సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటులనే ముక్తపురుషుల చేతినుండి ధనము నిరాటంకముగా నడచిపోవునే కాని వారు ధనమునెన్నడును నిలువజేసికొనరు.
98. ధనమునకు ఎవ్వడు దాసుగాడో, ధనమెవ్వనికి దాస్యము చేయునో, వాడే నిజమైన మానవుడు. ధనమును సరిగా వినియోగించుకొను టెరుగని వానిని మానవుడనదగదు.
అహంకారరూపమగు మాయ
అహంకారమువలని దోషములు-అహంకారమును జయించుట దుర్లభము. - పక్వాహంకారము: అపక్వాహంకారము - ముక్తునియందలి అహంకారము. అహంకారమువలని దోషములు
99. సూర్యుడు లోకముకంతకును వేడిని వెలుతురును ఇచ్చుచున్నాడు. కాని మబ్బులు క్రమ్మి తన కిరణములను అడ్డగించునపుడు ఏమియు జేయజాలకున్నాడు. అట్లే అహంకారము హృదయము నావరించునపుడు భగవానుడు అందు ప్రకాశింపజాలడు.
100.అహంకారము మబ్బువంటిది. ఇది మనకు భగవంతుని గోచరింపకుండ జేయుచున్నది. సద్గురు కటాక్షమున ఈ మేఘము తొలగెనేని స్వయం జ్యోతియగు భగవానుని సాక్షాత్కారమును బడయవచ్చును. పటమున శ్రీరామచంద్రుని, సీతను, లక్ష్మణుని జూడుము. భగవానుడగు శ్రీరామచంద్రుడు లక్ష్మణునకు (జీవునకు) ముందుగ రెండు మూడడగుల దూరమున మాత్రమే యున్నను సీత (మాయ) వారిరురకును నడుమ నుండుటచే లక్ష్మణునకు శ్రీరామచంద్రుని దర్శనము లభింపకున్నది.
101.ప్రశ్న: అయ్యా! మేమెందుచే ఇట్లు బద్ధులమై యున్నాము? ఎందుచే భగవంతుని గనజాలకున్నాము?
ఉ:జీవుని అహంకారమే మాయ. ఈ తెరయే ఆత్మ ప్రకాశము గప్పుచున్నది. అహంకారము నశించెనా, అన్ని చిక్కులును తొలగును. భగవదనుగ్రహమువలన జీవునకు తాను కర్తగానను జ్ఞానము కలిగెనా, అతడు జీవన్ముక్తుడగును. అనగా ఈ జన్మముననే ముక్తుడగును, భగరహితుడగును.
102. నేనీ గుడ్డను తెరవలె నాకు అడ్డముగా పట్టుకొందునేని ఎప్పటివలె మీకు నేను దావుననే యున్నను మీరు నన్నుగనజాలరు. అటులనే భగవంతుడుమీకుఅన్నిటికంటెను, సన్నిహితుడై యున్నను అహంకారమను తెరవలన మీరు వానిని జూడజాలకున్నారు.
103. అహంకారము నిలిచయుండునంతవరకు ఆత్మజ్ఞానముగాని ముక్తికాని లభింపజాలదు, జనన మరణ బంధము తొలగదు.
104. వంటకై బియ్యము, పప్పు, ఉరలగడ్డలు మొదలగు వానిని చల్లని నీరు గలకుండలో వేసితి మనుకొనుడు. వానిని పొయ్యిమీద బెట్టి ఉడుకబెట్టకుండునంతవరకే గదా వానిని మనము తాకగలము. జీవుని విషయము కూడా నిట్టిదే. ఈ దేహమే ఘటము. ధనము, విద్య, జాతి, వంశము, అధికారము మొదలగునవి బియ్యము, పప్పు, ఉరలగడ్డలు మున్నగువాని వంటివి. అహంకారమే అగ్ని. ఈ యగ్ని చేతనే జీవుడు తాపము పొందుచున్నాడు.
105. వాన నీరు మిట్టపై నిలువక పల్లమునకు బ్రవహించును గదా! అటులనే భగవదనుగ్రహము గర్వముచేమిట్టిపడువారల హృదయమునుండి తొలగిపోవును, కాని అణకువ గలవారి హృదయమున నిలుచును.

ఇంకావుంది...