సబ్ ఫీచర్

సరిహద్దు రక్షణ సైనికులది.. రాజకీయ రక్షణ ఓటర్లది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశాన్ని నిర్వీర్యం చేసి వారివారి సిద్ధాంతాలను, మతాలను వ్యాపింపచేయాలని మూడు రకాల శక్తులు తీవ్రంగా పనిచేస్తున్నాయ. ప్రపంచంలోనే అధిక జనాభాగల చైనాతో మావోయిస్టులు- మార్క్సిస్టులతో సంబంధం కొనసాగిస్తున్నవారు. క్రైస్తవ దేశాల క్రైస్తవ మిషనరీల నుండి అండదండలు పొందుతూ ఉన్న క్రైస్తవ మత ప్రబోధకుల, ఇస్లాం మతం ప్రబోధకుల ఉపన్యాసాలకు మతి చలించి వారితో సంబంధం పెట్టుకున్న జీహాదీలు.
భారతదేశం వేల ఏళ్లుగా కులాల ప్రాతిపదికనే కొనసాగటం భారత జాతీయ నిష్ఠకు నిదర్శనం. కాని స్వాతంత్య్రం పొందిన తరువాత స్వపరిపాలన, సుపరిపాలనతో విదేశీయుల పాలనలో అంతమొందించబడిన ఆర్థిక వ్యవస్థను, సామాజిక, సాంస్కృతిక, విద్యావ్యవస్థలను పునరుద్ధరించుకొనుటకు ఏర్పాటుచేసికొన్న అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. కాని ఇట్టి రాజ్యాంగం విదేశీ మతాల భావజాలానికి, విదేశీయుల కనుసన్నలలో విదేశాలలో విద్యనభ్యసించిన విద్యావంతులచేత ఏర్పాటుచేయనైనది.
జ్ఞానం అనేది జన్మపొందిన ప్రతి ప్రాణికి ఉంటుంది. కాని విజ్ఞానం మాత్రం విద్య ద్వారానే సాధ్యవౌతుంది. జ్ఞానికి, విజ్ఞానికి అస్థిత్వం అనేది ప్రధానం. అస్థిత్వం అనేది ఆయా వ్యక్తులు జన్మించిన జన్మభూమిలోని అనాదిగా వస్తున్న, కొనసాగుతున్న సంస్కృతి ద్వారా మాత్రమే సాధ్యవౌతుంది. అట్టి సంస్కృతినే జాతి లేదా జాతీయత అంటాము. ప్రపంచంలోని అనేక దేశాలలో జాతి వ్యక్తులవల్ల ఏర్పాటైంది. ఎందుకంటే పూర్వం వారు ఉండే ప్రాంతంనుండి జాతినుండి కొన్ని అనివార్య కారణాలవల్ల వారినుండి దూరం కావలసి వచ్చినప్పుడు, వారిని అణగత్రొక్కబడుతున్న వారికి ఎదురొడ్డే వారికి నాయకత్వం వహించి అట్టి బృందానికి విముక్తికలిగించి వారిని ప్రత్యేక తెగవారిగా నామకరణం చేసి వారికి ప్రత్యేక అస్తిత్వం కలిగించిన వారు ఆ తెగవారికి జాతిపితగా మారుతున్నారు. అట్టి జాతి భాషా ప్రాతిపదికనగానీ, భౌగోళిక పరిస్థితుల కనుగుణంగా గానీ, పూర్వం వున్నవారి సంస్కృతిలో కొంత మార్పుచేసికొని నూతన జాతులు అనేకం ఏర్పడ్డాయి. అట్టి జాతులవారికి ఒక మతం కావలసి వస్తుంది. అట్టివారు నూతన సిద్ధాంతాలను, పద్ధతులను, ఆచార వ్యవహారాలను ఏర్పాటుచేసికొని దానిద్వారా వారి ఉనికిని కాపాడుకొనుటకు జనబాహుళ్యాన్ని పెంచుకొని జన సంఖ్య ద్వారా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొనుటకు ఆధిపత్యపోరు ప్రారంభిస్తారు. ఇది రెండు రకాలుగా చేస్తుంటారు. ఒకటి మతం ఆధారంగా, రెండు అధికారం ద్వారా సాధించే ప్రయత్నం చేస్తుంటారు.
క్రీ.శ.712లో ఆక్రమణదారులైన ఇస్లాంలు భారతదేశంపై విజయం సాధించారు. వీరి తరువాత పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి వీరి వెనువెంట బ్రిటన్‌వారు మన దేశానికి వచ్చినవారే. వీరందరు ఆక్రమణదారులు, దోపిడీదారులే తప్ప వలసవాదులు కాదు. వీరిలో ప్రతి ఒక్కరు వారివారి స్థాయిలలో భారతదేశ సంపదను దోచుకున్నారు. అంతటితో ఆగకుండా వారివారి మతాలను, భాషలను, సంస్కృతిని భారతీయులపై ప్రతిష్ఠించడానికి వివిధ రకాలైన అకృత్యాల ద్వారా వారు మొదటిగా రాజ్యాల ఆక్రమణ, దేవాలయాల విధ్వంసం, విద్యాలయాలు, వ్యాపార కేంద్రాల ఆక్రమణ, భారతీయ ఇతిహాసాల వక్రీకరణ, భారతీయ భాషల స్థానంలో వారివారి భాషలను ప్రవేశపెట్టుట జరిగింది. అదే క్రమంలో మసీదులను, చర్చీలను నిర్మాణం చేశారు. వాటి నిర్వహణ పేరుతో లక్షల ఎకరాల భూములను కేటాయించి వారి మతాల ఆస్తులుగాను చిత్రీకరించారు. ఇస్లాం మతస్తులకు, క్రైస్తవ మతస్తులకు స్మశాన వాటికలకు లక్షల ఎకరాలు భూములను కేటాయించి, భారత భూభాగాన్ని ఇస్లాం, క్రైస్తవ మతాలవారు కబ్జాచేసుకున్నారు.
ఇరవై ఎనిమిదవ కలియుగం 5120 సంవత్సరాలని చెప్పుకుంటున్న భారతీయుల జీవిత కాలం 196 కోట్ల సంవత్సరాలని చెప్పుకుంటున్న భారతీయుల సంస్కృతి జీవన విధానం ఈనాటికి కొనసాగుతున్నప్పటికీ 1947 తరువాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆక్రమిత కాశ్మీర్ మత ప్రాతిపదికన భారత భూభాగంనుండి వేరైనప్పటినుండి కూడా భారతదేశంలో దాదాపు 85 శాతం హిందువులున్నారు. భారతదేశంలో గ్రామ స్థాయి నుండి మహానగరాల వరకు హిందువులకు స్మశాన వాటికలు లేవు. గ్రామాలలో ఒకటి రెండు కుటుంబాలు ఉన్న ఇస్లాం మతం, క్రైస్తవ మతాల వారికి మసీదు, ఈద్గ్గా, చర్చి, స్మశాన వాటికలు ఉన్నాయి. హిందువులు మాత్రం వారివారి వ్యవసాయ భూములలో, భూములు లేని వారు గ్రామానికి దూరంగా ఉన్న అడవి ప్రాంతంలో ఎవరికి తోచిన దగ్గర వారు దహన సంస్కారం చేసుకొని చేతులు దులుపుకుంటున్నారు. హిందువులకు మహానగరాలలో స్మశాన వాటికలు ఉన్నా అవి నామమాత్రమే. కాని స్మశాన వాటిక కావాలని కోరుతున్నవారు లేకపోవడం శోచనీయం. భారత ప్రజలలో అస్తిత్వం లేకుండా చేసినవారు భారతీయులకు జాతిపిత అయినారు. ఎన్నికల సందర్భాలలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాత్రం ఇస్లాంలకు, క్రైస్తవులకు మసీదులు, చర్చీల నిర్మాణానికి భూములు, నిధులు సమకూర్చుతామని అలాగే స్మశాన వాటికకు కూడా భూములు కేటాయిస్తామని వాగ్దానాలు చేస్తుంటారు. ఇలా వాగ్దానాలుచేసే రాజకీయ పార్టీలు, నాయకులు ‘సెక్యులరిస్టులు’ వీరికి హిందువుల అవసరాలు కనిపించవు. ఎందుకంటే మేము హిందువులమే కాబట్టి హిందువుల ఓట్లు మాకెలాగూ వేస్తారనేది వారి ప్రగాఢ నమ్మకం. అంతేకాదు వివిధ రకాల తాయిలాలు వ్యక్తిగత లాభాపేక్షకు ఉపయోగపడేవి అందిస్తామంటారు. వ్యక్తిగత లాభాపేక్షకే పరిమితమైన హిందువులు సామూహికమైన, సమాజహితమైన అభివృద్ధిని మాత్రం కోరుకోరు. సామూహిక, సమాజహితమైన అభివృద్ధిచేసే రాజకీయ పార్టీలను ప్రజలు గుర్తించటంలో పొరబడుతున్నారు. ఆదరించినా తాత్కాలికమే! వ్యక్తిగత, తాత్కాలిక తాయిలాలూ మాత్రమే అభివృద్ధిగా భావించడం స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి ఈనాటివరకు అదే కొనసాగుతున్నది. 2018 డిసెంబర్ 7నాటికి ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో వివిధ పార్టీల నాయకులు చేసిన వాగ్దానాలన్నీ వ్యక్తిగతంవి మాత్రమే తప్ప రాష్టహ్రితం, సమాజహితానికి సంబంధించినవి నామమాత్రమే.
