సబ్ ఫీచర్

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక ఆతల్లి సొగసెట్లా ఉన్నది-
ఆమె శశాకంక ఖండ సంయుక్త మకుట అందువలన శిరః స్థానం నుండి స్రవిస్తూన్న చంద్రకళ నుండి జారుతూన్న అమృత బిందువులు కలది. యోగి స్వాధిష్ఠాన కమలమందున్న అగ్నిని ప్రేరేపించి దాన్ని సహస్రారము వరకు తీసికొని వెడతాడు. అక్కడ ద్వాదశాంత కమలమొకటి ఉంటుంది. అది శే్వతవర్ణ. దాని కర్ణిక హిమ రూపమైన చంద్ర ఖండం. యోగి ఈ స్వాధిష్ఠానాగ్ని వేధ చే దాన్ని కరిగిస్తాడు.అప్పుడది స్రవించి కంఠస్థానాన్ని తడుపుతుంది. దానికే అమృత స్రావమని పేరు. ఇదీ సానుస్రుతాస్ర కంఠి అంటే-ఆ తల్లి సర్వాభరణ భూషిత.
వక్షస్థలానికి కంఠానికి సంబంధించిన భూషణ విశేషమే నిష్కం. కంఠం నుండి వక్షస్థలానికి వ్రేలాడే ఉత్తమ భూషణం స్ర్తికి మంగళసూత్రం. అందువల్లనే ఆతల్లికి కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కన్ధరా అని పేరు.
వివాహిత స్ర్తి చిహ్నమైన సూత్రంతో ఆ తల్లి తనకు మాతృమూర్తిగా కనిపించాలి. వరార్హోత్తమ నిష్క కంఠి అంటే ఇదీ భావం. అది స్వామిధ్యాస.
అటువంటి స్వరూపంతో తన యందు మాతృరూపంగా అభిరక్తమైన కంఠంఅనగా అనురాగ పూర్ణమైన కంఠంగల సీత తనంతతానుగా కనిపించాలని స్వామి ఆవేదన.
అడవియందు సంచరిస్తూన్న నెమలిలా ఆ తల్లి ఉండాలి.
ఇక్కడవనం అంటే ఆగమారణ్యం. అందులో ఆమె నెమలిలా సంచరిస్తూ ఉంటుంది. అందుకనే ఆగమ విపిన మయూరీం అని ఆమెను స్తుతిస్తారు. ఇదీ ఆంజనేయస్వామి దృష్టి. వాల్మీకి మహర్షి సందేశము ఇక్కడ.
కాదిఠాస్త దళైర్క పత్రైశ్చ సమధిష్ఠితం
తన్మధ్యే బాణలింగంతు సూర్యాయుత సమప్రభమ్
అనే అనాహత చక్ర లక్షణాన్ని ఇక్కడ మహర్షి చెప్పి స్వామి స్థితిని చెప్పేరు. అందుకనే శ్లోకం చివరి పదంగా ‘కంఠి’ అని ప్రయోగిస్తూ వర్ణ సమాహారాన్ని చేసేరు. అలాగే రేఖా శబ్దంలోని సంఖ్యాతత్త్వాన్ని చూపి ద్వాదశార్క పత్రములను ప్రదర్శించేరు. ఈ పద్మం ‘బాణ’మును చిహ్నంగా కలిగి ఉంటుంది. కనుకనే బాణ రేఖాం అని సూచించేరు. ఇది పశ్యన్తీ వైఖరి ఈ స్థానాలకు మధ్య స్థితి కనుక మన ప్రయత్నం లేకుండగనే నాదం పుడుతుంది. ఇంత విషయాన్ని వాల్మీకి ఋషి భాషలో వివరించేరు. అంతేకాదు ఈ రెండు శ్లోకాలలో మొదటి శ్లోకం చివరి పదమైన నీలకంఠీం అనేదానిని, రెండవ శ్లోకంలోని చివరి పదం అయిన మేఘరేఖాం అనేదానిని కలిపితే భక్త చిత్తకేకి ఘనాఘనా అనే నామం స్మృతికి వస్తుంది. సరే- అటువంటి రామపత్ని కనబడటంలేదు. స్వామి దుఃఖాభిహతుడైపోయేడు. ఆ తరువాత నెమ్మదించేడు. బయలుదేరి-
అససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం
ప్రాకారేణార్క వర్ణేన భాస్కరేణాభి సంవృతమ్
ఇక్కడ స్వామి లక్ష్మీవంతుడైనాడు.సంయమనం మనోబల రూపైశ్వర్యం స్వామి కార్య మందలి దీక్ష ఆయన్ని లక్ష్మీవంతుని చేసేయి. ఇక్కడ కూడా మహర్షిఅనాహత లక్షణాన్ని సూచిస్తున్నారు. అర్కవర్ణం అంటే 12 వర్ణాలు. ఈ పద్మానికి నాభిస్థానం. వాయుతత్త్వాన్ని కలిగి ఉంటుంది. ఈ భాగం సౌరఖండం.అందుకే ‘భస్వరేణ’ అన్నారు. ఇదీ స్వామి ప్రదేశం. సరే అనే్వషిస్తున్నాడు.
అంతఃపురంలో వున్న రావణ గృహాలనన్నిటిని చూస్తున్నాడు. మహాపార్శ్వుడు కుంభకర్ణుడు విభీషణుడు ఇంద్రాజిత్తు మొదలైన రాక్షశ్రేష్టులనన్నిటిని దాటుతున్నాడు. ఇలా దాటి దాటి సాధకుని మనో మయకోశం వంటి పుష్పక విమానాన్ని చేరేడు.
సవేశ్మ జాలం బలవాన్ దదర్శ
వ్యాసక్త వైఢూర్య సువర్ణ జాలం
యధా మహత్ప్రావృషి మేఘజాలం
విద్యత్పినద్ధం స విహంగ జాలమ్
ఈపుష్ప విమానాన్ని చూస్తున్న స్వామి బలవంతుడట. ఇది శరీర బలం కాదు మనోబలం. అది వున్నవాడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళగలడు. సముద్రంలో మైనాకుణ్ణి కాదని ముందుకు వచ్చిన స్వామికే ఇది సాధ్యం.
ఎలా వుంది విమానం
వర్షాకాల మేఘసమూహంలా ఉందట.
దాని కిటీకలకు వైఢూర్యాలు పొదిగేరట.
అందులో మెరుపుల్లా పక్షి చిత్రాలు. అవి ఒక క్షణం ఎగిరినటులంటాయ. మళ్లీ ఆగిపోతాయ.
ప్రధానమైన శంఖాది ఆయుధశాలలు అందులోనే ఉన్నాయి.
ఇక్కడ శంఖ శబ్దం కొన్ని కోట్లను చెప్పే సంఖ్యావాచకం. అలాగే దేవతలు కూడా చూసి ఆగి నమస్కరింపదగిన గృహాలు.
మెరుపులచే అర్బింపబడుతూన్న మేఘంలా- స్ర్తి రత్నాల చిత్రాలు అలంకరిస్తున్నాయి.
ఇంకావుంది...