సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

45.సరిగా అవసాన కాలమున నరుడేమి చింతించుచుండునో దానిననుసరించియే వానికి ముందు జన్మము గలగుచుండును. కావున భక్తిసాధనలు అత్యావశ్యకమైయున్నవి. నిరంతర సాధనవలన సాంసారిక చింతలు పూర్తిగా పోయి భగవచ్ఛింత మనస్సు నాక్రమించును. అపుడు మరణకాలమున సైతము అది మనస్సును విడువదు.
46.కాల్పనికుండ విచ్చిపోయిన యెడల దాని మట్టి కుమ్మరి క్రొత్త కుండ చేయుటకుపయోగించును. కాని కాల్చినకుండ పగిలెనేని అటుల జేయజాలడుకదా? మనుష్యుడు అజ్ఞాన దశలో మరణించనేని, పునర్జన్మము నెత్తును; కాని బ్రహ్మ జ్ఞానాగ్నిలో తప్తుడై, ముక్తుడై తనువు చాలించెనేని మరల జన్మింపడు.
47.వేగించిన (్ధన్యపు) గింజలను జల్లినచో మొలకెత్తవు. వేగింపని వడ్లు మాత్రమే మొలచును. అటులనే నరుడు సిద్ధుడై, లేక బ్రహ్మజ్ఞానాగ్ని యందు తప్తుడై మరణించెనేని అతడు మరల జన్మింప నగత్యము లేదు; అసిద్ధ దశలో మరణించెనేని సిద్ధుడగువరకు మరల మరల జన్మింపవలసి వచ్చును.
రెండవ ప్రకరణము
మాయ
పరమేశ్వరుని సృజనాదిశక్తిరూపమగు మాయ- సంసార బంధ హేతువగు నవిద్యామాయ- మోక్షహేతువగు విద్యామాయ-
పరమేశ్వరుని సృజనాదిశక్తి రూపమగు మాయ
48.మాయకును బ్రహ్మమునకుగల సంబంధము ప్రాకుచున్న పామునకును పరుండియున్న పామునకునుగల సంబంధము వంటిది. క్రియారూపమై వ్యక్తమైయున్న శక్తియే మాయ, అవ్యక్తమైయున్న శక్తియే బ్రహ్మము.
49.సముద్రజలము ఇపుడు నిశ్చలముగనుండి ఇంతలో తరంగ కల్లోలమగును. ఇట్టివే బ్రహ్మము మాయయును. బ్రహ్మమే నిశ్చలమగు సాగరము. మాయయే చలించుసాగరము.
50.బ్రహ్మమునకు శక్తికిని గల సంబంధము అగ్నికిని దహనశక్తికిని గల సంబంధము వంటిది.
51.శివుడును శక్తియును గూడ సృష్టికి ఆవశ్యముకలే. పొడిమట్టితో కుమ్మరి కుండలను జేయజాలడు. అందులకు నీరు కూడా కావలసియున్నది. శక్తి యొక్క సాయము లేకుండా శివుడొక్కడే సృష్టింపజాలడు.
52.మాయను జూడ నభిలషించి యొక దినము నేనొక దృశ్యమును గాంచితిని. చిన్న బిందువొకటి మెల్లగా పెద్దదై యొక బాలికగా నేర్పడినది. ఆ బాలిక పెరిగి యువతియై ఒక బిడ్డను గనినది; మరి బిడ్డ పుట్టినంతనే ఆమె దానిని బట్టి మ్రింగివేసినది. ఇట్టులామె ఎందరో బిడ్డలను గని వారినందరిని మ్రింగివేసినది. ఆమెయే మాయయని గ్రహించితిని.
53.పాముకోరలయందలి విషము పామును బాధింపకున్నను అది కరచిన జంతువును బాధించి చంపును. అటులనే ఈశ్వరునియందు గల మాయ ఈశ్వరుని బాధింపజాలదు. ఐనను ఆ మాయ ప్రపంచంమునంతయు భ్రమింపజేయుచున్నది.
సంసారబంధ హేతువగు నవిద్యామాయ
54.దక్షిణేశ్వరాలయమందలి యొకగదిలో ఒక సాధువు ఉండెడివాడు. అతడెవ్వరితోడను మాటలాడక తన కాలమునంతయు భగవద్ధ్యానమున వినియోగించువాడు. ఆకసమున హఠాత్తుగా ఒకనాడు కారుమబ్బు లావరింప, ఉత్తరక్షణముననే పెనుగాలి వచ్చి మబ్బులను చెదరగొట్టుట గాంచి, సాధువు తన గది నుండి రుూవలకువచ్చి, ఆనంద పరవశుడై నృత్యము చేయ నారంభించెను. అది చూచి శ్రీరామకృష్ణుడాతనినిట్లు ప్రశ్నించెను: ‘‘నిశ్శబ్దముగా మీ గదిలో కాలము గడుపు మీరు నేడేల ఇంత మహోల్లాసముగా నృత్యము చేయుచున్నారు?’’-ఆ మహనీయుడిట్లు ప్రత్యుత్తరమొసగెను. ‘‘ఇట్టిది గదా ఈ జీవితమును ఆవరించు మాయ! ఇంతకుమునుపు లేశమైనను మాయ లేదే! కాని హఠాత్తుగా వినిర్మల బ్రహ్మాకాశమున మాయ కానబడి విశ్వమునంతయు సృష్టి చేయుచున్నది.మరల నంతలో ఆ బ్రహ్మముయొక్క నిశ్వాసముచేతనే అదృశ్యమైపోవుచున్నది’’.
ఇంకావుంది...

శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి