Others

పుష్యమాస విశిష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది. చైత్ర పౌర్ణిమ రోజున చంద్ర సంచారము చిత్తా నక్షత్రమున అవుతుంది కనుక ఆ మాసానికి చైత్ర మాసమని, విశాఖ నక్షత్రమందు సంచరించుట వలన వైశాఖ మాసమని, ఇలా పనె్నండు మాసాల పౌర్ణమిలలో చంద్రుని సంచారం ఆధారంగా పేర్లను నిర్ణయించారు. చంద్రుడు పూర్ణిమ రోజున పుష్యమి నక్షత్రములో సంచరించే మాసం పుష్యమాసం. పుష్య అంటే పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్యం శీతకాలంలో వస్తుంది. శూన్యమాసమై, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, వివాహాది శుభశోభనాలకు వీలు లేకున్నా, జపతప ధ్యానాదులకు, పితృ దేవతలను పూజించడానికి ఉద్దిష్టమైన మాసమిది. శ్రావణ పౌర్ణమి నుండి పుష్య పౌర్ణమి వరకు వేదాధ్యయయానికి, మంత్రాలు నేర్వడానికి పూర్వకాలం నుండి అనువైన సమయంగా చెప్పబడింది. రైతులకు పంట చేతికి అందేకాలం కనుక ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మిని పూజించడం సనాతన సాంప్రదాయాచరణగా ఉంది. పుష్య మాసాధిపతియైన శని మరియు నక్షత్రాధిపతియైన గురును పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని విశ్వాసం. పుష్య అమావాస్య దినాన శనికి తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శనిబాధ నివృత్తి కలుగుతుంది. వస్త్ర, తిల, అన్నదానాల వల్ల కూడా శని దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. పుష్య పౌర్ణమి స్నానాలు సకల శ్రేయోదాయకాలు. ఉత్తరాయణ పుణ్యకాలం, తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేదీ ఈ మాసంలోనే. సూర్యుడు ధనురాశి నుండి మకరరాశిలో ప్రవేశించేదే మకర సంక్రాంతి. ఉత్తరాయణ కాలంలో తిలధేనుధానాలు, తిల తైలాదులతో శివాలయాలలో దీప దానం, శివారాధనం, శివుని ఘృతముచే అభిషేకించడం మహాఫలం. నల్ల నువ్వులచే అభ్యంగన స్నానం, తిలహోమం, తిలభక్ష్యం, తెల్ల నువ్వులచే దేవ తర్పణం, నల్ల నువ్వులచే పితృ తర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తున్నది. పౌర్ణమి తిథియందు పుష్యమి నక్షత్రంతో చంద్రుని కలయిక పౌషీ పౌర్ణమి. గ్రహాధిపతి సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడంచేత మకర సంక్రమణ అవుతుంది. ఉత్తరాయణంలో సూర్య దేవ, సూర్య కిరణ ఆరాధన చేస్తారు. ఈ పుణ్య కాలాన సూర్యోదయం నుండి ఐదు ఘడియలు (రెండుగంటలు) వరకు విశిష్ట తేజస్సును ప్రసరింపచేసే సూర్య కిరణాలు జీవ చైతన్యాన్ని ఊర్ధ్వముఖంగా ప్రసరింప చేయుటకు తోడ్పడతాయి. మానవ శరీరంలోని వెనె్నముక యందలి విశుద్ధి చక్రము, కంఠ స్థానమునందున్న షోడశ దళ పద్మమునకు, హృదయ స్థానమందున్న అనాహత చక్రమునకు మధ్యన ప్రకాశించే ప్రజ్ఞాకేంద్రము మకర రాశిని సూచిస్తుంది. ఇది మహా విష్ణువు నివాస స్థానం. అనాహత చక్రానికి నారాయణుడు అధిదేవత. అందువల్ల పుష్య పూర్ణిమ నాడు ‘‘ఓం నమో భగవతే వాసుదేవాయ’’ అని ఉపాసించుటచేత సిద్ధిత్వం కలుగుతుంది. మనుస్మృతి, గోభిల మునిచే విరచితమైన ధర్మస్మృతి ప్రకారం శ్రావణ పౌర్ణమి నుండి పుష్య పౌర్ణమి వరకు అభ్యసించిన వేద మంత్రాధ్యయనానికి ముగింపు పలికి, ఇతర విద్యలను మళ్ళీ శ్రావణం వచ్చే వరకు అభ్యసించాలి. పుష్య పూర్ణిమ నాడు వేద మంత్ర ఉత్సర్జనము విధిగా చేసే ఆచారం ఉండేది. తమిళ నాట పుష్యపూర్ణిమను పూసమ్ అంటారు. తైపూసమ్ ఉత్సవాన్ని జరుపుకుంటారు. తంజావూరునందు ఉత్సవాన్ని వైభవంగా ఆచరిస్తారు. కుజదోషము, కాలసర్ప దోషము, సర్పదోషము, వివాహ అలస్యము, నిస్సంతానత్వం మున్నగు వాటికి స్ర్తి పురుషులు శ్రీసుబ్రహ్మణ్య, అంగారక గ్రహారాధనలు సత్ఫలితాలను అందిస్తాయి.

-సంగనభట్ల రామకిష్టయ్య