సబ్ ఫీచర్

అహంకారం వల్లే అజ్ఞానం ( పురాణ వ్యక్తులు - పూర్వజన్మలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మ చిరునవ్వుతో పుట్టిన వారు గిట్టక మానరు కదా అన్నాడు.
కానీ నీ కోరిక కాలాంతరంలో తీరుతుందిలే అని చెప్పాడు. అంతే బ్రహ్మ ఇచ్చిన వరబలంతో కాలనేమి చాలా అకృత్యాలు చేశాడు. సజ్జనులను హింసించాడు. చివరకు కాలనేమి తన జీవితాకాలం అంతమవడంతో తిరిగి ఉగ్రసేనుడు, పద్మావతి అనే దంపతులకు కంసుడుగా పుట్టాడు.అతనికి కాస్త పూర్వజన్మ జ్ఞానం ఉంది. తనను చంపడానికి మహావిష్ణువే వస్తాడు అని జ్ఞప్తి చేసుకొన్నాడు. ఆ మహావిష్ణువు నుంచి తప్పించుకోవాలని నానాయాతనలు పడేవాడు.
ఒకసారి జరాసంధుడను రాజు తన మృగయావినోదం కోసం అడవికి వెళ్లాడు. కూడా కువలయాపీడనమే మత్త్భాన్ని తీసుకొని వెళ్లి అతి బలవంతమైన ఆ మత్త్భాన్ని తన శిబిరం దగ్గర కట్టేసుకున్నాడు.
ఆ కువలయాపీడనం మావటివాని మాట వినక తన తాళ్లను తెంచుకుని చుట్టుపక్కలను నాశనం చేస్తూ పరుగెత్తి వెళ్లింది. ఆ కువలయాపీడనం చివరకు కంసుడు మల్లయుద్ధం చేసేదగ్గరకు వచ్చి నిలిచింది. దాన్ని చూడగానే కంసునిలోని మహాశక్తి ఉవ్వెత్తున ఎగిసిపడింది. వెంటనే కంసుడు ఆ ఏనుగు తొండం పట్టుకుని గిరగిరా తిప్పి విసిరికొట్టాడు. కంసుని బలపరాక్రమం వల్ల ఆ ఏనుగు గింగిరాలు తిరిగి తిరిగి జరాసంధుని శిబిరం దగ్గర పడిపోయింది.అది చూసిన జరాసంధుడు నేనే బలశాలి అనుకొంటే నా కన్నా బలవంతుడెవడు? ఈ కువలయాపీడనాన్ని మర్దించాడు అనుకొని విచారించి కంసుని గురించి తెలుసుకొని స్నేహం చేశాడు. కంసుడు కూడా తనకన్నా బలవంతులైన వారు ఉండకూడదనే స్థిరనిశ్చయంతో ఉన్నవాడు కనుక జరాసంధుడినే స్నేహితుడినే కాదు బంధువును కూడా చేసుకొన్నాడు. జరాసంధుని కూతుర్లు అయిన అస్తి, ప్రాప్తి అనే ఇద్దరినీ తానువివాహం చేసుకొన్నాడు.
ఒకనాడు బలగర్వంతో ఋష్యమూక పర్వతం పైకి వెళ్లాడు. అక్కడ కేశి అనే అశ్వముఖుడైన రాక్షసునితో ఘోరంగా పోరాడాడు. అతనితో పోరాడుతూ మహేంద్రగిరిపైకి వెళ్లాడు. కేశిని గెలిచాడు. ఆ ఆనందంలో మహేంద్రగిరి ని పలుమూరు ఊగించాడు. కదిలించివేశాడు. అట్లా కదిపే సమయంలో అక్కడ పరశురాముడు శివుని ధ్యానంలో ఉన్నాడు. మహేంద్రగిరి భుజశక్తితో అవివేకంతో కదుపుతున్న కంసుని చూసి కోపోద్రికంతో ‘ఓరీ కంసా! నీవు నీకున్న బలాన్ని చూసుకొని అహంకరిస్తున్నావు. నిన్ను నిర్జించేశక్తి వస్తోంది. నీకు మరణం తప్పదు’అని శపించాడు. పైగా పరశురాముని దగ్గర ఉన్న ఏడు తాళ్లపొడువు లక్ష పుట్ల ఇనుప ధనుస్సు ఉంది. దీనిని త్రిపురాసుర సంహారం కోసం మహావిష్ణువు పరమశివునికిచ్చాడు. పరమశివుడు పరశురామునికి అనుగ్రహించాడు. ఆధనస్సును కంసుని కి చూపిస్తూ ‘‘ ఓ కంసా! దుర్జనుడా! దీనిని నీవు ఎక్కుపెట్టు. లేకుంటే నిన్ను నేను నిర్జిస్తాను’’ అని అన్నాడు. వెంటనే కంసుడు అమితోత్సాహాలతో ఆ విల్లును ఎక్కుపెట్టపోయి పరాజితుడయ్యాడు. పరశురాముని శరణుకోరాడు.అపుడు ఆ పరశురాముడు దీనిని ఎక్కుపెట్టిన వాడు నిన్ను కూలదోస్తాడు తెలుసుకో అని కంసుని హెచ్చరించాడు.
