సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహంకారం చాలా చెడ్డది. అది నిర్మూలము కానిదే ముక్తి లేదు. ఆ లేగదూడను జూడుడు, అహంకారముచే దానికెన్ని యిక్కట్లు వాటిల్లుచున్నవో కనుడు. అది పుట్టిన తోడనే ‘‘హంహై’’ నేనున్నాను’’ అనియరచును. ఫలితమేమి? అది పెద్దదై (ఎద్దై)న యెడల దానిని నాగలికి గట్టుదురు. లేదా బరువులతో నిండినబండ్లకు గట్టుదురు. అవైన యెడల గుంజకు కట్టివేయుదురు. ఒక్కొక్కప్పుడు చంపియు తిందురు.
కాని ఎన్నిదండనల పాలైనను ఆ పశువు అహంకారమును విడువదు. దాని చర్మముతో డోలు చేసినను గూడా ‘హంహం’ నేను, నేను అనియే శబ్దించును. దూదేకులవాడు దాని ప్రేవులను దన వింటినారిగా జేసికొనినప్పుడు గాని అది వినయము నవలంభింపదు. అపుడు ‘తుహై’- ‘నీవున్నావు’ అని గానము చేయును. ‘నేను, నేను’ అను భావము పోయి (పరమేశ్వరా! అంతయు) ‘నీవే’ అను భావము కలుగవలయును. జ్ఞానోదయమైననే కాని ఈ స్థితి ప్రాప్తము కాజాలదు.
107. అహంకారము తొలగి పరతత్త్వమున లయించినప్పుడు ముక్తి లభించును.
108.ప్రశ్న: మానవునకెప్పుడు ముక్తి లభించును?
ఉ. అహంకారము నశించినప్పుడే.
109. ప్రశ్న: నేనెప్పుడు ముక్తుడనగుదును?
ఉ. ఆ ‘నేను’ అనుభావము నీ నుండి తొలగినప్పుడు, ‘నేను, నాది’ అనుకొనుటయే అజ్ఞానము. ‘నీవు, నీది’ అనుకొనుటయే జ్ఞానము. నిజమైన భక్తుడిట్లు భావించును: ‘‘దేవా! నీవే కర్తవు. సకలము నీవే చేయుచున్నావు. నేను నీ చేతిలోని ఉపకరణ మాత్రమును. నీవు ననే్నమి చేయించిన నేను అది చేయుదును. ఈ సర్వము నీ విభూతియే. ఈ యిల్లు, ఈ సంసారము అన్నియు నీవే, నావి కావు; నీ యాజ్ఞానుసారము సేవ చేయుటకు మాత్రమే నాకధికారము కలదు’’.
అహంకారమును జయించుట దుర్లభము
110. అందరి అహంకారములను క్రమముగా తొలగిపోగలవు గాని మహాత్మునకు తన మాహాత్మ్యమును గూర్చిన అహంకారము తొలగిపోవుట దుర్లభము.
111. వెల్లుల్లి రసము పోసియుంచిన గినె్నను వేయిసార్లు కడిగినను ఆ వాసన పోదు అజ్ఞానముచే గలుగుచున్న అహంకారము అంతటి మొండిది. దానిని తొలగించుకొనుటకెంతటి విశ్వప్రయత్నము చేసినను అది పూర్తిగా తొలగిపోదు.
112. అజీర్ణరోగి పులుపు వస్తువులు తనకు హానికరములని బాగుగా ఎరుగును. కాని అవి వాని కండ్లకగుపడిన చాలును, నోరూరును. చేరిక యొక్క ప్రభావము అట్టిది. అటులనే ‘నేను, నాది’ అను భావము నెంతగా అణచివేయ బ్రయత్నించినను కర్మరంగంలోనికి దిగినంతనే అపక్వపుటహంకారము తలఎత్తుచునే యుండును.
113. అహంకారమును నిర్మూలించి సమాధి స్థితిని సాధింపగల్గువారు అరుదుగా నుందురు. సాధారణముగా అది పోనే పోదు. విధి విరామములనునవి లేక నీవెంత విచారము చేసినను ఈ అహంత మరల మరల తల ఎత్తుచునే ఉండును. రావి చెట్టును ఈనాడు మీరు నరికివేసిమితి గదా అనుకొనిన, మరునాడే చిగుర్చుచున్నది.
ఇంకావుంది...