సబ్ ఫీచర్

మోదీ నాయకత్వమే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రేతాయుగానికి చెందిన శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచినందునే లక్షల సంవత్సరాల తర్వాత కూడా తమకు రామరాజ్యం కావాలని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యావత్ ప్రజలు, నాయకులు కోరుకునేవారు. స్వాతంత్య్రం సిద్ధించాక భారతదేశానికి తొలి ప్రధానిగా సర్దార్ వల్లభబాయి పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లలో ఎవరో ఒకరు బాధ్యతలు చేపడితే బాగుండేదని అలనాడు ప్రజలు కోరుకునేవారు. దురదృష్టవశాత్తు జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కావడంతో- దాదాపు గత డెబ్భై సంవత్సరాలుగా ప్రజల ఆకాంక్ష అంధకారంలో మగ్గినది. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పాలనలో భారత్ అవినీతిమయమైన దేశంగా మారింది.
డెబ్భై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కుటుంబ పాలకులు, అక్రమ సంపాదకులు, విదేశీ భావజాలానికి తొత్తులుగా ఉన్నవారు పాలించడం వల్ల కులం, మతం, సామాజిక వర్గాల పేరిట గిరిజనులు, దళితులు, వెనుకబడినవారు, అగ్ర కులాలు, మైనారిటీలు అనే పద ప్రయోగాలతో సమాజాన్ని నిర్వీర్యం చేస్తూ రాజకీయ పార్టీలు, వాటి నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయి. ప్రజలను వంచిస్తూ, తమ పబ్బం గడుపుకుంటూ ఈ దేశాన్ని కాంగ్రెస్ పాలకులు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతిక పరంగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ఇక, రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన రిజర్వేషన్లను పొందిన వారు నిరంతరాయంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా, పారిశ్రామిక రంగాలలో కొందరు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. రిజర్వేషన్లకు అర్హత ఉండి కూడా డెబ్భై సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈనాటికి కూడా లబ్ధిపొందక అట్టడుగున ఉన్నవారే అత్యధికులు. ఇలాంటి దుష్ట సంప్రదాయాన్ని గుర్తించి, అన్యాయాన్ని అంతమొందించే దిశగా ప్రజలు నిర్ణయాలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది.
దుర్మార్గుల పాలన నుండి దేశ ప్రజలకు ముక్తి కలిగించేందుకు 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేసేలా భగవంతుడు భారత దేశ ప్రజలకు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటింపజేసి పరీక్ష పెట్టినాడు. ఆ పరీక్షలో దేశ ప్రజలు సఫలీకృతులైనారు. డెబ్భై సంవత్సరాలుగా అస్తవ్యస్తమైన వ్యవస్థలను సరైన దిశకు తీసుకురావడానికి ప్రధాని మోదీ అలుపెరుగని కృషి చేయడం కాంగ్రెస్ సహా ఇతర విపక్ష నాయకులకు నచ్చడం లేదు. ఆర్థిక నేరస్థుల, తీవ్రవాదుల నడ్డి విరుస్తూ, దేశ సంపదను పెంచడంలోనూ, సరిహద్దులను కాపాడటంలోనూ ప్రధానమంత్రి మోదీ తీసుకొంటున్న కఠిన నిర్ణయాలకు కాంగ్రెస్ నాయకులు కంగుతింటున్నారు. వివిధ కుంభకోణాలలో కూరుకుపోయిన కుటుంబ పాలకులు, బెయిల్‌పై ఉన్నవారు, స్టే పొందినవారు- ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’ నినాదంతో ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మోదీ ప్రతిష్టను చూసి జీర్ణించుకోలేక పోతున్నారు. జాతీయ నిష్ఠలేని నాయకులు, నిరంతరం మాయమాటలతో రాజకీయ లబ్ధి పొందేవారు మోదీని చూచి భయభ్రాంతులకు గురవుతున్నారు.
మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి దేశంలోనే గుజరాత్ రాష్ట్రాన్ని ఒక నమూనాగా తీర్చిదిద్దిన మోదీ పరిపాలనను జీర్ణించుకోలేని ఆనాటి యుపిఏ ప్రభుత్వం చేసిన కుటిల పన్నాగం దేశ ప్రజలకు ఇదివరకే తెలుసు. అమెరికా సందర్శనకు మోదీకి వీసా ఇవ్వకూడదంటూ ఆ దేశ అధ్యక్షుడికి కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఎమ్‌ఐఎమ్ మొదలైన వారి సంతకాలతో కూడిన ఒక పత్రాన్ని ఒబామాకు పంపినారు. ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని అపహాస్యం చేస్తూ ఆయనను సమాజంలో దిగజార్చాలనే ప్రయత్నంగా, జిల్లా స్థాయి పోలీసు అధికారితో నిరంతరాయంగా 9 గంటలు విచారింపచేసి- చివరికి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిన యుపిఏ ప్రభుత్వ దుష్ట రాజకీయాలకు తెర పడింది. వీసా ఇచ్చేందుకు అంగీకరించని ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాగానే, ఎన్‌డీఎ ప్రభుత్వ పాలనా విధానాన్ని, జాతీయ నిష్ఠను, సమాజ సంక్షేమానికి తీసుకొంటున్న కఠిన నిర్ణయాలు, సరిహద్దు రక్షణ, సైనికుల పరిరక్షణ, ఆయుధ సంపత్తి, విదేశీ విధానాలను గుర్తించి స్నేహహస్తం అందించాడు. ఒబామా సహా మోదీని అభినందించిన విదేశీ ప్రముఖులు, మేధావులు ఎందరో!
పెట్రోల్ కొనుగోలులో యుపిఏ ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల రూపాయల అప్పును నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినాక తీర్చేసి దేశ ప్రజలపై ఆర్థిక భారాన్ని తప్పించినాడు. ఇప్పటికే రిజర్వేషన్ పొందుతున్న వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆర్థికంగా వెనుకబడ్డ సవర్ణులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించి ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’కు సార్థకం చేకూర్చినాడు. దేశ ప్రజల మన్ననలను పొందినాడు. ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించాలని కలలు గనేవారు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ సంపాదననే పరమావధిగా పెట్టుకుని బెయిల్‌పై ఉన్నవారు, తమపై కేసులు వేయగా ‘స్టే’ ఉత్తర్వులు తెచ్చుకున్నవారు, ఇప్పటికే రాజకీయంగా ఉనికి కోల్పోయినవారు, కోల్పోతున్నవారు అజెండాల ప్రస్తావన లేకుండా పొత్తు రాజకీయాలు నడుపుతున్నారు. తమ వ్యక్తిగత లాభాపేక్ష తప్ప దేశ ప్రజల సంక్షేమం పట్టని గ్యాంగ్ కోల్‌కతలో ఇటీవల జరిపిన ‘యునైటెడ్ బ్రిగేడ్ ఇండియా’ ర్యాలీ ఉద్దేశం- మోదీ తిరిగి ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవడమే. ప్రజల సంక్షేమం వీరి అజెండా కానే కాదు. దుష్టశిక్షణ, శిక్ష రక్షణ చేయగల సమర్థుడిని 2019లో కోల్పోవడానికి ఈ దేశ ప్రజలు సిద్ధంగా లేరనేది విజ్ఞులైన ఓటర్లు ఇవ్వబోయే నిశ్శబ్ద తీర్పు. ‘‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’’ మళ్ళీ వికసించబోతుంది.

-బలుసా జగతయ్య 90004 43379