మరణభయం ఉన్న కంసుడు ఆ ధనస్సును ఐదువేలమందిని నియోగించి తన దగ్గరకు తెప్పించుకుని చతుర్దశినాడు ఆ ధనుస్సును పూజించి ఆ ధనస్సును పెట్టడానికి ధనుశ్శాలలో బంగారు వేదికను నిర్మించి దానిపై బంగారు దారాలతోఅల్లికలను నేర్పించి దానిని కట్టుదిట్టంగా చేసి భద్రపరిచాడు.
ఇంతా చేశాడు కాని మరణ భయం మాత్రం కంసుని వదలలేదు.పైగా దేవకీదేవికి వసుదేవునితో పెళ్లి చేసి తన అత్తవారింటికి పంపుతుండగా ఆకాశవాణి దేవకీదేవి అష్టమ సంతానం నీకు మృత్యుదేవత అని కంసుని మరణవార్తను చెప్పింది. దానితో మరింత భయకంపితుడైన కంసుడు దేవకీవసుదేవులను చెరసాలలో పెట్టించాడు. వారికి పుట్టిన ఆరుగురు శిశువులను శిశుప్రాయంలోనే సంహరించాడు. ఏడవగర్భాన్ని పరమాత్మ రోహిణీదేవి గర్భంలోకి ప్రవేశపెట్టాడు. దానితో ఏడవ గర్భం దేవకీదేవికి విచ్చితి జరిగిందనుకొన్నాడు కంసుడు ఇప్పుడు పుట్టబోయే వాడు ఏడవ వానిగా లెక్కపెట్టాలా లేక ఎనిమిదవ వానిగా లెక్కపెట్టాలో అర్ధం కాక కంసుడు సతమతమవుతున్నాడు.
అంతలో శంఖచక్రగదాపద్మయుతుడు అరవిందదళాయ తాక్షుడు దేవకీవసుదేవులకు పుట్టనే పుట్టాడు. మాయామానుషవిగ్రహుడైన ఆ పరమాత్మ యశోదమ్మ ఒడిని కూడా చేరాడు. అక్కడ ఎందరినో శత్రువులను హతమార్చాడు. వీరాధివీరునిగా పేరెన్నిక గన్నాడు. ఆ సంగతి రేపల్లెలో నందనందనుడు వీరాధివీరుడుగా పేరు తెచ్చుకుంటున్నాడని. పరమాత్మ మాయలు ఎంచడం ఎవరికి తరము అని వెంటనే ఆ నందనందునుడిని చూడాలనుకొన్నాడు. వెంటనే అక్రూరుని పంపి శ్రీకృష్ణుని బలరామ సమేతంగా తీసుకొని రమ్మన్నాడు. అక్రూరుడు బయలుదేరి వెళ్లాడు.
