సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

153. సమారాధనకు పలువురు ఆహ్వానింపబడినపుడు వారు చేయు గోల విశేషముగా వినవచ్చును. కాని యా గందరగోళము అంతయు వారు భోజనము ఆరంభించునంతవరకే. వడ్డన అయిన భోజనము ప్రారంభించుసరికి శబ్దము ముప్పాతిక పాలు అణిగిపోవును. ఇక బూరెలు వచ్చును- వడ్డన సాగిన కొలది శబ్దము క్షీణించుచుండును. మజ్జిగ దగ్గరకు జర్రుకొను శబ్దముదక్క మరేదియు వినబడదు. భోజనములు అయినంతనే ఇక వారు చేయు పని నిద్రపోవుటయే.
దైవసాన్నిధ్యమును బొందినకొలదియు ప్రశ్నలందును హేతువాదములందును నీకు రుచి తగ్గిపోవుచుండును. ప్రత్యక్షముగ దైవమును దర్శించినంతనే ఈ వాదోపవాదములన్నియు, ఈ గందరగోళము అంతయు పూర్తిగా అణిగిపోవును. అపుడు నిద్రా సమయము, అనగా సమాధి స్థితియందు బ్రహ్మానందమును బొందు సమయము వచ్చును.
154. తేనెటీగ పుష్ప దళములలోనికి బ్రవేశించి యందలి మకరందమును చవిచూడకుండునంతవఱకు బయటనేయుండి దాని చుట్టును ఝంకారము చేయుచు దిరుగుచుండును. కాని యది పూవులోనికి ప్రవేశించినంతనే నిశ్శబ్దముగా మకరందమును గ్రోలనారంభించును. వాదములను గూర్చియు సిద్ధాంతములను గూర్చియు చర్చించుచున్నంతవఱకు మానవుడు తత్త్వామృతమును రుచి చూడనివాడే. దానిని రుచి చూచెనా, వాదోపవాదాదమలకు స్వస్తి చెప్పును.
155. క్రొత్త భాషను నేర్చుకొన మొదలిడినవాడు తన సంభాషణలందు ఆ భాషా పదములను తఱచు వాడుచు, తన ప్రజ్ఞను ప్రదర్శింపజూచుచుండును. కాని దానిని బాగుగా నేర్చినయతడో, మాతృభాషను మాటలాడునపుడు ఆ నూతన భాషా పదములను ఉపయోగింపనే ఉపయోగింపడు. ఆధ్యాత్మిక సాధనలలో అభివృద్ధి పొందిన వారి విషయము కూడ నిట్టిదే.
156. సంతకు దూరమున్న నున్నప్పుడు ‘హోహో’యను పెద్దగోల వినబడును. సంతలో బ్రవేశించిన పిమ్మట ఆ శబ్దము వినబడదు. కాని యచట జరుగుచున్న బేరసారములు తెలియవచ్చును. అటులనే భగవంతుని దూరముగానున్నంత వఱకు నరుడు నిరర్థక వాదోపవాదములను గందరగోళములో నిమగ్నుడై యుండును. కాని భగవంతుని సమీపింపగనే యుక్తులును వాగ్వాదములును అన్నియు శాంతింప భగవల్లీలలను స్పష్టముగా గాంచును.
157. కాగుచున్న నేతిలో అప్పచ్చులను వేయునపుడు సలసలమని ధ్వని పుట్టును. కాని యవి వేగినకొలదియు ధ్వని తగ్గుచుండును. పూర్తిగా వేగినంతనే శబ్దము అణగిపోవును. అల్పజ్ఞానియైయున్నంతవఱకు నరుడు ప్రసంగములను బోధోపదేశములను అదే పనిగా సాగించుచుండును; కాని బ్రహ్మజ్ఞానము లభించెనేని ఈ పటాటోపము అంతయు అణగిపోవును.
158. ఈశ్వరానుగ్రహము లభించునపుడెల్లరును తమ దోషములను గుర్తెఱుంగుదురు; దీనిని గ్రహించినవాడు వాగ్వాదములలోనికి దిగడు.
పాండిత్యమునకు నిజమైన ప్రయోజనమేమి?
159. భగవంతుని బొందు మార్గమును జూపుటయే ధర్మశాస్తమ్రులు చేయు పని. మార్గమును గ్రహించిన పిమ్మట పుస్తకములతో పనియేమి? ఇకనేకాంతముగా సాధన చేయవలసి యుండును. తనబందుగులకు ఏవో కొన్ని వస్తువులను బంపుమని యింటినుండి ఒకనికి ఉత్తరము వచ్చినది. ఆతడా వస్తువులను కొనబోవునపుడు ఉత్తరములో ఏ వస్తువులు పంపుమని వ్రాయబడెనో నిర్ధారణగా దెలియగోరెను. ఉత్తరముకోసము చూడగా అది కనబడలేదు. అందుచే చాలసేపు వెదకినాడు. తుదకది యెట్లో కన్పించినది. మహానందముపొంది దానిని ఆత్రముతో జదువనందిట్లున్నది: ‘‘ఐదు సేర్ల మిఠాయి, వంద నారింజపండ్లు, ఎనిమిది ధోవతులు పంపుడు.’’
సంగతులు తెలియగనే ఉత్తమమును ఆవలబెట్టి కావలసిన వస్తువులు కొనరారంభించినాడు.
ఇంకావుంది...
శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల
శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి