సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

136.శ్రీగురుదేవుడొకప్పుడు తన శిష్యులలో నొకనిని విలాసముగానిట్లు ప్రశ్నించెను. సరే కాని నాకేమైనా శరీరాభిమానమున్నట్లు నీకు తోచుచున్నదా? నాకు అభిమానమేమైనా గలదా?
శిష్యుడు:ఔనండి, కొంచెమున్నది. కాని రుూకొంచెము ఇందు నిమిత్తము ఉన్నదని నా అభిప్రాయము. 1.శరీర రక్షణార్థము 2.్భగవద్భక్తి సాధన నిమిత్తము, 3.్భక్తులతో సాంగత్యముకొరకు 4.ఇతరులకు తత్త్వము నుపదేశించుటకును. ఐనను భగవానుని మీరెంతయో బతిమాలుకొని, లేశమైనా రుూ అభిమానమును నిలుపుకొనిరని చెప్పవలసియున్నది. అనగా మీ ఆత్మ యొక్క నైసర్గిక స్థితిని సమాధియను మాట చేతనే అభివర్ణింపనగునని నా భావము. కాబట్టి మీకు గల అభిమానులు మీ ప్రార్థన యొక్క ఫలమని చెప్పెదను.
గురుదేవుడు:నిజమే కాని నావలన కాదది నిలిచియుండుట, అలా జగజ్జననివలన ప్రార్థన నంగీకరించుట నా జగజ్జనని దివ్యచిత్తము.

ఐదవ ప్రకరణము

గ్రంథములు గ్రంథులు

కేవల పుస్తక పాండిత్యము నిష్ప్రయోజనము
137. ఒకనాడు కేశవచంద్రసేనుడు దక్షిణేశ్వరాలయముననున్న శ్రీరామకృష్ణుని సందర్శించి యిట్లు ప్రశ్నించెను:
‘‘పండితులు పెట్టెలకొలది గ్రంథములను జదివియు నిజముగా పారమార్థిక విషయమునకు వచ్చుసరికి పరమ పామరులై యుండుటకు కారణమేమి?’’
శ్రీగురుదేవుడిట్లు సమాధానమొసగెను: ‘‘గద్దలును రాబందులును ఆకాశమున ఎంతయో ఎత్తునకెగురును గదా? కాని వాని కన్నులు మాత్రము క్రుళ్లి కంపుగొట్టుచుండు శవములను వెదకుచు మురికి గుంటలమీదనే నిలిచియుండును. ఆవిధముగనే ఎన్ని శాస్తమ్రులు చదివినను, ఎంత పాండిత్యము సంపాదించినను, పండితంమన్యుల మనస్సు కామినీ కాంచనములను ఐహిక విషయములందే లగ్నమై యుండును. అందుచే వారికి బ్రహ్మజ్ఞానము అలవడదు’’.
138. అంతఃకరణమును శుద్ధి చేయు విద్యయే విద్య, మిగిలినదంతయు అవిద్య.
139.కేవళ గ్రంథ పాండిత్యమువలన ప్రయోజనమేమి? పండితులు వందల కొలది శ్లోకములను ఏకరువు పెట్టవచ్చును. కాని వానిని ఊరక వల్లించిన మాత్రమున లాభము లేదు. శాస్తమ్రులందలి తత్త్వములు జీవితమున ఆచరణలోనికి రావలయును. కామినీ కాంచన మోహితుడై సంసార బద్ధుడై యున్నంతవరకు-కేవల శాస్త్ర పఠనమువలన జ్ఞానముగాని, ముక్తిగాని లభింపజాలదు.
140. మన పండితంమన్యులు మహాడాంబికముగా మాటలాడెదరు. బ్రహ్మయని, బ్రహ్మమని, అవ్క్తమని, జ్ఞాన యోగమని, తత్త్వశాఅస్తమని, వేదాంతమని! యేమేమో పలికెదరు. కాని వాని యొక్క అనుభవమును బొందినవారు మాత్రము పూజ్యమనియే చెప్పవచ్చును. వారు కేవలము శఉష్క హృదయులు, సారహీనులు.
141. ‘స, రి, గ, మ, ప, ద, ని’ అని ఊరక నోటితో అనుట తేలికయే, కాని వానిని ఒక వాద్యము మీద పలికించుట కష్టము. అటులనే మత ధర్మములను గురించి మాటలాడుట సులభమే, కాని ఆచరించుట దుర్లభము.
142. చిలుక రాధాకృష్ణ నామమును బలుకుచుండును; కాని పిల్లినోట చిక్కినపుడు కీచుకీచుమను. అపుడు దాని సహజమైన కూతయే బయలుపడుచున్నది. లౌకికులు ఐహిక ఫలములను బడయుటకై ఒక్కొక్కప్పుడు హరినామ స్మరణము చేయుచుందురు. పుణ్య కార్యములను దాన ధర్మములను గూడా సాగించుచుందురు. కాని దురదృష్టవశమున దుఃఖమో, దారిద్య్రమో, మరణమో సంభవించునపుడు ఆ హరినామ స్మరణమును ఆ నియమ నిష్ఠలను అన్నిటిని మరచిపోవుదురు.
ఇంకావుంది...

శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల
శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి