సబ్ ఫీచర్

అతివ్యాయామం ముప్పే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒత్తిడి, అతివ్యాయామం వంటివి రుతుక్రమంపై ప్రభావం చూపించవచ్చు. వాటివల్ల రక్తస్రావం తీవ్రంగా కావడం, లేదా కొద్దిగా కావడం, లేదా మొత్తానికి కాకుండా ఉండడం జరగవచ్చు. ఎందుకంటే శరీరం కఠిన శిక్షణను తీసుకున్నప్పుడు శరీరం ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల రుతుక్రమం రాకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే.. శరీరం తగినంత ఈస్ట్రోజన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే.. ఈస్ట్రోజన్ హార్మోన్ స్ర్తి జననేంద్రియాల ఆరోగ్యానికే కాదు, ఎముకలను బలంగా ఉంచడానికీ ఉపయోగపడుతుంది. అందుకే మహిళలకు రుతుక్రమం సరిగా రానప్పుడు, ఎముకలకు అవసరమైన పోషకాలు అందించడం కుదరదు. అలా.. మహిళలే తమ ఎముకలను బలహీనంగా మార్చేస్తారు. వారం పాటు ఏదైనా కఠిన శిక్షణ తీసుకోవడానికి బదులు వారంలో కొన్నిసార్లు చాలా తక్కువగా వ్యాయామాలు చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి రోజూ తగినంత పోషకాహారం తీసుకోవాలి.. కంటినిండా నిద్రపోవాలి.
రుతుచక్రం సాధారణంగా 28 రోజులకు వస్తుంటుందని అందరూ భావిస్తారు. కానీ నిజానికి ఇది సగటు మహిళకు మాత్రమే జరుగుతుంది. బహుశా పది మందిలో ఒకరికి మాత్రమే ఇలా 28 రోజుల రుతుచక్రం ఉంటుంది. సాధారణ రుతుచక్రం ఎలా అయినా ఉండొచ్చు. అనేది మహిళలు వారి వారి నెలసరి తేదీలను అనుసరించి ఊహించుకోవచ్చు.
రుతుచక్రంలో వివిధ సమయాల్లో హార్మోన్ల స్థాయి పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. సరిగ్గా నెలసరి వచ్చే ముందు ప్రొజెస్టరాన్ స్థాయి శరీరంలో పెరుగుతుంది. అది మహిళల్లో చాలా లక్షణాలకు కారణం అవుతుంది. అంటే వక్షోజాలు పెద్దవి కావడం, నొప్పిగా ఉండటం, తలనొప్పి, వికారంగా ఉండటం, కోపంగా ఉండటం వంటి లక్షణాలు.. ప్రొజెస్టరాన్ అనేది ప్రొ-జెస్టేషన్ హార్మోన్ అంటే గర్భధారణకు అనుకూలంగా ఉండే హార్మోను.. అంటే సాధారణంగా ఈ హార్మోన్ వల్లే మహిళలు గర్భం ధరిస్తారు. అందుకే నెలసరి సమయంలో శరీరంలో ప్రొజెస్టరాన్ ఎక్కువగా విడుదలవుతుంది. అలా మహిళల్లో చాలా నీరు నిలువ ఉంటుంది. అదే వక్షోజాలు పెద్దగా అయ్యేలా చేస్తుంది. కొంతమంది మహిళల్లో ఐబీఎస్ (ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్) లక్షణాల్లా ఇవి చాలా ఉబ్బిపోతాయి. అంతే అదంతా మహిళల రుతు చక్రం సమయంలో రకరకాల హార్మోన్ల వల్లే జరుగుతుంది.
మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారు తమ శరీరం ఏం చేస్తుంది అనేదానిపై వారు పూర్తి అవగాహనతో, జాగ్రత్తగా ఉండాలి. అంటే పరిస్థితులు సరిగా అనిపించనపుడు మహిళలు తెలుసుకోగలిగేలా ఉండాలి. వజైనల్ డిశ్చార్జ్ గురించి చాలామంది మహిళలు తీవ్రంగా ఆందోళనకు గురికావడం చూస్తూంటాం. మహిళల డిశ్చార్జ్ నెల, నెలా మారుతూనే ఉంటుంది. హార్మోన్లు ఏం చేస్తున్నాయనేదాన్ని అనుసరించి డిశ్చార్జ్ మారుతూ ఉంటుంది. మొత్తం నెల అంతా డిశ్చార్జ్ మారుతూ ఉంటే, అది ఆ సమయంలో శరీరంలోని హార్మోన్ల స్థాయిపై ఆధారపడి ఉంటుంది. కానీ డిశ్చార్జ్‌లో గణనీయ మార్పులు కనిపిస్తే వెంటనే ఆ మహిళ డాక్టర్ సలహాను తీసుకోవాలి. శరీరంలో ఎక్కడ, ఎలాంటి పొరపాటు జరిగిందో తెలుసుకునేముందు, అసలు సాధారణంగా డిశ్చార్జ్ ఎలా అవుతుంది అనే విషయం కూడా డాక్టర్‌ను అడిగి తెలుసుకోవాలి.
పురుషుల కంటే మహిళల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఎందుకు ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది సర్వసాధారణం.. ఎందుకంటే మహిళల్లో హార్మోన్లు కొవ్వుతో తయారవుతాయి. కొలెస్ట్రాల్‌తో తయారవుతాయి. శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు వాటి నుంచే వస్తాయి. జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉండటానికి, ముఖ్యమైన అవయవాల రక్షణకు మహిళలకు శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉండడం చాలా అవసరం. కొవ్వు కణజాలంతోనే ఈస్ట్రోజన్ హార్మోన్ తయారవుతుంది. అందుకే తక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల రుతుచక్రంపై ఆ ప్రభావం కనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే శరీరానికి కావలసిన పోషకపదార్థాలు అందించకపోతే.. అవి సరైన రీతిలో హార్మోన్లను తయారుచేసుకోలేవు.. హార్మోన్ల ప్రభావం శరీరం మొత్తంపై ప్రభావం పడుతుంది. కాబట్టి శరీరాన్ని అర్థం చేసుకుంటూ, దానికి సరైన రీతిలో పోషకాహారాన్ని అందిస్తూ, ఆరోగ్యంగా ఉంచుకుంటే ఆరోగ్యంతో పాటు ఆరోగ్యం, ఆనందంతో పాటు ఆనందం కలుగుతుంది.