సబ్ ఫీచర్

హీరోయన్లు గ్లామర్‌కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలో నేను ఎంతసేపు స్క్రీన్‌పై కనిపిస్తాను అనేకన్నా, కనిపించినంతేపు నేను పోషించిన పాత్రకి ప్రాముఖ్యత, నాణ్యత ఉందా లేదా? నా ప్రెజెన్స్‌ని ఆడియెన్స్ ఫీలయ్యారా లేదా అనే ఆలోచిస్తా. అంతే తప్ప సినిమా మొత్తం నేనే ఉండాలనుకోను -ఇదీ ఓ హీరోయన్ స్టేట్‌మెంట్. నిజానికి ఇప్పటి హీరోయన్లకు ఇంత సీన్ ఉందా? ఉంటుందా? అన్నదే పెద్దడౌటు. ఈ సినిమాలో కథకు కీలకం, మలుపునకు కారణం నేనేనంటూ ప్రమోషన్స్ టైంలో హీరోయన్ల చేత చెప్పించినా -సినిమా చూశాక ఆడియన్‌కే అర్థమవుతుంది గ్లామర్ డాల్ మాత్రమేనన్న విషయం. అప్పటి హీరోయన్లతో పోల్చకపోయనా, కనీస ప్రాధాన్యత ఇప్పటి బ్యూటీలకు దక్కుతుందా? అన్నది మిలియన్ డాలర్స్ క్వొశ్చన్. కాదంటారా?

సినిమాలలో కథాపరంగా హీరోలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్లకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. అవసరాలు అలాగే ఉంటాయి. టాకీల తొలి దశలో చిత్ర నిర్మాణాలన్నీ పౌరాణికాలే కాబట్టి స్ర్తిపురుష పాత్రలు కథలో అవసరాన్నిబట్టి సమాన ప్రాధాన్యత కలిగి ఉంటాయి. అదీకాక అప్పటి నటీనటులకు స్టార్ వేల్యూ, ఇమేజ్‌లాంటివి ఉండేవికావు. సాంఘిక చిత్రాల నిర్మాణం, జోరుపెరగటం మొదలైన దగ్గర్నుంచి సినిమాలలో హీరోలతోపాటు హీరోయిన్లకూ స్టార్ వాల్యూ, ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. హీరోయిన్‌లకు నటనా సామర్థ్యంతోపాటు అంద చందాలు, మేని వంపుసొంపు, లావణ్యం సమాన స్థాయిలో కావాలి. అంతకుముందైతే గ్లామర్‌కన్నా సమర్థతకే ప్రాముఖ్యతనిస్తే -సాంఘిక చిత్రాల నిర్మాణాలు 1950 దశకం ప్రారంభంనుంచి జోరందుకోవడం ప్రారంభమైననుండి నాటి చిత్రాలలో హీరోలకు, హీరోయిన్లకు నటన, టాలెంట్‌తోపాటు కాస్త ఎక్కువగా గ్లామర్ అవసరమైంది.
మొదటినుండి సినిమా రంగంలో హీరోలే ఎక్కువ కాలం అంటే పాతిక, ముప్ఫై యేళ్లు కొనసాగుతుంటారు. ఇప్పటికీ ఇదే పద్ధతి. తొలి దశలో ఆనాటి హీరోయిన్లు దాదాపుగా అందరూ ఇంచుమించు ఇరవై ఏళ్లు కొనసాగుతూ వచ్చారు. ఇప్పటి హీరోయిన్లు ఎవ్వరైనా ఐదారేళ్లకే కనుమరుగవుతున్నారు. పట్టుమని పాతిక సినిమాలుచేస్తే గొప్ప. ఒక హిట్‌వస్తే టాలెంట్ లేకున్నా గ్లామర్‌కు భారీ పారితోషికం డిమాండ్ చేయటం, ఆంక్షలు పెట్టడం మామూలే. మార్కెట్‌కోసం ఆరంభంలో తీసుకొంటారు. భరించలేనివారు కొత్తవారిని వెతుక్కొంటారు. అదీకాక ఇప్పుడు వస్తున్నవారు స్టార్ వాల్యూ రాగానే సీనియర్స్‌ని ఒప్పుకోవటం లేదు. యువ హీరోలే కావాలంటారు. అందుకే స్టార్ హీరోలకు హీరోయన్ల ఎంపిక కత్తిమీద సాములా మారింది.
1950 ఆరంభంలో అంతకుముందు చిత్తూరు నాగయ్య లాంటి ముప్పై అయిదు దాటిన హీరోలు, కొత్తగా వచ్చిన ఎన్టీఆర్, కొంత సీనియారిటీ వున్న అక్కినేని నాగేశ్వరరావు లాంటి పాతిక దాటిన హీరోల ధాటికి క్యారెక్టర్ పాత్రలకు పరిమితమయ్యారు. ఇంకా జగ్గయ్య, కాంతారావు, హరనాధ్, రామశర్మ లాంటి కొత్తవారి రాక ఒరవడిగా సాగుతుంటే హీరోయిన్లు కూడ శ్రీరంజని, కన్నాంబ, మాలతి, శాంతకుమారి, భానుమతి లాంటి మూడుపదులు దాటినవారిని దాటుకుంటూ కొత్త అందాలు, నటన మేళవించిన యువ హీరోయిన్లు రాకమొదలైంది. అలా అంజలీదేవి, సావిత్రి, షావుకారు జానకి, కృష్ణకుమారి, జి.వరలక్ష్మి, యస్.వరలక్ష్మి, జమున, దేవిక, గిరిజ తొలి తరం వారుకాగా బి.సరోజాదేవి, ఇ.వి.సరోజ, రాజసులోచన, వాసంతి, రాజశ్రీ లాంటివారు యాభై దశకం చివరలో వచ్చినవారు, 60 దశకం ఆరంభంలో శారద, జయంతి, ఎల్.వి.విజయలక్ష్మి, వహీదారెహ్మాన్, అమ్మాజీ, పద్మిని, జయశ్రీ, 65-70 ప్రాంతాలలో వచ్చిన విజయనిర్మల, జయలలిత, విజయలలిత, చంద్రకళ, వాణిశ్రీ, లక్ష్మి, కె.ఆర్.విజయ, షీలా, భారతి, కాంచన, శుభ, శ్రీవిద్య, మంజుల, గీతాంజలి, జ్యోతిలక్ష్మి, జయమాలిని, హలం, రమాప్రభ, 75 తర్వాత వచ్చినవారు జయసుధ, జయప్రద, జయచిత్ర, సంగీత, సరిత, మాధవి, లత, కె.విజయ, కవిత, వై.విజయ, శ్రీదేవి 1980లో వచ్చిన విజయశాంతి, రాధ, సుహాసిని, రాధిక, సుమలత, భానుప్రియ, రమ్యకృష్ణ, 1990 దశకంలో వచ్చినవారు సౌందర్య, ఆమని, రోజా, రవళి, రంభ, మీనా, నగ్మా, రజని, శోభన, శ్రీప్రియ, దివ్యభారతి, సిమ్రాన్, రేవతి, గౌతమి, 2000నుండి ఇప్పటివరకు సంఘవి, చార్మి, కాజల్, రచన, ఇంద్రజ, ఆమని, టబూ, రవీనాటాండన్, ప్రియమణి, ఇలియానా, హాన్సికా, శృతిహాసన్, అశ్విని, నయనతార, త్రిష, రాశి, రాశీప్రియ, మెహ్రీన్‌కౌర్, పూజాహెగ్డే, జెనీలియా, ఆర్తి అగర్వాల్, కల్యాణి ఇలా చెప్పుకుంటూపోతే చాంతాడంత లిస్టు. వీళ్ళంతా ఎంతోకొంత ఇమేజ్ సంపాదించి సినీ ప్రేక్షకుల్ని అలరించి రెండుమూడేళ్లు పేరులోవుండి మెల్లగా తెరమరుగైన వారే! వీళ్ళలో పదేళ్లువరకు పరిశ్రమలో వెలిగిన, మెలిగినవారిని వేళ్లపై లెక్కించొచ్చు
1950 దశకంలో సంపాదనకన్నా నటనపై అభిరుచితో పరిశ్రమలోకి మహిళలు వచ్చేవారు. నటించటానికి తపన పడేవారు. ఆరోజులలో నటీమణిగా ప్రవేశించినవారు ఏకంగా హీరోయిన్‌గా రాలేదు. రెండుమూడు చిత్రాలలో చిన్నచిన్న పాత్రలతో తమ టాలెంట్ నిరూపించుకొంటేగానీ దర్శక నిర్మాతలు హీరోయిన్‌గా అవకాశం యిచ్చేవారుకాదు. అలా వచ్చిన అంజలీదేవి, సావిత్రి, కృష్ణకమారి, జమున.. 1970వరకు నిరాటంకంగా హీరోయిన్లుగా కొనసాగారు. వీరు అప్పటి టాప్ హీరోలు అక్కినేని, నందమూరిలతోపాటు జగ్గయ్య, కాంతారావు లాంటి హీరోలతో చిన్న తేడా లేకుండా అందరితో హీరోయిన్‌గా చేసేవారు. 30 ఏళ్లపైగా అగ్ర హీరోలుగా వెలిగిన ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌లతో ఒక్కోరు యిరవై పాతిక చిత్రాల వరకు హీరోయిన్‌గా నటించారు. అదే స్థాయిలో వారిని ప్రేక్షకులు అధిక విజయాలతో ఆదరించారు. రెండో తరంలో వచ్చిన రాజసులోచన, బి.సరోజాదేవి, రాజశ్రీలు కూడా ఎన్టీఆర్, ఎన్నార్‌లతో పది చిత్రాలకు పైగా చేశారు. అగ్రనటి వాణిశ్రీ అయితే హాస్య నటి, క్యారెక్టర్ నటిగా ఐదారేళ్లు చేసిన తరువాత 1967లో హీరోయిన్ స్థాయికి ఎదిగారు. ఆ సమయంలో వచ్చిన రెండోతరం అగ్ర హీరోలు కృష్ణ, శోభన్‌బాబు, హరనాథ్, కృష్ణంరాజులతోపాటు ఎన్టీఆర్, ఎన్నాఆర్‌లతో కూడ యిరవై చిత్రాలకుపైగా హీరోయిన్‌గా నటించారు. వాణిశ్రీ కూడ 25 యేళ్లు హీరోయిన్‌గా కొనసాగి పునఃప్రవేశంతో క్యారెక్టర్ పాత్రలలో కొన్నాళ్లు సాగి రిలాక్స్ అవుతున్నారు.
