సబ్ ఫీచర్

మహోజ్వల స్వాతంత్య్ర జ్యోతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మన దేశాన్ని గతంలో ఎన్నో సామ్రాజ్యాలు పరిపాలించిన అనుభవంతో భవిష్యత్
భారతావనిని నిర్మించుకొనే నేపథ్య ప్రభావం మనకు వుంది. సంపూర్ణమైన మత,
సాంస్కృతిక స్వేచ్ఛను రాజ్యం ప్రజలకు
ప్రసాదించాలి. రాజ్యాధికారానికి మతం వుండదు. రాజకీయ, ఆర్థిక హక్కులకు
సంబంధించి, జనాభా మొత్తానికి పరిపూర్ణ సమానత్వం వుండాలి. ప్రతి వ్యక్తికి ఉద్యోగం, ఆహారం, విద్యతోపాటు మత, సాంస్కృతిక వ్యవహారాలలో స్వేచ్ఛ వున్నట్లయి
దేశంలో మైనారిటీల సమస్య తలెత్తదు’
... అంటూ 1942 ఆగస్టులో నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ బెర్లిన్ ఫ్రీ ఇండియా సెంటర్ అధికార పత్రిక ‘అజాద్ హింద్’లో ‘స్వేచ్ఛా భారతదేశం- సమస్యలు’ అనే వ్యాసంలో పేర్కొన్నారు. సుభాష్ కలలుగన్న స్వేచ్ఛ్భారతం అది.
1897 జనవరి 23న జన్మించిన సుభాష్ చంద్రబోస్ మాతృభారతి బానిస శృంఖలాలు ఛేదించటానికి 1919 నుంచి 1945 వరకు త్యాగశీల ధీరోదాత్తునిగా స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. సాహస సమరోత్తేజానికి ప్రతీకగా జీవన సర్వస్వాన్ని దేశభక్తి ప్రపూర్ణునిగా జాతికి అంకితం చేసి అనూహ్య అంతర్ధాన నిష్క్రమణలో కనుమరుగైన సుభాష్ చంద్రబోస్‌కు వర్ధంతి లేదు. భారత జన హృదయాలలో ఆయన నిరంతరం సజీవుడే. కేవలం 48 సంవత్సరాలు జీవించిన సుభాష్ జీవనయానం ప్రపంచ చరిత్రలో అపూర్వ రీతిలో నిక్షిప్తమై అంతర్జాతీయ దీప్తితో కీర్తివంతమైంది.
స్వదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రశ్రేణి నేతగా, విదేశాలలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సమరసేనకు సైన్యాధ్యక్షునిగా ఆయన నిరంకుశ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆగర్భశత్రువుగా అమరత్వం సాధించారు.
స్వాతంత్య్ర సాధనకు రాజమార్గం లేదని, స్వేచ్ఛా స్వా తంత్య్రాలను పోరాటం, త్యా గాల ద్వారానే సాధించాలని, యాచన ద్వారా లభించే స్వేచ్ఛకంటే రక్తాన్ని పణంగా స్వాతంత్య్రం సాధించాలనే జీవితాశయం సుభాష్‌ను ద్వి తీయ ప్రపంచ సంగ్రామం దిశగా మలుపుతిప్పింది. ‘మీ రు నాకు రక్తాన్ని ఇవ్వండి. నేను మీకు స్వేచ్ఛనిస్తా..’ అన్న ఆయన మాట సమర నినాదం అయింది. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అటు అహింసాత్మకం, ఇటు ఆయన సమరోత్తేజం రెండింటినీ అత్యంత శక్తివంతంగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మాతృభూమి స్వాతంత్య్ర సముపార్జన ఏకైక లక్ష్యంగా జీవించిన నేతాజీ పేరు ఎవరికైనా ఒళ్లు పులకింపచేస్తుంది. ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో చేతులు కలిపిన సుభాష్ చంద్రబోస్ రాజనీతి స్వతంత్య్ర భారత ఆవిర్భావాన్ని సుగమం చేసింది.
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఒకప్పటి వందేమాతరం నినాదం సమర యో ధుల పెదాలపై నినదించినట్టే నేతాజీ ఇచ్చిన ‘్ఛలో ఢిల్లీ’, ‘జైహింద్’ నినాదాలు ఆజాద్ హింద్ ఫౌజ్ సమరయోధుల అంతిమ పోరాటంలో కదం తొక్కాయి. 1941 జనవరిలో బ్రిటిష్ ప్రభుత్వం కళ్లు కప్పి దేశం నుంచి అంతర్ధానం, 1943లో జలాంతర్గామిలో జపాన్ చేరిన సాహసిక యానం సుభాష్ చంద్రబోస్ జీవిత ఆద్యంతం సాహసిక త్యాగ సమరగాథగా చరిత్ర పులకించింది. రెండవ ప్రపం చ యుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వాధినేతగా 1943 అక్టోబరు 23న నేతాజీ బ్రి టన్, అమెరికాలపై యుద్ధం ప్రకటించారు. 1944 జనవరి నాటికి రంగూన్ ఆయన కార్యస్థానమైంది. 1944-45 సంవత్సరాలలో మాతృభూమి వైపు పురోగమించే ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్‌ఏ)కి దురదృష్టవశాత్తూ విషాద దినాలు ఎదురయ్యాయి. ప్రప్రథమంగా భారతీయ జాతీయ పతాకం అండమాన్ దీవులలో బ్రిటిష్ ప్రభుత్వ ధిక్కార చిహ్నంగా సుభాష్ చంద్రబోస్ ఎగురవేయటంతో మాతృభూమి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రపంచంలో ఏ శక్తీ నిరోధించటం ఇక అసాధ్యమని ప్రపంచం గుర్తించింది. 1945 జూలై 8న సింగపూర్‌లో ఐఎన్‌ఏ స్మారక చిహ్నానికి నేతాజీ శంకుస్థాపన చేశారు. 1945 ఆగస్టు 18న ఆయన విమాన ప్రమాద అంతిమ ఘట్టం ఒక మిస్టరీగా మిగిలిపోయింది.
‘మీరు చేసిన మహోన్నత త్యాగాల ఫలితంగా బానిసలుగా కాక స్వేచ్ఛా జీవులుగా జన్మించే భావితరాల భారతీయులకు, తాత్కాలిక వైఫల్యాలు ఎదురయినా, మీరు అంతిమ విజయానికి జాతి కీర్తి ప్రతిష్టలకు మార్గం సుగమం చేసారని ప్రపంచానికి తెలుస్తుంది.’
... అని నేతాజీ అనేవారు. ఆయన భారత్‌లో స్వాతంత్య్ర భానోదయం చూడలేదు. 1945లో ఆయన పునరాగమనం కోసం భారత జాతి ఎంతగానో తపించింది. ప్రజాస్వామ్య సమాజ ఆవిర్భావాన్ని ఆశించిన నేతాజీ, సాంస్కృతిక సాన్నిహిత్యం ద్వారా మత సామరస్యానికి, శాంతి సుహృద్భావాలను సర్వజనావళి సంక్షేమ రాజ్యాన్ని ఆకాంక్షించారు. ఆయన బతికి ఉంటే గనుక దేశ విభజనను మత ప్రాతిపదికపై జరిగేందుకు ఆమోదించి వుండేవారు కాదు. మూడు దర్యాప్తు కమిషన్‌లు, 200 రహస్య ఫైళ్లు ఆయన జీవిత విషాద చరమ ఘట్టాన్ని నిర్ధారించలేదు. భారతావని ఉన్నంతకాలం ఆయన ఆరాధ్యనీయుడే.

-జయసూర్య 94406 64630