సబ్ ఫీచర్

వ్యక్తిగత పరిశీలన తప్పనిసరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనె్నండేళ్ల నుంచి ఆడపిల్లలకు వైట్ డిశ్చార్జ్ (తెల్లబట్ట) సమస్య మొదలువుతుంది. ఈ విషయం గురించి వారికి అంతగా తెలియదు. కొంతమంది తల్లులకు ఈ విషయం చెబుతారు.. కొందరు మాత్రం ఈ విషయం బయటకు చెప్పడానికి ఇష్టపడరు. పనె్నండేళ్ల వయస్సు నుంచి మెనోపాజ్ వరకు ఈ సమస్య ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతుంది. దీని గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు. తెలుసుకోవడానికి చాలామంది మొహమాటపడుతుంటారు. అలాకాకుండా తమ శరీరంలో జరిగే మార్పులను తల్లితోనో, పెద్దవారితో చర్చించడం వల్ల సమస్యకు తగిన పరిష్కారం దొరుకుతుంది. అంతేకాక కుటుంబ వైద్యునితో కూడా ఈ సమస్య గురించి చర్చించవచ్చు. దీని గురించి వైద్యశాస్త్రం ఏం వివరిస్తోందో తెలుసుకుందాం..
నోట్లో లాలాజలం ఎలా తయారు అవుతుందో, అలాగే మహిళల జననేంద్రియాల నుంచి కూడా తెల్లని స్రావం తయారవుతుంది. దీనే్న వాడుక భాషలో తెల్లబట్ట (వైట్ డిశ్చార్జ్) అంటారు. వైద్య పరిభాషలో ‘ల్యూకోరియా’ అంటారు. ఇది ప్రధానంగా గర్భాశయ ముఖ ద్వారం (సర్విక్స్)లో ఉండే గ్రంథుల నుంచి యోని మార్గంలోకి స్రవిస్తుంది. యోనిమార్గంలో ఎలాంటి గ్రంథులూ ఉండవు. దీనిలో ద్రవ పదార్థంతో పాటు మృతకణాలు, జననేంద్రియాలకు మంచి చేసే బాక్టీరియా కూడా ఉంటుంది. ఈ బాక్టీరియాని ‘డోడర్‌లైన్ బాసిల్లై’ అంటారు. ఇవి మృతకణాలలోని గ్లైకోజన్‌ని విడగొట్టి లాక్టిక్ యాసిడ్‌ను తయారుచేసి వెజైనల్ పి.హెచ్.ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఈ చర్య వ్యాధికారక సూక్ష్మజీవులు జననేంద్రియాలలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. అలా ఈ ద్రవపదార్థం జననమార్గం తడిగాను, ఆరోగ్యంగా ఉండటానికి, సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించకుండా రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. సాధారణంగా రోజుకు దాదాపు 10 మిల్లీలీటర్ల వరకు ఈ తెల్లబట్ట కనిపిస్తుంటుంది. కొన్ని పరిస్థితుల్లో మాత్రం ఇది ఎక్కువవుతుంది. ఈ పరిస్థితులను రెండు రకాలు..
