సబ్ ఫీచర్

కృషితోనే కలలు సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్లలో తిరగాలి. డూప్లెక్స్ ఇల్లు కట్టాలి. విమానాల్లో ప్రయాణించాలి, విదేశాల్లో తిరగాలి- ఇలాంటి కలలు కనడం తప్పుకాదు. కలలు కనాలి, ఆ కలల్ని సాకారం చేసుకోవాలి. అందుకోసం పట్టుదలతో ప్రయత్నించాలి.అతిగా ఊహించకూడదంటారు. కానీ ఊహలైనా ఉన్నంతగా లేకపోతే మనం ఏదైనా సాధించగలమా?
.........................
ఉన్నదాంట్లో సంతృప్తి చెందుతామనే సూక్తిని ఇప్పుడెవరూ పట్టించుకోవటంలేదు. లభించిన దాంతో సంతృప్తి చెందితే అక్కడ ఆగిపోతారు. ఇంకా చెప్పాలంటే ఎదుగూ, బొదుగూ లేకుండా బోన్సాయిలా ఉండిపోతారు. సంపద విషయంలో ఇది మరింత నిజం. ప్రపంచం మారుతోంది. అందుకు అనుగుణంగా అవసరాలు మారుతున్నాయి.
మన దేశంలో ఫోన్ల అవసరం గురించి ఇప్పుడెవరికీ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవం మనుషుల జీవితంలో పెనుమార్పులు తెచ్చింది. అందుకే సెల్‌ఫోను అవసరం ఇప్పుడు తప్పనిసరి అయింది. ఇదొక్కటే కాదు లాప్‌టాప్, ఇంటర్‌నెట్, హోం థియేటర్లు, కార్లు లాంటివి మన జీవితంలో భాగమవుతున్నాయి. ఒకప్పుడు వీటి గురించి కలలైనా కనలేని మధ్యతరగతి వర్గం ఇప్పుడు వాటిని స్వంతం చేసుకునే దిశగా పరుగులు తీస్తోంది.
మనం ఎంచుకునే జీవన విధానాన్ని బట్టి మన అవసరాలుంటాయి. ఒక స్థాయికే తృప్తి చెందితే మనిషి అక్కడ ఆగిపోతాడు.
చిన్నప్పుడు ఆకాశంలో విమానం వెళుతుంటే అదిగో విమానం పోతుంది అని చెప్పుకుని మురిసిపోయినట్టు నలభై యాభై ఏళ్ళు దాటినా అలాగే ముచ్చటపడాల్సి వుంటుంది. అయితే విమానం ఎక్కాలనే కలని సాకారం చేసుకోవటం అసాధ్యమేమీ కాదు.
జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనే కోర్కెని నెరవేర్చుకోవడం నెలకు యాభై వేల రూపాయల ఆదాయం గలిగినవారికి అసాధ్యమేమీ కాదు. అయితే ముందుగా విమానం ఎక్కాలనే కలగనాలి.
ఆధునిక జీవితం ప్రసాదిస్తున్న అవకాశాల్ని, అవసరాల్ని అందిపుచ్చుకోవాలంటే డబ్బు సంపాదించాలి. దీనర్థం అక్రమంగా సంపాదించమని కాదు, సక్రమంగా సంపాదించడానికి అవకాశాలున్నాయి. వాటి గురించి శోధించాలి. కెరీర్‌ని చక్కదిద్దుకోవాలి. చేస్తున్న ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో సంతృప్తి చెందకుండా మరింత కష్టపడాలి. ముఖ్యంగా నెలసరి జీతాలమీద ఆధారపడిన వారి జీవితాలు ఎదుగు బొదుగు లేకుండా ఉంటాయి. కాబ ట్టి తమకు అధిక సంపాదన ఉండే మరో మంచి ఉద్యో గం కోసం ప్రయత్నించాలి. ఉన్న వృత్తిలోనే కెరీర్‌ని పెంచుకోవడమెలానో ప్రయత్నించాలి. మంచి ఉద్యోగం కోసం వేరే కోర్సు లు చేయాలి. తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలి. సంపదలు వాటంతటవే పెరగవు. ఉన్న కెరీర్‌లోనే తమ ప్రతిభని చాటుకుంటూ యాజమాన్యం అప్పగించే కొత్త బాధ్యతలు నెరవేరుస్తూ సంపాదించుకునేందుకు ప్రయత్నించాలి.
అలాగే తాము చేస్తున్న వృత్తికి అనుబంధంగా వేరే పనులు చేస్తూ సంపాదించే అవకాశాల గురించి ఆలోచించాలి. వ్యాపారం చేయడమో, సొంతంగా ఒక సంస్థని నిర్వహించడమో చేసేవారైనా సంపద పెంపుకోసం గల అవకాశాల్ని పరిశీలిస్తే కనిపిస్తాయి. వీటన్నింటికి ముందు సంకల్పం ఉండాలి. ఉన్నచోటనే నిలిచిపోతామా, సంపాదిస్తూ జీవితాన్ని అనుభవిస్తామా! అనేది తేల్చుకోవాలి. ఏదో ఒక ఉద్యోగం దొరికింది చాలనుకుని సంతృప్తిచెందితే అక్కడే ఆగిపోతారు. అలా కాకుండా తమ కెరీర్‌ను పెంపొందించుకునే దిశగా కృషి చేస్తే తగిన ఫలితాలు పొందుతారు.
ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. జీవించడానికి సంపాదన అవసరం. అయితే సంపదకోసం జీవించకూడదు. ఈ రెండింటినీ గుర్తుపెట్టుకుని సరైన దిశగా అడుగులు వేస్తే కలల్ని సాకారం చేసుకోవడం సాధ్యం.

- పి.ఎం.సుందరరావు