సబ్ ఫీచర్

ఆరోగ్యానికి విటమిన్లు అవసరమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండ్లు, కాయగూరలను జ్యూస్‌లాగా కాకుండా కడుక్కుని వున్నవి వున్నట్టు తింటే విటమిన్లు సమృద్ధికరంగా లభిస్తాయి. ప్రపంచంలో ఉత్తమ కెమిస్టులు (రసాయన నిపుణులు) మొక్కలు, చెట్లు అని రిట్జర్స్ యూనివర్సిటీకి చెందిన పౌష్టికాహర పరిశోధకుడు యామిహోవెల్ చెప్పాడు.
తాజా పండ్లలో వాతావరణాన్ని తట్టుకునే విటమిన్లు, లవణాలు, ప్లెవోనాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ వుంటాయని ఆయన వివరించారు. కృత్రిమ విటమిన్లకంటే ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయని, ఎక్కువ కాలం పనిచేస్తాయని చెప్పారు.
ఎ విటమిన్
విటమిన్ ఎ జలుబు, ఫ్లూ వంటివాటిని నిరోధిస్తుంది. ఎ విటమిన్ శరీరంలో సమృద్ధిగా వుంటే కాన్సర్ వచ్చే అవకాశం వుండదు. ఎ విటమిన్ శరీరంలో సరిపడా వుంటే ఊపిరితిత్తులు, పేగులు, మూత్రనాళాలు సరిగా పనిచేస్తాయి. చర్మం, మ్యూకస్ మెంబ్రేన్ (గొంతులో, ముక్కులో వుండే అతి సున్నితమైన పొరలు) రక్షణకు ఇవి ఉపయోగపడతాయి. వైరస్‌లు వీటిపై దాడి చేయకుండా విటమిన్ ఎ రక్షిస్తుంది. కంటిచూపును ఈ విటమిన్ పెంపొందిస్తుంది. ‘ఎ’ విటమిన్ గుడ్లు, పండ్లు, కాయగూరల్లో అధికంగా వుంటుంది. బీటా కెరోటిన్ అధికంగా వుండే కారెట్లకంటే వీటిలో ఎక్కువగా వుంటుంది. క్యారట్లు, వెన్న, గుడ్లు, మామిడి పండ్లు, పాలు, తీపి బంగాళాదుంపలు, పాలకూర వంటివాటిల్లో విటమిన్ ఎ అధికంగా వుంటుంది.
బి విటమిన్
విటమిన్ బి ఒకటి కాదు, ఇది మల్టీ విటమిన్. పౌష్టికాహార లోపాన్ని సవరించేది ఈ విటమినే్ల. ఇందులో థయామిన్ (విటమిన్ బి1), రిబోప్లెవిన్ (బి2), నియాసిన్ (బి3), ప్యాంటోథెనిక్ యాసిడ్ (బి5), సైరిడాక్సిన్ (బి6), బయోటిక్, ఫోలిక్ ఆసిడ్, కోబోలామిన్స్ (బి12) వుంటాయి. ఈ విటమిన్లు అన్నీ మీరు తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చుతాయి. ఇందులో కొన్ని విటమిన్లు పాత, క్షీణించిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలను ఇస్తాయి. నరాలు, మెదడు కణాలను కూడా కొన్ని బి విటమిన్లు పునరుద్ధరిస్తాయి. గర్భిణీలలో వుండే సమస్యలకు ఫోలేట్ మంచి పరిష్కార మార్గం. బి6, బి12ను కలిపి తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తక్కువ అవుతుంది. రక్తంలో ప్రమాదకరమైన హోమిసిస్టైన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఈ బి విటమిన్లు అరటి పండ్లు, ఎండబెట్టిన చిక్కుడు జాతి విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, మొక్కజొన్న, గ్రీన్ బీన్స్, ఆకుపచ్చ ఆకుకూరలు, ఉల్లిపాయలు, పెరుగు మొదలైన వాటిలో వుంటుంది.
సి విటమిన్
విటమిన్ దీనికి ఆస్కోర్బిక్ ఆసిడ్ అంటారు. ఇది రోగ నిరోధక శక్తికి ముఖ్యమైనది. దీనిని క్రమంగా తీసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ రాదు. ఇది వుండే పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె జబ్బులు, క్యాన్సర్, కీళ్ళనొప్పులు, నాడీ సంబంధ వ్యాధులు రావు. విటమిన్ సి ఎక్కడ లభ్యమవుతుందంటే- క్యాప్సికం, కాలీఫ్లవర్, కాకరకాయ, ఉసిరి, బొప్పాయి, పైనాపిల్ (అనాస), పుచ్చకాయ, మామిడిపండ్లు, జామపండ్లు, నిమ్మ, బత్తాయిలు, కమలా ఫలాలు.
డి విటమిన్
విటమిన్ డి ముఖ్యం అంటూ ఇటీవలి అన్ని పత్రికల్లోనూ, టీవీల్లోనూ ప్రముఖంగా కన్పిస్తోంది. శరీరానికి మరీ ముఖ్యంగా ఎముకలకు కాల్షియం అవసరం. ఒక వయసు దాటిన మహిళలు, పురుషులకు ఎముకలు పలుచబడతాయి. అందువల్ల ఎక్కడ జారిపడినా పెద్ద ఆర్థోపెడిక్ సమస్యలు వస్తాయి. దంతాలలో అనవసర పెరుగుదలను విటమిన్ డి నియంత్రిస్తుంది. ఈ విటమిన్ అతి కొద్ది ఆహార పదార్థాల నుంచి లభ్యమవుతుంది. సూర్యరశే్మ విటమిన్ డికి ప్రధాన వనరు. ఉదయం, సాయంత్రం బయట తిరిగితే విటమిన్ డి సహజంగా శరీరంలోకి వచ్చి ఎముకలను బలోపేతం చేస్తుంది. సూర్యరశ్మితోపాటు కొన్ని ఆహార పదార్థాలను ఇక్కడ సూచిస్తున్నాం. ఆహార పదార్థాలు- గుడ్లు, పాలు, చేపలలో లభిస్తాయి.
ఇ విటమిన్
గుండెపోటు రాకుండా రక్షించే విటమిన్ ఇది. హానికాకరమైన ఫ్రీర్యాడికల్స్‌ను ఇ విటమిన్ తగ్గిస్తుంది. మరియు హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. హానికారకమైన కొలెస్ట్రాల్ గుండెకు వెళ్ళే ధమనుల్లో కొవ్వును పేర్చి రక్తప్రసరణకు అంతరాయం కల్గిస్తుంది. విటమిన్ కెను ఉత్తేజపరచడంలో విటమిన్-ఇ కీలక పాత్ర వహిస్తుంది. విటమిన్ ఇ ఆల్మండ్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఆకుకూరలు, మామిడిపండ్లలో సమృద్ధిగా లభిస్తాయి.
కె విటమిన్
చిన్న గాయమైతే రక్తం అలా ఆగకుండా పోతూ వుంటుంది. శరీరంలో విటమిన్ కె తగినంతగా వుంటే రక్తం ఆగిపోతుంది. విటమిన్ కె ఎముకలను పటిష్టపరుస్తుంది. ఈ విటమిన్ మీ శరీరంలో సహజంగా మీ పేగుల్లోని బాక్టీరియా ద్వారా తయారవుతుంది. అయినా ఆహార పదార్థాల ద్వారా దీనిని పెంచుకోవాలి. విటమిన్ కె క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పాలకూరలలో సమృద్ధిగా లభిస్తుంది.

-బి.మాన్‌సింగ్ నాయక్