ప్రపంచంలో లేని పథకాలను ఆవిష్కరించడంవల్లనే తెలంగాణా ప్రజలు గుర్తించి పట్టం కట్టినారని చెప్పే పెద్దమనిషి ఇండ్లులేని బీదలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి కేంద్రంనుండి వచ్చిన నిధులను ఉపయోగించలేక బీదలకు చేసిన నష్టాన్ని ప్రజలు ముందుంచకుండా అత్యధిక మెజారిటీ సాధించిన కారణాన వచ్చే సాధారణ ఎన్నికలలో బిజెపి, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుచేస్తానని చెప్పడం హాస్యాస్పదం కాదా? తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూటమి ఏర్పాటుచేసి తననుతానే కాకుండా కూటమినే బొక్కబోర్లవేసి కేంద్రంలో చక్రం తిప్పుతానంటున్న చంద్రబాబు ముందు తన పాలనలో ఉన్న తన రాష్ట్రంలో తిరిగి ప్రభుత్వాన్ని సాధించగలనని బిజెపి యేతర కూటమి ఏర్పాటుచేయగల సమర్థత ఉన్న వీరు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు హామీ ఇవ్వగలడా? ఒకవైపున రాష్ట్రాన్ని దోచుకుంటూ ఏసుప్రభువు దయవల్ల పిలుపు ఇవ్వగానే 35వేల ఎకరాల భూమిని రైతులు ఏమి ఆశించకుండా రాజధాని నగర నిర్మాణానికి ఇచ్చినారంటూ బహిరంగ సభలలో మాట్లాడటం సామాన్య ప్రజలలో మత విశ్వాసాలను నాటడం కాదా? భూములను త్యాగంచేసిన వారేమో హిందువులు. కొనియాడుతున్నదేమో ఏసుప్రభువును. ఇదే చంద్రబాబు రాజకీయ అనుభవం. మరోవైపేమో మా రాష్ట్రానికి నరేంద్రమోదీ నిధులు ఇవ్వకుండా మోసం చేసినాడని వాపోతుంటాడు. ఇచ్చిన నిధులకేమో లెక్కలు చెప్పడు. రాష్ట్ర అభివృద్ధిని పక్కకుపెట్టి ముస్లింల మసీదులకు, ఇమామ్‌లకు వారి పిల్లల విదేశాల చదువులకు కోట్ల రూపాయలు ప్రకటించినాడు. వీటి ప్రచారానికి ఎలక్ట్రానిక్ మీడియాకు లక్షలు ఖర్చుపెట్టడం అంత అవసరమా?
మిజోరాం రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు స్థానాలకే పరిమితమైందంటే మిజోరాం రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదనేదే కదా? వీరిని ఎన్నుకుంటే దేశానికేం చేస్తారనేది దేశ ప్రజలకు తేటతెల్లమైంది. మధ్యప్రదేశ్‌లోను, రాజస్థాన్‌లోను స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేని ఇతరులపై ఆధారపడిన కాంగ్రెస్ వాపును చూసి బలుపుగా మురిసిపోతున్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే కాంగ్రెస్ ఓటమిపాలైన బిజెపి కంటే తక్కువ ఓట్లువస్తే ప్రజలు వారి పక్షాన ఉన్నట్లు ఎట్లైతదో చెప్పలేరు. ఐదు సంవత్సరాలకొక పర్యాయము ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ కొనసాగుతున్న రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపు విశేషమా? ఇక చత్తీస్‌గఢ్ గెలుపంటారా? అర్బన్ నక్సలైట్లు, క్రైస్తవ మిషనరీల అంతర్గత అండదండలనేది బహిరంగ రహస్యమే కదా! రమణ్‌సింగ్ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేయలేదని అక్కడి ప్రజలు ఒక్కరుకూడా చెప్పరు.
రాబోవు సాధారణ ఎన్నికలలో దేశ ప్రజలు ప్రలోభాలకు, మోసాలకు, సెంటిమెంట్లకు లోనుకాకుండా, వ్యక్తిగత లాభాపేక్ష ఆశించకుండా, సామూహిక అభివృద్ధి ఆశిస్తూ, దేశ భద్రత, అవినీతి నిర్మూలన, అన్ని రంగాలలో అభివృద్ధి, యువకులకు ఉపాధి, స్ర్తిల, రైతుల సంక్షేమము ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’ చేయగల సమర్థవంతమైన, నిజాయితీపరుడైన, కఠోర పరిశ్రమ, నిరంతరం దేశహితంకొరకు పనిచేసే ప్రధానమంత్రిని దేశానికి అందించే పార్టీనే గెలిపించడం ప్రజల విజ్ఞత.

-బలుసా జగతయ్య.. 90004 43379