ఫిజియొలాజికల్ ల్యూకోరియా
ఇది ఏదైనా వ్యాధి వల్ల వచ్చే తెల్లబట్ట కాదు. దీనికి ఎలాంటి చికిత్సా అవసరం లేదు. దీనివల్ల దుర్వాసన, దురద వంటి సమస్యలేవీ ఉండవు. శారీరకంగా, మానసికంగా ఉద్రేకానికి గురైనప్పుడు ఇది వస్తుంది. ఇది దాదాపు అన్ని వయసువారిలో కనిపిస్తుంది. పది నుండి పనె్నండు ఏళ్ల వయసులో.. అంటే రజస్వల కావడానికి ముందు సుమారు మూడు నుంచి ఆరు నెలల పాటు తెల్లబట్ట అవుతుంది. ఇది జననావయవాల పెరుగుదల, రక్త సరఫరా ఎక్కువ కావడాన్ని సూచిస్తుంది. దీనికి ఎటువంటి చికిత్స అవసరం. లేదు. బహిష్టు రావడానికి నాలుగైదు రోజుల ముందు కానీ, పది పనె్నండు రోజుల ముందు కానీ తెల్లబట్ట కనిపించడం సర్వసాధారణం. నెల మధ్యలో అంటే అండం విడుదలయ్యే సమయంలో కనిపించే తెల్లబట్ట కొంత చిక్కగా ఉంటుంది. గర్భిణులుగా ఉన్నప్పుడు తొలినెలల్లో, నిండు నెలల్లో అయ్యే తెల్లబట్ట జననావయవాల పెరుగుదలను, రక్త సరఫరా వృద్ధిని సూచిస్తుంది. బహిష్టులు ఆగిపోయే దశలో కూడా హార్మోన్ల సమతుల్యత సరిగా లేక తెల్లబట్ట అవుతుంది.
పెథలాజికల్ ల్యుకోరియా
ఇది దుర్వాసన, దురదతో కూడి ఉంటుంది. ఇది రకరకాల ఇన్‌ఫెక్షన్‌ల వల్ల వస్తుంది. ట్రైఖోమోనాస్ వజైనాలిస్ ఇన్‌ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సుమారు నూటికి యాభైమందిలో ఈ సూక్ష్మజీవి కనిపిస్తూ ఉంటుంది. జననమార్గమంతా దురద, మంటగా ఉంటుంది. దుర్వాసనతో కూడిన ఆకుపచ్చ రంగు స్రావాలు మహిళలను ఇబ్బంది పెడతాయి. ఈ సూక్ష్మజీవి లైంగిక సంబంధాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి చికిత్స భార్యాభర్తలిద్దరికీ ఇవ్వాలి. ఫంగల్ ఇన్‌ఫెక్షన్లలోనూ ఇలాగే ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గినవారికీ, మధుమేహ వ్యాధిగ్రస్తులకూ ఇది ఎక్కువగా వస్తుంది. కొన్నిసార్లు సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులే కాక, జననేంద్రియాలలో వచ్చే కణుతులు, గడ్డలు, కేన్సర్‌లు తెల్లబట్టకూ కారణమవుతాయి. కాబట్టి 40 నుంచి 60 సంవత్సరాల మహిళలు ఎలాంటి నొప్పి, బాధ లేకపోయినా కూడా పాప్‌స్మియర్ అనే పరీక్ష చేయించుకుని కేన్సర్ లేదని నిర్ధారించుకోవాలి.
జాగ్రత్తలు
* వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
* కాటన్ లోదుస్తులు వాడటం.
* బహిష్టు సమయంలో శానిటరీ నాప్కిన్స్ వాడడం, వాటిని ప్రతి రెండు గంటలకూ వాటిని మార్చుకోవడం.
* జననేంద్రియాలను గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవడం.
* గాఢమైన కెమికల్స్ కలిగి వుండే డెట్టాల్, సబ్బులు వాడకూడదు. మైల్డ్ సోపుతోనే జననేంద్రియాలను శుభ్రపరచుకోవాలి.
* జననేంద్రియాల వద్ద ఎలాంటి పెర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యాలు వాడరాదు.
గర్భాశయ ముఖద్వార కేన్సర్‌లో ప్రధానంగా కనిపించే లక్షణం కూడా తెల్లబట్టే.. అయితే ఈ తెల్లబట్ట రంగు మారి లేత పసుపుగా లేదా ఆకుపచ్చగా ఉన్నప్పుడు, చాలా దుర్వాసనగా ఉన్నప్పుడు, దురద కలిగిస్తున్నప్పుడు దీన్ని కేన్సర్‌గా పరిగణించి వెంటనే వైద్య చికిత్సను తీసుకోవాలి.