వాణిశ్రీ కంటే ముందుగా కాంచన, సుకన్య, జయంతి, శారద, చంద్రకళ, గీతాంజలి, ఎల్.విజయలక్ష్మి తదితరులు హీరోయిన్లుగా, ఓవైపు చెల్లెలు, హాస్య, క్యారెక్టర్ పాత్రలలో రాణించారు. 75 దశకంలో వచ్చిన జయసుధ, జయప్రద, శ్రీదేవి ఆ టైంలో స్టార్ ఇమేజ్‌తో రాకెట్‌లా దూసుకుపోయారు.
తర్వాత వచ్చిన రాధ, విజయశాంతి, సుహాసిని, కృష్ణ, శోభన్‌బాబులతో అప్పుడే కొత్తగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవితో వీరు ఒక్కొక్కరు 20 చిత్రాలవరకు జోడిగా నటించారు. శ్రీదేవి కూడ 5 చిత్రాలు చేసింది. రాధ, విజయశాంతి, సుహాసిని కూడ బాలకృష్ణతో 10 చిత్రాలవరకు చేశారు. రమ్యకృష్ణ కూడ వీరితోపాటు మోహన్‌బాబు, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్ లాంటి వారితో చేస్తూ పదేళ్ళుపైగా హీరోయిన్‌గా కొనసాగారు. 1960లో వచ్చిన హరనాథ్‌తో జమున దాదాపు 10 చిత్రాలలో నటించింది. 1995 ప్రాంతాలలో వచ్చిన సౌందర్య కూడ 2003 మరణించేవరకు జగపతిబాబు, రాజశేఖర్, మోహన్‌బాబు, వెంకటేష్, శ్రీకాంత్, కృష్ణ, రాజేంద్రప్రసాద్ లాంటి హీరోలతో ఎక్కువగా నటించారు.
ఆమని, శోభన, అశ్వని, కవిత, మీనా, నగ్మా, అమల, వాణివిశ్వనాథ్, భానుప్రియ, రోజా, రతి, కుష్బు లాంటివారు నాలుగైదు ఏళ్లు హీరోయిన్లుగా ఆనాటి హీరోలతో ఓ వెలుగు వెలిగారు. ‘చంద్రముఖి’తో పరిచయమైన నయనతార, శృతిహాసన్, కాజల్, సమంత, త్రిష, జెనిలియా, శ్రీయా లాంటివారు ఓ పదేళ్ళనుండి హీరోయిన్స్‌గా చేస్తూ సీనియర్స్‌గా మారిపోయారు. ఇప్పటి మెహ్రాన్‌కౌర్, పూజాహెగ్డే, తమన్నా, అనుపమా పరమేశ్వరన్, అనూ ఇమ్మాన్యుయల్, రాశీఖన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్, హన్సికలాంటి ఎందరో నవ యువ తారలు నటనకన్నా గ్లామర్ పాత్రలతో నేటి యువతరాన్ని ఆకర్షించేందుకు రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఆఖర్ను అనుష్క టాలెంట్ ఉన్న నటిగా గ్లామర్ హీరోయిన్‌గా ఈనాటి అగ్రహీరోలతో జతగాచేసి అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి చిత్రాలలో లేడీ హీరోయిజంతో నేడు టాప్‌స్టార్‌గా ఉన్నారు. అనుష్క కంటే ముందు విజయశాంతి గ్లామర్ రోల్స్‌తో కర్తవ్యం, ఆశయం, పోలీస్‌లాకప్, ఒసే రాములమ్మ లాంటి చిత్రాలలో డైనమిక్, పోలీస్ పాత్రలతో ఒక టైంలో చరిత్ర సృష్టించారు.
ఇప్పుడు వస్తే హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే తప్ప నటనకు పదునుపెట్టే పాత్రలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం వున్నవారంతా ఉత్తరాది భామలే! నయనతార, సమంత, కీర్తిసురేష్ లాంటి హీరోయన్లు నటనకు అవకాశముండే పాత్రలు అడపాదడపా చేస్తున్నారు. ఆనాటి హీరోయిన్లు మాదిరిగా ఈనాటి హీరోయన్ల నుంచి అలాంటి చిత్రాలు ఆశించగలమా. ఒకవేళ అవకాశం వస్తే చేయగలరా! అనే్నళ్లు మనగలరా? డౌటే.

-పీవీఎస్పీ, అద్దంకి