సబ్ ఫీచర్

మెరిసే చర్మానికి యోగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకాశవంతమైన మెరిసే చర్మానికి యోగా ఎంతో దోహదపడుతుంది. మన ముఖాన్ని అద్దంలో చూడగానే కనిపించేది ముందుగా చర్మమే.. మరి ఆ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సంరక్షణ తప్పనిసరి. చర్మ సంరక్షణలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మరి చర్మం నిగారింపును పెంచే యోగాసనాలను చూద్దామా..
నిలబర్చే భంగిమ
శిరస్సును నిలబర్చే యోగా భంగిమను అభ్యసించడం వల్ల ముఖం, మెదడుకు రక్తప్రవాహం వేగవంతం అవుతుంది. ఈ విధమైన యోగాసనం ద్వారా చర్మంపై గీతలు తగ్గడానికి, చర్మం సాగకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఈ భంగిమ గురుత్వాకర్షణ ప్రభావాన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి ముఖ చర్మ కాంతి పెరిగేలా చేస్తుంది.
విల్లు
ఈ భంగిమలో శరీర ఆకృతిని ఊహించుకున్నట్లయితే విల్లు ఆకారంలో వంగి ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ యోగాసన అభ్యసించడం వల్ల జీర్ణవ్యవస్థ ఉత్తేజం పొందుతుంది. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది వెనె్నముక దృఢంగా అవ్వడానికి, అంతర్గత శక్తి పెరగడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తం, చర్మంలోని విష పదార్థాలను వేరుచేసి బయటకు పంపేస్తుంది. ఫలితంగా చర్మం శుభ్రపడి మెరుపులీనుతుంది.
ప్లాగ్
ఈ యోగాసనాన్ని అభ్యసించేటప్పుడు బోర్లా పడుకుని శరీరం పైభాగాన్ని నెడుతూ తలను ఆకాశం వైపు సాగదీయాలి. ఈ యోగాసనం అభ్యసించడం వల్ల శరీరంలోని హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. ఈ ఆసనం ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరుస్తుంది.
శ్వాసక్రియ
శ్వాసను గణనల ద్వారా నియంత్రిస్తుండడం వల్ల మనస్సు పునఃశక్తిని పొందుతుంది. ఫలితంగా చర్మంపై ఎలాంటి ఒత్తిడి పడకుండా అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
భరద్వాజాసన
ఈ భంగిమలో ముందుగా కాళ్ళను లోనికి మడవాలి. తరువాత రెండు చేతులను పక్కకు విస్తారించి చాపపై కూర్చోవాలి. వెనె్నముక బలోపేతం అయ్యేవిధంగా లోతైన శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు చాపపై ఎడమ చేతివైపుకు తిరగాలి. ఈ సమయంలో కుడి చేతిని కుడి తొడపై మడవాలి. ఇప్పుడు శ్వాసను బయటకు వదలాలి. కొన్ని సెకన్ల తరువాత యథాస్థానానికి వచ్చేయాలి. ఇలాగే రెండోవైపు అంటే ఎడమవైపు కూడా చేయాలి.
లాభాలు
* శిరస్సు నిలబర్చే యోగా భంగిమ వల్ల రక్తప్రవాహం వేగవంతం అయి, మలినాలు తొలగిపోతాయి.
* విల్లు భంగిమ వల్ల జీర్ణ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది.
* ప్లాగ్ భంగిమ శరీరంలోని హార్మోన్లను క్రమబద్దీకరిస్తుంది. ఫలితంగా రుతుక్రమ సమస్యలు తొలగిపోతాయి.
* శ్వాసక్రియ వ్యాయామం వల్ల మనస్సుకు ప్రశాంతత, శక్తి లభిస్తుంది.
* భరద్వాజాసన వల్ల వెనె్నముక బలోపేతం అవుతుంది. కడుపు చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోయి కండరాలు బలోపేతం అవుతాయి.