు వెదజల్లారు, ఓటర్లను మభ్య పెట్టారు , మందు పోశారు అనే ఫిర్యాదులు ఒకరి మీద ఒకరు వేసుకోవడం రాజకీయాలలో సహజం. అటువంటి వాటిని అధికారులు, నాయకులు చివరికి ప్రజలు కూడా మామూలే అని పట్టించుకోవడం మానేశారు. సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే రెండు వేర్వేరు చిరునామాలతో ఓటు హక్కు కలిగి ఉండడం అనే ఫిర్యాదు ఎలాంటి అనుమానాలకు దారి తీస్తుంది. ఇటువంటి వాటిని సుమోటోగా స్వీకరించి వాస్తవాలు బయట పెట్టే అవసరం లేదా? దర్యాప్తు చేసే అధికారం నిజంగా ఎన్నికల కమిషన్‌కు లేదా? అనే సందేహాలు సహజంగా సామాన్య ప్రజలకు కలుగుతాయి. ఇదే సందర్భంలో ఒక సాధారణ పౌరుడు ఒక బ్యాంకులో వంద రూపాయలు వెయ్యాలన్నా, ఒక వెయ్యి రూపాయలు తియ్యాలన్నా , పిల్లలను స్కూల్లో చేర్పించాలన్నా ప్రతి దానికీ ఆధార్ నెంబర్‌తో లింకు చెయ్యమని, అసలు ఆధార్ నెంబర్ లేకపోతే ఎలాంటి పథకాలు దక్కవని పాలకులు అంటున్నారు. రాజకీయ పక్షాలు ఓటర్ కార్డును ఎందుకని ఆధార్‌కు లింకు చెయ్యమని కోరడం లేదు. వారి ఆటలు సాగవనా? తమకు పనికిరాని ఓటర్లుంటే గుంప గుత్తగా ఓట్లు తీసేసే అధికారం ఎవరికి ఉంది? అసలు ఇటువంటి ప్రచారం నిజమా? అబద్దమా? అనేవి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి రోజుల వ్యవధిలో నిజాలు బయట పెట్టాలి. తప్పు నిజంగా జరిగిందా? అయితే అందుకు కారకులెవరు? తప్పు ఎలా జరిగింది ? ఆ వివరాలు తెలుసు కొని వారికి శిక్ష విధించాలి. తప్పు నిజంగా జరగకపోతే ఎన్నికల అధికారులపై అభాండాలు వేసిన పార్టీలకు,నాయకులకు, ఫిర్యాదుదారులకు శిక్ష విధిస్తే ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం కావు. లేదంటే ఈ రాజకీయ నాయకులు చేసే తప్పుడు ప్రచారం వల్ల ఎంతో నీతిగా, నిజాయితీతో కష్టపడ్డ ఎన్నికల అధికారుల మీద సామాన్య ప్రజలకు తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. అది మన ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదం.
ఇక ముసలివారు, కంటి చూపు మందగించిన వారికి ఇవీఎం యంత్రంలో బాలెట్ పేపర్ నలుపు, తెలుపు రంగులలో కనిపిస్తుంది. ట్రక్ సింబల్ వల్ల తమ కారు గుర్తుకు పడాల్సిన వోట్లు పడలేదని తెరాస నాయకులు వాపోయారు!. నలుపు,తెలుపులో బాలెట్ పేపర్ కనిపిస్తే గుర్తుల దగ్గర చాలా తికమక ఉంటుంది. ఒకరి ఓట్లు మరొకరికి పడే అవకాశం ఉంది. దీన్ని ఉపయోగించుకొని కొన్ని పార్టీలు కూడా కావాలని డమీ అభ్యర్థులను నిలిపి వారికి కావాల్సిన వారికి , అవతలి వారి గుర్తును పోలి ఉన్న గుర్తు వచ్చేటట్లు చేయడానికి ఆస్కారం ఉంది. కొంత ఖర్చుతో కూడినదైనా బాలెట్ పేపర్ లో గుర్తులు రంగుల పేపర్లో ఉంటే కచ్చితంగా తేడా అనేది స్పష్టంగా ఉంటుంది. గులాబి రంగు కారుకి, పచ్చ రంగు ఆటో కి , ఎర్ర రంగు ట్రక్కు కి తేడా అనేది స్పష్టంగా ఉంటుంది. అప్పుడు ఎవరికి పడాల్సిన ఓటు వారికే పడుతుంది. ప్రజాస్వామ్యం లో ఓటు అనేది వజ్రాయుధం. ఒక్కొక్కసారి ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతలను మారుస్తుంది, రి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అందుకే ప్రతి ఓటు కీలకం. మన తప్పిదాల వల్ల ఒకరి ఓటు ఇంకొకరికి పడడం ప్రజాస్వామ్యంలో సరికాదు.
ఈరోజుల్లో మనం ఇంట్లో కూర్చొనే షాపింగ్ చేస్తున్నాము, సెల్‌ఫోన్ తోనే ఒక అకౌంట్ నుండి ఇంకొక అకౌంట్ కు క్షణాల వ్యవధిలో లక్షలకు లక్షలు మార్పిడి చేయగలుగుతున్నాము. అటువంటిది ఇంట్లో కూర్చొనే , చేతిలో సెల్ ఫోన్ తోనో మన ఓటు మనం వెయ్యలేమా? అప్పుడు పోలింగ్ శాతం కూడా భారీగా పెరుగుతుంది. తన ఓటు తను వేసుకోవాలని ఉన్నా ఎనె్నన్నో కారణాల వల్ల ఆరోజు పోలింగు బూత్ వరకు వెళ్ళే అవకాశం లేని వారికి, అనివార్య కారణాల వలన దూర ప్రదేశాలకు వెళ్లిన వారికి ఇలా చాలా మందికి ఆన్‌లైన్ వోటింగ్ అనేది బహుళ ప్రయోజనం. పోలింగ్ బూత్‌ల సంఖ్య తగ్గడం వల్ల నిర్వహణ ఖర్చు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ దిశగా చర్యలు చేపడితే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశం ప్రతిష్టను నిలబెట్టిన వారమవుతాము. ఈ భాద్యత అందరి పైనా ఉంది. దీనికి కావాల్సిందల్లా ధృడమైన సంకల్పం , కొంచెం ఓర్పు, మరికొంత నేర్పు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత.

-కాళంరాజు వేణుగోపాల్ 81062 04412