నిజమే కదా! పరమాత్మ నిర్ణయించిన తరువాత మృత్యువు అయినా, జన్మయైనా ఎవరు గతి తప్పేట్టుగా చేసేది? సర్వవ్యాపి, సర్వోత్తముడైన పరమాత్మ తత్వాన్ని ఎరుకపర్చుకోలేని అధములు నేనంటే నేనే అనే అహంకారంతో విర్రవీగి వీగి చివరకు తోకముడిచి పరమాత్ముని శరణు వేడక తప్పదు కదా. పాపరాశి భస్మీపటలం అవగానే ఆ పరమాత్మ ఆ జీవులను కరుణించి తనలో ఐక్యం చేసుకొంటాడు కదా. అట్లానే నేడు కంసుడు తన మృత్యువును తానే రమ్మని పిలిచాడు. అదీ ఎందుకంటే వైరభక్తితో కృష్ణ నామాన్ని వదలక నిరంతరం జపిస్తూనే ఉన్నాడు కదా. మరేమి నిత్యమూ కృష్ణనామాన్ని పఠించిన వారికి వారు ఎవరైనా సరే వారి పాపరాశి లేశమాత్రం ఐనా మిగలకుండా నాశనమయి తీరుతుంది కదా. అటులనే నేడు కంసుడు తన మల్లయుద్ధవిశారదులైన సేవకాగణాన్ని చూసుకొని ఆ దేవాదిదేవుడిని ఆది అంతం లేనివాడిని, అవ్యయుడిని, అనిత్యుడిని, అవ్యక్తుడిని వ్యక్తునిగా రమ్మని పిలిచాడు.
రమ్మని వారిని నిరాశపర్చకుండా దేవుడు తనంతటతానే దిగివస్తాడనే నిజాలెన్నో చరిత్రలో దాగి ఉన్నాయి కదా. అట్లానే బలరామ కృష్ణులు వచ్చారు. ధనుశ్శాలను అడిగి మరీ తెలుసుకుని ఆ లక్షపుట్ల ధనస్సును చిరునవ్వుతో చూశారు. ఆ ధనస్సును కృష్ణయ్య ఎత్తి ఎక్కుపెట్టి ఆ వింటినారిని తన చెవి వరకు లాగాడు. అంతే ఆ లక్షపుట్ల ధనువు ఒక్కసారిగా పుట్టుకున లక్షపుట్లగా విరిగిపోయింది. ఆ సంగతి కంసుని తెలిసింది. అంతే నరనరంలోను తన మృత్యువు పొడ చూసి గజగజా వణికి పోయాడు. కానీ మల్లయుద్ధ నిపుణులవల్ల పరమాత్మను ఢీకొనొచ్చునేమో అని ఆశపడి మల్లయుద్ధరంగాన్ని తీర్చి దిద్దమన్నాడు.
కోరికలను కాదనుడు కదా కృష్ణయ్య. అలానే ఆ మల్లయుద్ధ మంటప ప్రదేశానికి వచ్చాడు. అక్కడ కువలయపీడనాన్ని పీడించి సంహరించాడు. చాణూర ముష్టికులను సంహరించారు.
అట్లా అందరినీ హతమార్చే ఆ పురుషపుంగవులను చూడగానే కంసుడు పిచ్చివాడై ప్రేలాపనలు చేశాడు. తన తండ్రిని కూడా దుర్బుద్ధిగలవాడుగా ఎంచి వృష్టి వంశీయులందరినీ హతమార్చమని అరిచాడు.
ఆ మాటలను విన్న వెంటనే శ్రీకృష్ణుడు ఎగిరి కంసుని ఎదుటికి దూకాడు. ఆ దివ్యవిగ్రహాన్ని చూసి కంసుడు అచేతనుడైయ్యాడు. కంసుని రెండు చేతులతో పట్టుకొని గిరగిరా త్రిప్పి నేలకేసి మోదాడు. అంతే వైరభావంతోనైనా వదలక కృష్ణనామాన్ని జపిస్తూనే ఉన్నాడు కదా. నిరంతరం ఏ దిక్కునుంచి ఆ మహావిష్ణువు ఏరూపంతో వచ్చి నన్ను హతమారుస్తాడో అని ఎదురుచూశాడు కదా. అందుకే ఆ దివ్యక్షణంలో కంసునిలోని జీవాత్మ కృష్ణపరమాత్మలో కలసిపోయింది. సజ్జనులంతా ఆనందించారు. అట్లా కంసుడు తన పూర్వజన్మయైన కాలనేమి వాసనను కూడా వదుల్చుకుని పరమాత్మలో లీనమైయ్యాడు.
ఇంకావుంది...

- డా. రాయసం లక్ష్మి. 9703344804